China on Covid19 : చైనా కరోనా వాస్తవ మరణాల సంఖ్యను దాస్తోంది, తైవాన్ న్యూస్ సంచలన నివేదిక

China on Covid19 : చైనాలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. దాదాపు 44 నగరాలు పాక్షికంగా లాక్ డౌన్ లో ఉన్నాయి. అయితే చైనా మరణాల సంఖ్యను దాస్తోందని తైవాన్ న్యూస్ నివేదిక వెల్లడించింది.

FOLLOW US: 

China on Covid19 : చైనాలో మరోసారి కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అయితే మళ్లీ కోవిడ్ మరణాలను చైనా దాచిపెడుతుందన్న ఆరోపణలు వచ్చాయి. తైవాన్ న్యూస్ నివేదిక ప్రకారం వైరస్ కారణంగా మరణించిన వారి వాస్తవ సంఖ్యను చైనా దాచిపెడుందని తెలిపింది. ఫైనాన్షియల్ టైమ్స్‌ కథనాలను ఉటంకిస్తూ తైవాన్ న్యూస్ తన నివేదికలో కరోనా సోకిన వ్యక్తికి ఏదైనా ఇతర దీర్ఘకాలిక వ్యాధి ఉన్నట్లయితే, ఆ కారణంగా మరణాలు సంభవించాయని చెబుతోందని వెల్లడించింది. కోవిడ్ -19 కారణంగా సంభవించిన నిజమైన మరణాల సంఖ్యను చైనా అధికారులు దాచిపెడుతున్నారని తెలిపింది. 

చైనా మరణాలను దాస్తోంది  

రోగికి క్యాన్సర్, గుండె జబ్బులు లేదా మధుమేహం ఉంటే, మరణానికి కారణం కోవిడ్‌గా వర్గీకరించరు. దీర్ఘకాలిక అనారోగ్యంగా వర్గీకరిస్తున్నారు. ఈ లోపభూయిష్ట పద్ధతిని హాంకాంగ్ విశ్వవిద్యాలయానికి చెందిన వైరాలజిస్ట్ జిన్ డాంగ్-యాన్ ధ్రువీకరించారని వార్తా సంస్థ ANI నివేదించింది. "సంఖ్యలు కచ్చితమైనవి కావు, కానీ షాంఘై ఆసుపత్రులు ఉద్దేశపూర్వకంగా దీన్ని చేయడం లేదు. మొదటి నుండి, చైనా మరణాలను నమోదు చేసే పద్ధతి ఇలానే ఉంది" అని డాక్టర్ జిన్ చెప్పారు. తైవాన్ న్యూస్ ప్రకారం “దేశంలో మార్చి 1 నుంచి 443,000 కన్నా ఎక్కువ కేసుల నమోదయ్యాయి. కేవలం రెండు మరణాలను నమోదు అయ్యాయి. ఈ రెండూ ఉత్తర కొరియా సరిహద్దులో ఉన్న జిలిన్‌లో సంభవించాయి. అయినప్పటికీ, ఒక నివేదిక ప్రకారం షాంఘైలోని వారి బంధువులు వ్యాధి బారిన పడి మరణించారని చాలా మంది వ్యక్తులు నేరుగా ఫైనాన్షియల్ టైమ్స్‌కు తెలియజేశారు."

జింగ్ పింగ్ విధానాలపై అసంతృప్తి 

చైనా అధికారులు మరణాలను ఎలా వర్గీకరిస్తారు అనేదానికి రిపోర్టింగ్‌లో అంతరం వస్తుంది. మరణాలను సూచించే ఈ పద్ధతి దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన తాజా ఓమిక్రాన్ వేవ్ నిజమైన మరణాల సంఖ్యను కప్పిపుస్తుందని నిపుణులు ఫైనాన్షియల్ టైమ్స్‌తో చెప్పారు. అధికారికంగా 2019 చివర్లో వూహాన్ ప్రావిన్స్‌లో మొదటిసారిగా వైరస్ కనుగొన్నారని చెబుతున్నా ప్రపంచ దేశాల పరిశీలనకు చైనా ఒప్పుకోవడంలేదు. వైరస్ కట్టడి చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ విధానాల పట్ట ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. షాంఘై నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు ఈ అసంతృప్తి వ్యాపిస్తుంది. కనీసం 44 చైనీస్ నగరాలు పూర్తి లేదా పాక్షిక లాక్‌డౌన్‌లో ఉన్నాయి. 

