Earthquake in Afghanistan: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం- 950 మంది మృతి, 600 మందికి గాయాలు!
Earthquake in Afghanistan: అఫ్గానిస్థాన్‌లో సంభవించిన భారీ భూకంపం ధాటికి 950 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం.
Earthquake in Afghanistan: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం వచ్చింది. ఈ భూకంపం ధాటికి 950 మందికి పైగా మృతి చెందగా, 600 మందికి గాయాలైనట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు రయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని.. రిమోట్ పర్వత ప్రాంతాల్లో మరణాల సమాచారం ఇంకా అందలేదని పేర్కొంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
An earthquake in a remote part of Afghanistan has killed at least 280 people and injured hundreds.
— Al Jazeera English (@AJEnglish) June 22, 2022
Journalist @alibomaye explains why underfunded aid agencies are struggling to respond ⤵️
🔗: https://t.co/lkecToKpFH pic.twitter.com/V1MQ1zUecZ
భారీగా నష్టం
తూర్పు పక్టికా ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనల ధాటికి వందల మంది గాయపడ్డారు. అఫ్గాన్‌లోని ఖోస్ట్ నగరానికి 44 కిలోమీటర్ల దూరంలో 51 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది.
Over 300 killed and more than 500 injured in earthquake at Afghanistan. Mostly in Paktika and Khost provinces. Rescue ops underway in many villages. Casualties likely to increase. pic.twitter.com/2VUF5BmRJO
— Aditya Raj Kaul (@AdityaRajKaul) June 22, 2022
భూకంపం ధాటికి పలు భవనాలు నేలమట్టమయ్యాయి. అర్ధరాత్రి సమయంలో పలుమార్లు ప్రకంపనలు రావడంతో అనేక మంది శిథిలాల కింద చిక్కుకుని మరణించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద అనేకమంది చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. వీరిని రక్షించేందుకు సహాయక సిబ్బంది శ్రమిస్తున్నారు.
పాక్‌లోనూ
పాకిస్థాన్‌లోనూ పలు చోట్ల భూ ప్రకంపనలు కనిపించాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని పాక్ అధికారులు తెలిపారు.
Also Read: Maharashtra Crisis: మహారాష్ట్ర అసెంబ్లీ రద్దయ్యే అవకాశం- సీఎం ఠాక్రే సంచలన నిర్ణయం!
Also Read: Corona Cases: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు- 13 మంది మృతి