అన్వేషించండి

Mass Resignation: అమెరికాలో లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులకు నేడే ఆఖరు రోజు - ట్రంప్ దెబ్బలు వాతల్లా తేలుతున్నాయి !

US Federal Workers: అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ అధికారికంగా అమల్లోకి వస్తోంది. లక్ష మంది ఉద్యోగులు అధికారికంగా.. ముందస్తుగా రిటైర్ అవుతున్నారు.

Largest mass resignation: అమెరికా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులు సామూహిక రాజీనామాలు చేస్తున్నారు.  ట్రంప్ పరిపాలనలో భాగంగా ప్రవేశపెట్టిన "డిఫర్డ్ రెసిగ్నేషన్ ప్రోగ్రామ్"  కారణంగా  సెప్టెంబర్ 30న  1,00,000 మందికి పైగా ఫెడరల్ ఉద్యోగులు అధికారికంగా రాజీనామా చేస్తున్నారు. దీని వల్ల రెండవ ప్రపంచ యుద్ధం  తర్వాత అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యలో అతి వేగంగా తగ్గుదల నమోదు అవుతుంది.  

ట్రంప్ రెండో  సారి పరిపాలన ప్రారంభమైన తర్వాత  పరిపాలనలో ఫెడరల్ ప్రభుత్వాన్ని "స్లిమ్‌డౌన్" చేయడానికి ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) ప్రణాళికలు అమలు చేసింది.  DRP ప్రోగ్రామ్‌లో ఉద్యోగులు ఫిబ్రవరి 6, 2025 నాటికి రాజీనామా చేస్తే, సెప్టెంబర్ 30 వరకు పూర్తి జీతం,  ప్రయోజనాలతో అడ్మినిస్ట్రేటివ్ లీవ్‌పై ఉండవచ్చు. ఇది "స్వచ్ఛంద రాజీనామా"గా చూపించినా చాలా మంది ఉద్యోగులు "భయం , ఒత్తిడి" కారణంగా  ఈ ఆప్షన్ ఎంచుకున్నారు. 

మొత్తం 2,75,000 ఉద్యోగులు  డిఫర్డ్ రెసిగ్నేషన్, వాలంటరీ సెపరేషన్, ఎర్లీ రిటైర్మెంట్, అట్రిషన్‌లతో సహా ఈ సంవత్సరం చివరికి  రాజీనామా చేయబోతున్నారు. ఇది 2.3 మిలియన్ సివిలియన్ ఫెడరల్ ఉద్యోగుల సంఖ్యను 2.1 మిలియన్‌కు తగ్గిస్తుంది. ఈ ప్రోగ్రామ్ ఖర్చు 14.8 బిలియన్ డాలర్లు, కానీ లాంగ్-టర్మ్‌లో 28 బిలియన్ డాలర్లు ఆదా అవుతాయని  వైట్ హౌస్ అధికారులు చెబుతున్నారు. 

మిలిటరీ, ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్, నేషనల్ సెక్యూరిటీ స్టాఫ్ వంటి కీలక రంగాల ఉద్యోగుల్ని మాత్రం తప్పించడం లేదు. ఈ రాజీనామాలు ఆగస్టు 2025లో 4.3 శాతంకి చేరిన అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్‌ను మరింత పెంచుతాయి. ట్రంప్ టారిఫ్‌లు ఆర్థిక అనిశ్చితిని పెంచాయి, జాబ్ మార్కెట్ పడిపోయింది. ఈ రాజీనామాల కారణంగా  మెడికైడ్, ACA సబ్సిడీలు ఆలస్యం అవుతాయి.  డిజాస్టర్ రిలీఫ్,  సోషల్ సెక్యూరిటీ అంశాల్లో సర్వీస్ తగ్గిపోతుంది. కాంగ్రెస్ మంగళవారం ఫండింగ్ ఆమోదించకపోతే షట్‌డౌన్ జరుగుతుంది, మరిన్ని లేఅవుఫ్‌లు వస్తాయి.  

ఈ పరిస్థితిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  MAGA సపోర్టర్స్ "బ్యూరోక్రసీ కట్"గా చూస్తున్నారు. అయితే లేబర్ యూనియన్స్ లాసూట్ ఫైల్ చేశాయి. 1990ల్లో క్లింటన్ "రీఇన్వెంటింగ్ గవర్నమెంట్" ప్లాన్‌లో 2,50,000 ఉద్యోగాలను తొలగించారు. కానీ అప్పుడు 5 సంవత్సరాల్లో. ఇప్పుడు ఒకే సంవత్సరంలో 3,00,000 ఉద్యోగాలను ట్రంప్ తొలగిస్తున్నారు.                  

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
US Iran War: వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
US Iran Conflict: టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Euphoria OTT : నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
Chiranjeevi Wow Moment : వావ్... వావ్... వాట్ ఏ మూమెంట్ - మెగాస్టార్ నోట మళ్లీ ఫేమస్ డైలాగ్
వావ్... వావ్... వాట్ ఏ మూమెంట్ - మెగాస్టార్ నోట మళ్లీ ఫేమస్ డైలాగ్
Embed widget