Also Read : China Creating New COVID Strains : ప్రపంచంపై చైనా మరో కుట్ర ! పాకిస్థాన్‌లో ఏం చేస్తోందంటే ?

Published at : 17 Apr 2022 08:32 PM (IST) Tags: china COVID-19 China LockDown shanghai

సంబంధిత కథనాలు

Nepal Missing Aircraft: నేపాల్ లో గల్లంతైన విమానం ఆచూకీ లభ్యం, రంగంలోకి దిగిన ఆర్మీ

Nepal Missing Aircraft: నేపాల్ లో గల్లంతైన విమానం ఆచూకీ లభ్యం, రంగంలోకి దిగిన ఆర్మీ

Nepal Plane Missing: నేపాల్‌లో విమానం మిస్సింగ్, ATCతో సిగ్నల్స్ కట్ - లోపల ఉన్న 22 మందిలో భారతీయులు కూడా

Nepal Plane Missing: నేపాల్‌లో విమానం మిస్సింగ్, ATCతో సిగ్నల్స్ కట్ - లోపల ఉన్న 22 మందిలో భారతీయులు కూడా

Texas School Shooting : మృత్యుంజయురాలు ఆ చిన్నారి - అమెరికాలో కాల్పుల నుంచి ఎలా తప్పించుకుందంటే ?

Texas School Shooting :  మృత్యుంజయురాలు ఆ చిన్నారి - అమెరికాలో కాల్పుల నుంచి ఎలా తప్పించుకుందంటే ?

International Booker Prize 2022: ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ అందుకున్న గీతాంజలి శ్రీ- ఆ రికార్డ్ ఆమెదే!

International Booker Prize 2022: ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ అందుకున్న గీతాంజలి శ్రీ- ఆ రికార్డ్ ఆమెదే!

Imran Khan: పాక్ ప్రధానికి ఇమ్రాన్ ఖాన్ డెడ్‌లైన్- 6 రోజుల్లోగా చేయకపోతే!

Imran Khan: పాక్ ప్రధానికి ఇమ్రాన్ ఖాన్ డెడ్‌లైన్- 6 రోజుల్లోగా చేయకపోతే!

టాప్ స్టోరీస్

UIDAI Update: మాస్క్‌ ఆధార్‌ వినియోగంపై కేంద్రం వెనక్కి! తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ

UIDAI Update: మాస్క్‌ ఆధార్‌ వినియోగంపై కేంద్రం వెనక్కి! తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ

Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, మరో వారంలో తెలుగు రాష్ట్రాలకు

Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, మరో వారంలో తెలుగు రాష్ట్రాలకు

Infinix Note 12 Flipkart Sale: ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 సేల్ ప్రారంభం - అదిరిపోయే ఫీచర్లు - ఎలా ఉందో చూశారా?

Infinix Note 12 Flipkart Sale: ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 సేల్ ప్రారంభం - అదిరిపోయే ఫీచర్లు - ఎలా ఉందో చూశారా?

The Conjuring House: ‘ది కంజూరింగ్’ హౌస్, ఆ దెయ్యాల కొంపను రూ.11 కోట్లకు అమ్మేశారు, చరిత్ర తెలిస్తే షాకవుతారు!

The Conjuring House: ‘ది కంజూరింగ్’ హౌస్, ఆ దెయ్యాల కొంపను రూ.11 కోట్లకు అమ్మేశారు, చరిత్ర తెలిస్తే షాకవుతారు!