News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట, జైలులో బీ క్లాస్ వసతులు, అక్కడ ఏం ఉంటాయంటే?

Imran Khan: తోషాఖానా కేసులో దోషిగా తేలి జైలులో ఉన్న ఇమ్రాన్‌ఖాన్‌‌ను పంజాబ్‌ ప్రావిన్సులోని అటోక్‌ జైలు నుంచి రావల్పిండిలోని అడియాలా జైలుకు మార్చాలని అధికారులను ఇస్లామాబాద్‌ హైకోర్టు ఆదేశించింది.

FOLLOW US: 
Share:

Imran Khan: పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి, పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌కు స్వల్ప ఊరట లభించింది. తోషాఖానా కేసులో దోషిగా తేలి జైలులో ఉన్న ఆయనను పంజాబ్‌ ప్రావిన్సులోని అటోక్‌ జైలు నుంచి రావల్పిండిలోని అడియాలా జైలుకు మార్చాలని అధికారులను ఇస్లామాబాద్‌ హైకోర్టు ఆదేశించింది. ఇమ్రాన్‌ కుటుంబ నేపథ్యం, హోదాను దృష్టిలో పెట్టుకుని అత్యంత భద్రత నడుమ, సకల సౌకర్యాలతో ఉండే రావల్పిండి జైలుకు తరలించాలని పీటీఐ నేతలు కోర్టును ఆశ్రయించారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన న్యాయమూర్తి, ఇమ్రాన్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించారు. రావల్పిండిలోని అడియాలా జైలుకు మార్చాలని,  అలాగే బీ-క్లాస్ వసతులు కల్పించాలని అధికారులను ఇస్లామాబాద్‌ హైకోర్టు ఆదేశించించినట్లు డాన్‌ పత్రిక వెల్లడించింది.

బి-క్లాస్ వసతులు అంటే ఏమిటి?
పాకిస్తాన్ ఆంగ్ల దినపత్రిక డాన్ కథనం ప్రకారం.. B-క్లాస్ కింద ఇమ్రాన్ ఖాన్‌కు పుస్తకాలు, వార్తాపత్రికలు అందుతాయి. టేబుల్, కుర్చీ, 21-అంగుళాల టెలివిజన్, ఒక పరుపు, దుస్తులు, జైలు ఆహారంతో పాటు  ప్రత్యేక బాత్రూమ్ సౌకర్యం కూడా ఉంది. అయితే బయట నుంచి ఆహారం పొందటానికి అవకాశం ఉండదు. అదేవిధంగా, శానిటరీ, వాషింగ్ సౌకర్యాలు ఉంటాయి. జైలులో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సందర్భంలో వెలుగు కోసం దీపం లేదా లైట్ పొందవచ్చు. 

మూడేళ్ల జైలు శిక్ష
ఈ ఏడాది ఆగస్టు మొదటి వారంలో తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష పడింది. ఐదేళ్లపాటు అనర్హత వేటు పడింది. అంతేకాకుండా రూ.100,000 జరిమానా కూడా విధించింది. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ఎన్నికల కమిషన్‌కు ఉద్దేశపూర్వకంగా నకిలీ వివరాలను సమర్పించారని, అవినీతి కార్యకలాపాలకు పాల్పడినట్లు తేలడంతో న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఎన్నికల చట్టంలోని సెక్షన్ 174 ప్రకారం ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. కోర్టు ఆదేశాల అమలు కోసం ఇస్లామాబాద్ పోలీసు చీఫ్‌కు ఆర్డర్ కాపీని పంపాలని కూడా ADSJ దిలావర్ ఆదేశించారు.

తోషాఖానా అంటే ఏంటి?
ప్రభుత్వానికి వచ్చే కానుకలను భద్రపరిచే ఖజానాను తోషాఖానా అంటారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తమకు ఎవరు ఏ కానుక ఇచ్చినా తోషఖానాకు తప్పనిసరిగా అప్పగించాలి. 2018 నుంచి 2022 మధ్య కాలయంలో ఇమ్రాన్ ఖాన్ అధికారంలో ఉన్నప్పుడు రూ.140 మిలియన్ల విలువైన కానుకలను అందుకున్నారు. వాటిని ఖజానాకు జమ చేయకుండా తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.  ఇమ్రాన్‌ తనకు వచ్చిన కానుకలేమిటో చెప్పడానికి నిరాకరించారు. పైగా వాటిని అమ్ముకోవడానికి అనుమతినివ్వాలంటూ ఈసీకి లేఖ కూడా రాశారు. 
2018, సెప్టెంబర్‌ 24 నాటికి అలా వచ్చిన కానుకల్లో 10 కోట్ల విలువైన కానుకలను ప్రభుత్వానికి 2 కోట్లు చెల్లించి ఇమ్రాన్‌ తీసుకున్నారని, వాటిని మార్కెట్‌లో అధిక ధరకు అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చాయి. వాటిలో వజ్రాల రిస్ట్‌ వాచీలు, ఉంగరాలు, కఫ్‌లింక్స్‌ పెయిర్, రోలాక్స్‌ వాచీలు, పెన్నులు పెర్‌ఫ్యూమ్స్, ఐ ఫోన్లు, మసీదు, అత్తర్‌ బాటిల్స్‌ నమూనాలు, కళాకృతులు అత్యంత ఖరీదైనవి కూడా ఉన్నాయి. కేవలం మూడు వాచీలను రూ.3.6 కోట్లకు అమ్ముకున్నట్లుగా తేలింది. 

