China Creating New COVID Strains : ప్రపంచంపై చైనా మరో కుట్ర ! పాకిస్థాన్‌లో ఏం చేస్తోందంటే ?
చైనా పాకిస్థాన్‌లో కొత్త కరోనా తహా వైరస్‌లు సృష్టిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రసిద్ధ సైంటిస్ట్ ఒకరు ఈ తీవ్ర ఆరోపణలు చేశారు.
![China Creating New COVID Strains : ప్రపంచంపై చైనా మరో కుట్ర ! పాకిస్థాన్‌లో ఏం చేస్తోందంటే ? China creating new COVID strains in Pakistan, alleges expert China Creating New COVID Strains : ప్రపంచంపై చైనా మరో కుట్ర ! పాకిస్థాన్‌లో ఏం చేస్తోందంటే ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/28/9516fce90bdc374496680ad836c7f792_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
China creating new COVID strains : చైనా ప్రపంచంపై కొత్త కుట్రలు పన్నుతోంది. ఇందుకు పాకిస్తాన్‌ను ఉపయోగించుకుంటోంది. కరోనా తరహా వైరస్‌లను పెద్ద ఎత్తున సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. ఇదంతా పాకిస్థాన్‌లో జరుగుతోందని ఆందోనీ క్లాన్ అనే ఆరోగ్య నిపుణుడు సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్థాన్‌లో చైనా సృష్టిస్తున్న వైరల్ వల్ల మానవాళిని చాలా వరకు తుడిచిపెట్టే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ది క్లాక్సన్ అనే మెడికల్ జర్నల్‌లో ఆంథోనీ క్లాన్ కీలక విషయాలు వెల్లడించారు. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ పాకిస్తాన్‌లో "సాంకేతికతను" అభివృద్ధి పేరుతో అత్యంత అధునాతన ల్యాబ్‌ను ఏర్పాటు చేసిందని ప్రకటించారు.
ట్విటర్ ఎందుకుగానీ! ఆ అప్పులు తీర్చేసి శ్రీలంకను కొనేయొచ్చుగా మస్క్!
చైనా కొద్ది రోజుల కిందట కాన్‌సినో కొవిడ్-19 టీకా తయారీని పాకిస్థాన్‌లో ప్రారంభించింది. పాకిస్థాన్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌లో ఈ వ్యాక్సిన్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. అయితే ఇది టీకా తయారీ కేంద్రం కాదని వైరస్ తయారీ కేంద్రం అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ ల్యాబ్‌ను వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంయుక్తంగా నిర్వహిస్తోందని చెబుతున్నారు. చైనా-పాకిస్తాన్ సైనిక ప్రయోగశాల మధ్య సహకారం "బయో సేఫ్టీ లెవల్ 4" సౌకర్యం ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం నాలుగు బయో-సేఫ్టీ స్థాయిలు ఉన్నాయి, BSL-4 అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంలో పరిశోధనలు చేసేందుకు ఉపయోగిస్తారు .
పాకిస్థాన్ చైనాకు సుదీర్ఘ మిత్రుడు. ఓ రకంగా చైనా గుప్పిట్లో పాకిస్థాన్ ఉందని చెప్పుకోవచ్చు. ఇష్టారీతిన పాకిస్తాన్‌కు చైనా అప్పులిచ్చింది. అవి చెల్లించలేని స్థితిలో పాకిస్థాన్ ఉంది. ల్యాబ్ ఉన్న ప్రాంతం పాకిస్తాన్ సైన్యం యొక్క ప్రత్యక్ష నియంత్రణలో ఉందని.. డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజేషన్ చిన్న విషయాన్ని కూడా బయటకు వెళ్లకుండా చూసుకుంటోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయం అత్యున్నత స్థాయి ఇంటెలిజెన్స్ సంస్థలు కూడా ధృవీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది.
చైనీస్ బయో-ఇంజనీర్లు పాకిస్తాన్‌లో విధ్వంసాన్ని సృష్టించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని అనుకోవచ్చు. చైనా సృష్టిస్తున్నవి COVID-19 కంటే ప్రాణాంతకం అని క్లాన్ చెబుతున్నారు. వుహాన్ ప్రయోగశాల COVID-19 మహమ్మారి యొక్క మూలంగా ప్రసిద్ది చెందింది, కోవిడ్ కారణంగా ఇప్పటివరకు 6 మిలియన్ల మంది చనిపోయారు. నింజగానే చైనా వైరస్‌ను పాకిస్థాన్ నుంచి వదిలితే జరిగే ప్రాణ నష్టాన్ని అంచనా వేయలేం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)