Yahya Sinwar : హమాస్ అధినేత యహ్యా సిన్వ ర్ ప్రాణాలతో లేడా.? ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏం చెబుతుంది?
Yahya Sinwar : హమాస్ లీడర్ యహ్యా సిన్వర్ చనిపోయినట్లు వార్తలు.. ధ్రువీకరించని ఇజ్రాయెల్ సైన్యం. కొద్దిరోజులుగా కనిపించని కదలికలు.. అక్టోబర్ 7 దాడుల మాస్టర్ మైండ్‌గా ఆరోపణలు..
Hamas Leader Yahya Sinwar Dead: పాలస్తీనాలోని గాజపై ఇజ్రాయెల్ దళాలు జరుపుతుతున్న దాడుల్లో హమాస్ చీఫ్ యహ్యా సిన్వర్ హతమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత కొద్ది కాలంగా అతడి కదలికలు పూర్తిగా ఆగిపోవడంతో ఈ అనుమానాలు బలపడినట్లు తెలుస్తోంది. ఐతే హమాస్ కమాండర్ల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీసే కుట్రలో భాగంగానే ఇజ్రాయెల్ ఈ తరహా వార్తలు వ్యాప్తి చేస్తోందన్న విమర్శలు వినిపిస్తుండగా యహ్యా మృతిచెందాడన్న సమాచారం తమ దగ్గర స్పష్టంగా లేదని ఇజ్రాయెల్ చెబుతోంది.
2023 అక్టోబర్ 7 మారణహోమం రూపకర్త యహ్యా సిన్వర్:
2023 అక్టోబర్ 7వ తేదీని ఇజ్రాయెల్‌లో హమాస్ నరమేథం సృష్టించగా.. హమాస్ అధినేతగా యహ్యా సిన్వర్ ఈ కుట్ర వెనుక ఉన్నట్లు ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఆ ఘటన తర్వాత రోజుల వ్యవధిలోనే వైమానికి దాడులతో గాజాపై విధ్వంసం సృష్టించిన ఇజ్రాయెల్ సైన్యం.. తర్వాత నేరుగా రంగంలోకి దిగి హమాస్ సొరంగాలను అనేకం కూల్చి వేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే గతంలోనూ ఒకసారి సొరంగం కూలిన ఘటనల్లో సిన్వర్ చనిపోయినట్లు వార్తలు వచ్చినా.. అతడు ఇజ్రాయెల్ సైన్యంకి దొరకకుండా ఉండేందుకు.. ఉంటున్నట్లు తేలింది.
శనివారం నాటి వైమానిక దాడిలో 22 మంది మృతి:
గాజా స్ట్రిప్‌లోని ఆశ్రయం కోల్పోయిన పాలస్తీనా వాసులు తలదాచుకుంటున్న ఓ పాఠశాల భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దళం జరిపిన దాడుల్లో 22 మంది మృత్యువాత పడ్డారు. ఈ పాఠశాలను హమాస్ తమ కమాండ్ కంట్రోల్ రూమ్‌గా వాడుకుంటోందని ఇజ్రాయెల్ సైన్యం చెప్పింది., ఇప్పుడు దానిని ధ్వంసం చేశామని తెలిపింది. ఈ దాడిలో యహ్యా సిన్వర్ చనిపోయి ఉంటాడని అనుమానిస్తున్న ఇజ్రాయెల్ దళాలు.. అతడి మరణాన్ని ధ్రువీకరించే సాక్ష్యాల కోసం వెతుతున్నాయి. ఇజ్రాయెల్ న్యూస్ ఏజెన్సీలు మాత్రం యాహ్యా సిన్వర్ చనిపోయినట్లు విపరీతంగా వార్తలు ప్రసారం చేస్తున్నాయి. అయితే ఇది హమాస్ కమాండర్ల స్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు ఇజ్రాయెల్ పన్నిన ఎత్తుగడగానూ కొందరు అంచనా వేస్తున్నారు. అటు ఇజ్రాయెలీ జర్నలిస్టు బరాక్ రావిడ్ Xలో ఈ విషయంపై ట్వీట్ చేశారు. హమాస్ లీడర్ సిన్వర్ మృతిని ధ్రువీకరించే ఆధారాలు ఏవీ తమ దగ్గర లేవని సైన్యం తెలిపినట్లు పేర్కొన్నారు.
Two Israeli officials with direct knowledge told me Israel doesn't have positive intelligence that suggests Hamas leader Yahya Sinwar is dead. "It is all hopes and guesses which are based on the fact the Sinwae has been incommunicado in recent weeks", an Israeli official told me
— Barak Ravid (@BarakRavid) September 22, 2024
అసలు ఎవరీ సిన్వర్:
1962లో పుట్టిన సిన్వర్.. 1987లో హమాస్ స్థాపించి తొలినాళ్ల నుంచే అతడు ఒక సభ్యుడుగా ఉన్నాడు. అతడు సెక్యూరిటీ వింగ్ చూసుకునే వాడు. తమ హమాస్ గ్రూప్‌లో ఉన్న ఇజ్రాయెల్ గూఢఛారులను వెతికి చంపడమే అతడి పని. ఈ క్రమంలో 1980ల్లో ఇజ్రాయెల్ 12 మంది కొలాబరేటర్స్‌ను చంపడం సహా ఇద్దరు ఇజ్రాయేలీలను చంపిన కేసులో అతడ్ని ఇజ్రాయెల్ అరెస్టు చేసి శిక్ష విధించింది. జైలులో మార్పులు డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టే వాడు. హీబ్రూ సహా ఇజ్రాయెలీ సొసైటీలో చదువుకున్నాడు. 2008లో ఇతడు బ్రెయిన్ క్యాన్సర్ బారిన పడగా.. ఇజ్రాయెల్ వైద్యులు కాపాడారు. క్రాస్ బార్డర్ ఎక్సేంజ్‌లో భాగంగా ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ తీసుకున్న నిర్ణయంతో 2011లో ఇజ్రాయెల్ సైనికులను హమాస్ విడుదల చేసినందుకు గాను సిన్వర్‌ను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఇతడే ఆ తర్వాత 2023 అక్టోబర్ 7 దాడులకు కుట్ర పన్నినట్లు ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఆ నాటి నరమేథంలో 12 వందల మంది ఇజ్రాయేలీలు చనిపోగా.. ఆ తర్వాత.. గాజపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో దాదపు 40 వేల మంది వరకు చనిపోయారు. వీరిలో పౌరులు కూడా ఉన్నారు.