Nobel Prize winners: క్వాంటమ్ శాస్త్రవేత్తలకు నోబెల్స్ - గూగుల్‌లో పని చేసిన వారే మేధావులు - సుందర్ పిచాయ్ సంతోషం !
Sundar Pichai: ఫిజిక్స్ లో ముగ్గురికి నోబెల్ బహుమతి ప్రకటిస్తే అందులో ఇద్దరు గూగుల్ లో పని చేసినవారే. ఒకరి ఇప్పటికీ గూగుల్ క్వాంటమ్ ను లీడ్ చేస్తున్నారు. దీనిపై పిచాయ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Google now has 5 Nobel Prize winners: 2025 నోబెల్ ఫిజిక్స్ ప్రైజ్ విజేతలు మిచెల్ డెవోరెట్, జాన్ మార్టినిస్, జాన్ క్లార్క్‌లను అభినందిస్తూ అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ఎక్స్ లో ట్వీట్ పెట్టారు. "గూగుల్‌లో ఇప్పుడు 5 మంది నోబెల్ లారియట్లు ఉన్నారు – గత 2 సంవత్సరాల్లో 3 ప్రైజులు!" సంతోషం వ్యక్తం చేశారు. ఈ ముగ్గురు శాస్త్రవేత్తల్లో డెవోరెట్ గూగుల్ క్వాంటమ్ AI ల్యాబ్‌లో చీఫ్ సైంటిస్ట్, మార్టినిస్ మాజీ హార్డ్‌వేర్ టీమ్ లీడర్. ఈ షా 1980ల్లో క్వాంటమ్ మెకానిక్స్ పై శాస్త్రవేత్త పయోనీరింగ్ వర్క్, ఎర్రర్-కరెక్టెడ్ క్వాంటమ్ కంప్యూటర్లకు మార్గం సుగమం చేసిందని పిచాయ్ ప్రశంసించారు. "ఇది గూగుల్ క్వాంటమ్ ప్రోగ్రెస్‌కు గేమ్ చేంజర్" అని చెప్పారు.
Congrats to Michel Devoret, John Martinis, and John Clarke on the Nobel Prize in Physics. 🔬🥼 Michel is chief scientist of hardware at our Quantum AI lab and John Martinis led the hardware team for many years.
— Sundar Pichai (@sundarpichai) October 7, 2025
Their pioneering work in quantum mechanics in the 1980s made recent…
రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించిన 2025 నోబెల్ ఫిజిక్స్ ప్రైజ్‌ను మిచెల్ డెవోరెట్ (ఫ్రాన్స్), జాన్ మార్టినిస్ (అమెరికా), జాన్ క్లార్క్ (అమెరికా)లకు ఇచ్చారు. వీరు "ఎలక్ట్రిక్ సర్క్యూట్‌లో మాక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానికల్ టన్నెలింగ్ , ఎనర్జీ క్వాంటైజేషన్" రూపకర్తలు. క్వాంటమ్ ప్రపంచంలోని విచిత్ర లక్షణాలను వీరి ప్రయోగాలు, క్వాంటమ్ కంప్యూటర్ల భవిష్యత్తుకు పునాది వేశాయి. , "మిచెల్ గూగుల్ క్వాంటమ్ AI ల్యాబ్‌లో హార్డ్‌వేర్ చీఫ్ సైంటిస్ట్, జాన్ మార్టినిస్ సంవత్సరాల తరబడి హార్డ్‌వేర్ టీమ్‌ను లీడ్ చేశారు" అని చెప్పారు.
Congratulations to Michel Devoret, Google Quantum AI’s Chief Scientist of Quantum Hardware, who was awarded the 2025 Nobel Prize in Physics today. Google now has five Nobel laureates among our ranks, including three prizes in the past two years. https://t.co/FprszfslSZ
— Google (@Google) October 7, 2025
గూగుల్ ఇప్పుడు మొత్తం 5 మంది నోబెల్ లారియట్లను కలిగి ఉంది, వీరిలో 3 మంది గత 2 సంవత్సరాల్లో విజేతలు. మిచెల్ డెవోరెట్ (ప్రస్తుత గూగుల్ క్వాంటమ్ AI హార్డ్‌వేర్ చీఫ్), జాన్ మార్టినిస్ (మాజీ గూగుల్ హార్డ్‌వేర్ లీడర్, 2020లో రిటైర్ అయ్యి Qolab స్టార్టప్ స్థాపించారు ). 2024 కెమిస్ట్రీ డెమిస్ హాసాబిస్, జాన్ జంపర్ (గూగుల్ డీప్‌మైండ్‌లో AlphaFold AI ప్రోటీన్ స్ట్రక్చర్ ప్రెడిక్షన్ ) 2024 ఫిజిక్స్ జెఫ్రీ హింటన్ (గూగుల్ మాజీ ఎంప్లాయీ, AI న్యూరల్ నెట్‌వర్క్ ). ఈ విజేతలు గూగుల్ AI, క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రోగ్రామ్‌లకు ప్రత్యేకమైనవి.
వీరి పరిశోధన క్వాంటమ్ మెకానిక్స్‌ను మెడిసిన్, మెటీరియల్స్ సైన్స్, AIలో అప్లికేషన్‌లకు ఉపయోగపడింది. గూగుల్ సాంతా బార్బరా ల్యాబ్‌లో ఈ ప్రోగ్రెస్ "ఎర్రర్-కరెక్టెడ్ క్వాంటమ్ కంప్యూటర్లకు" సహాయపడుతోంది.





















