(Source: ECI/ABP News/ABP Majha)
Maharashtra Crisis: మహారాష్ట్ర అసెంబ్లీ రద్దయ్యే అవకాశం- సీఎం ఠాక్రే సంచలన నిర్ణయం!
Maharashtra Crisis: మహారాష్ట్ర రాజకీయం క్షణానికో మలుపు తిరుగుతోంది. తాజాగా మరో ఇద్దరు శివసేన ఎమ్మెల్యేలు షిండే గ్రూప్‌లోకి వెళ్లారు. దీంతో అసెంబ్లీని రద్దు చేయాలని ఠాక్రే యోచిస్తున్నట్లు సమాచారం.
Maharashtra Crisis: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ముదురుతోంది. మహారాష్ట్ర కేబినెట్ మంత్రి ఏక్‌నాథ్ షిండే సహా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు తాజాగా సూరత్ నుంచి గువాహటి (అసోం) చేరుకున్నారు. ఏక్‌నాథ్ వెంట మొత్తం 34 మంది శివసేన ఎమ్మెల్యేలు సహా ఏడుగురు స్వతంత్ర శాసనసభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది.
Maharashtra crisis: 40 MLAs led by rebel Sena leader Eknath Shinde arrive at Guwahati hotel
— ANI Digital (@ani_digital) June 22, 2022
Read @ANI Story | https://t.co/An54kN2Dj2#Maharashtra #MaharashtraPoliticalCrisis #EknathShinde #UddhavThackeray pic.twitter.com/7OoFOVL5MX
భాజపా స్వాగతం
సూరత్‌లోని లే మెరిడియన్ హోటల్‌లో బస చేసిన ఈ ఎమ్మెల్యేలంతా బుధవారం తెల్లవారుజామున విమానంలో గువాహటి చేరుకున్నారు. వీరితో సీఎం ఉద్ధవ్ ఠాక్రే పంపిన శివసేన నేతలకు మధ్య చర్చలు విఫలమయ్యాయి. అనంతరం వీరంతా అసోం వెళ్లారు. వీరికి గువాహటిలో అసోం భాజపా నేతలు స్వాగతం పలికినట్లు సమాచారం.
కేబినెట్ భేటీ
ప్రస్తుతం పరిణామాల మధ్య సీఎం ఉద్ధవ్ ఠాక్రే వేగంగా పావులు కదుపుతున్నారు. బుధవారం కేబినెట్ అత్యవసర భేటీ జరగనుంది. అయితే బుధవారం మధ్యాహ్నం ముంబయికి వెళ్లి మహారాష్ట్ర గవర్నర్‌తో భేటీ కావాలని షిండే వర్గం అనుకుంది. అంతలోనే గవర్నర్ కరోనాతో ఆస్పత్రి పాలయ్యారు. శివ సేన ఎమ్మెల్యేల నుంచి మరో ఇద్దరు ఏక్‌నాథ్ షిండే గ్రూప్‌లోకి జంప్ కొట్టారు. దీంతో షిండే వర్గీయుల సంఖ్య 46కు చేరింది.
సంజయ్ రౌత్
మహారాష్ట్రలో తాజా రాజకీయ పరిణామాలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ రద్దు దిశగా మహారాష్ట్ర సంక్షోభం సాగుతున్నట్లు శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు.
Shiv Sena's Sanjay Raut hints at the dissolution of #Maharashtra Legislative Assembly amid the current political crisis in the state.
— ANI (@ANI) June 22, 2022
He tweets, "The ongoing political crisis in Maharashtra is heading to the dissolution of Vidhan Sabha." pic.twitter.com/rNyln0sFuh
Maharashtra | Talks are underway with MLAs who are with Eknath Shinde, everybody will stay in Shiv Sena. Our party is a fighter, we'll struggle consistently, atmost we might lose power but we'll continue to fight: Shiv Sena leader Sanjay Raut pic.twitter.com/hkPC0PfupB
— ANI (@ANI) June 22, 2022
Also Read: Corona Cases: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు- 13 మంది మృతి