పీఎంఎల్ విచారణ
పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌–నవాజ్‌ (పీఎంఎల్‌–ఎన్‌) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2022 ఆగస్టులో తోషాఖానా వివాదంపై కేసు నమోదు చేసింది. ఇమ్రాన్‌ తనకు వచ్చిన కానుకల వివరాలు చెప్పకుండా కొన్ని అక్రమ మార్గాల్లో అమ్ము కున్నారంటూ కేసు పెట్టింది. ఇమ్రాన్‌ గద్దె దిగిన తర్వాత తోషాఖానాలో కొన్ని పుస్తకాలు తప్ప మరే వస్తువు మిగల్లేదని పేర్కొంది. ఈ కేసులో ఇమ్రాన్‌ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఇస్లామాబాద్ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి (ADSJ) హుమాయున్ దిలావర్ తీర్పు చెప్పారు.  

Published at : 26 Sep 2023 11:09 AM (IST) Tags: Imran Khan Islamabad High Court Attock District Jail Adiala Jail Rawalpindi Adiala Jail B Class Facilities

ఇవి కూడా చూడండి

Australia Housing Crisis: ఆస్ట్రేలియాను ఆగం చేస్తున్న రెంటల్ క్రైసిస్, అద్దె ఇంటి కోసం నానా పాట్లు

Australia Housing Crisis: ఆస్ట్రేలియాను ఆగం చేస్తున్న రెంటల్ క్రైసిస్, అద్దె ఇంటి కోసం నానా పాట్లు

100-Day Cough: యూకేలో అలజడి రేపుతున్న 100 డే కాఫ్‌,దగ్గుతో సతమతం అవుతున్న బాధితులు

100-Day Cough: యూకేలో అలజడి రేపుతున్న 100 డే కాఫ్‌,దగ్గుతో సతమతం అవుతున్న బాధితులు

Gaza: పాలస్తీనా ప్రధానితో మాట్లాడిన జైశంకర్,గాజాలోని పరిస్థితులపై ఆరా

Gaza: పాలస్తీనా ప్రధానితో మాట్లాడిన జైశంకర్,గాజాలోని పరిస్థితులపై ఆరా

India Canada Tensions: ఖలిస్థాన్ వేర్పాటువాదంపై భారత్‌ స్ట్రాటెజీ ఏంటి? ఆరోపణల్ని ఎలా తిప్పికొట్టనుంది?

India Canada Tensions: ఖలిస్థాన్ వేర్పాటువాదంపై భారత్‌ స్ట్రాటెజీ ఏంటి? ఆరోపణల్ని ఎలా తిప్పికొట్టనుంది?

Look Back 2023 New Parliament Building : ప్రజాస్వామ్య భారతానికి సరికొత్త చిరునామా - 2023లోనే అందుబాటులోకి కొత్త పార్లమెంట్ భవనం !

Look Back 2023 New Parliament Building :  ప్రజాస్వామ్య భారతానికి సరికొత్త చిరునామా  - 2023లోనే అందుబాటులోకి  కొత్త పార్లమెంట్ భవనం !

టాప్ స్టోరీస్

YSRCP Gajuwaka : వైసీపీకి గాజువాక ఇంచార్జ్ గుడ్ బై - వెంటనే గుడివాడ అమర్నాథ్‌కు బాధ్యతలు !

YSRCP Gajuwaka :  వైసీపీకి  గాజువాక ఇంచార్జ్ గుడ్ బై - వెంటనే గుడివాడ అమర్నాథ్‌కు బాధ్యతలు !

Hyderabad News: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎండీ సజ్జనార్ - 'మహాలక్ష్మి' పథకంపై పరిశీలన, ఇబ్బందులుంటే ఈ నెంబర్లకు కాల్ చేయాలని సూచన

Hyderabad News: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎండీ సజ్జనార్ - 'మహాలక్ష్మి' పథకంపై పరిశీలన, ఇబ్బందులుంటే ఈ నెంబర్లకు కాల్ చేయాలని సూచన

Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!

Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!

Happy Birthday Nabha Natesh: నభా నటేష్ బర్త్ డే: అందాల నటికి అవకాశాలు నిల్ - పాపం, ఆ యాక్సిడెంట్‌తో!

Happy Birthday Nabha Natesh: నభా నటేష్ బర్త్ డే: అందాల నటికి అవకాశాలు నిల్ - పాపం, ఆ యాక్సిడెంట్‌తో!