అన్వేషించండి

Divorce Party: విడాకుల పార్టీకి ఆహ్వానం ! ఇది ట్రాజెడీ కాదు సూపర్ హ్యాపీ స్టోరీనే !

స్వతంత్రంగా బతకాలనుకునే ఓ మహిళ 17 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పి విడాకులు తీసుకుంది. ఈ సందర్భంగా కలర్ ఫుల్ పార్టీ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు.


ఆహ్వానం అనే తెలుగు సినిమాను చూశారా ? అందులో పెళ్లి లాగే విడాకులకూ ఓ వేడుక చేయడం కాన్సెప్ట్. చివరికి విడాకులు కోరుకున్న భర్త ఆ వేడుకలో పశ్చాత్తాపం పొందుతాడు. అది హ్యాపీ ఎండింగ్ ఆ సినిమాకు. కానీ అలా పశ్చాత్తాపం పొందకుండా ఉండటం నేటి హ్యాపీ ఎండింగ్. నిజంగా ఇలాంటి వేడుకలు ఇప్పుడు జరుగుతున్నాయి. లండన్‌లో జరిగిన ఇలాంటి ఓ విడాకుల పార్టీ ఇప్పుడు వైరల్ అయింది. ఇలా చేసుకుంది విదేశాల్లో పుట్టి పెరిగి.. అక్కడి సంస్కృతికి అలవాటు పడిన వారు కాదు. ఇండియన్ మహిళే.
Divorce Party: విడాకుల పార్టీకి ఆహ్వానం ! ఇది ట్రాజెడీ కాదు సూపర్ హ్యాపీ స్టోరీనే !

Also Read : కేఎఫ్‌సీ నుంచి పిజ్జాలు, బ‌ర్గర్లు తెస్తున్నాడని అరెస్ట్ ! అది కూడా నేరమా అని ఆశ్చర్యపోకండి.. అక్కడ నేరమే !

లండన్‌లో నివసిస్తున్న భారతీయ మహిళ సోనియా గుప్తా ఇటీవల గ్రాండ్ పార్టీ ఇచ్చింది. ఆ పార్టీ దేనికంటే ఆమెకు ఎట్టకేలకు విడాకులు మంజూరైనందుకట. పదిహేడేళ్ల పాటు వైవాహిక బంధంలో ఉన్న ఆమె ఆ బంధం నుంచి బయటపడాలని ప్రయత్నించి ఇప్పటికి సక్సెస్ అయిందట. అందుకే సంతోషంతో అందర్నీ పిలిచి పార్టీ ఇచ్చింది. పైన చెప్పుకున్నట్లు ఎక్కడ భర్త మనసు మార్చుకుని మళ్లీ నీతోనే ఉంటాను అని లొల్లి చేస్తాడేమో కానీ ఆ పార్టీకి అప్పటికే విడాకులు ఇచ్చిన భర్తను ఆహ్వానించలేదు. వారి కుటుంబసభ్యులను కూడా పిలువలలేదు. కానీ లైక్ మైండెడ్ మైండ్ సెట్ ఉన్న ఫ్రెండ్సందరినీ పిలిచి పార్టీని లగ్జరీగా ఇచ్చింది.
Divorce Party: విడాకుల పార్టీకి ఆహ్వానం ! ఇది ట్రాజెడీ కాదు సూపర్ హ్యాపీ స్టోరీనే !

Also Read : రష్యాలోని అత్యున్నత శిఖరంపై చంద్రుడి తేజం భువన్ జై

ఇంతకీ సోనియా గుప్తా ఎందుకు విడిపోవాలనుకున్నారు అంటే.. ఆమెకు ఫ్యామిలీ లైఫ్ నచ్చదట.  స్వతంత్రంగా బతకాలని ఉండేదట. కానీ పెళ్లి తర్వాత ఆమె ఎంత గింజుకున్నా బయటకు రాలేకపోయిందట. భార్యభర్తల మధ్య బంధం పెద్దగా బలపడలేదు. కెరీర్ అంటూ  భర్త బయటకు పరుగులు తీస్తూంటే ఇంట్లో జనం ఉన్న ఒంటరిగా బాధపడేదట. అప్పుడే డైవోర్స్ తీసుకుందామనుకున్నా...  కుటుంబ పరువు, ప్రతిష్టల పేరుతో ఇంత కాలం ఆగాల్సి వచ్చింది. చివరికి ఇప్పుడు ఆమె ధైర్యం చేసింది. మూడేళ్ల నుంచి విడాకుల కోసం సుదీర్ఘ పోరాటం చేసింది. చివరికి 17 ఏళ్ల వైవాహిక బంధం నుంచి  విముక్తి లభించింది.
Divorce Party: విడాకుల పార్టీకి ఆహ్వానం ! ఇది ట్రాజెడీ కాదు సూపర్ హ్యాపీ స్టోరీనే !

Also Read : 'ప్లీజ్.. ఒక్క అవకాశం ఇవ్వండి'.. ఐరాసకు తాలిబన్ల లేఖ

విడాకులు వచ్చిన సందర్భంగా సోనియా గుప్తా తన లండన్‌ నివాసంలో గ్రాండ్‌ పార్టీ ఏర్పాటు చేసింది. ఇక స్నేహితులతో కలిసి తన సంతోషాన్ని సెలబ్రేట్‌ చేసుకుంది. ఆమె ధరించిన డ్రెస్‌ మీద ఫైనల్లీ డివోర్స్‌డ్‌ అనే ట్యాగ్‌ ధరించింది. స్నేహితులను కూడా మంచి దుస్తులు ధరించి వచ్చేలా ప్రోత్సాహించారు.  తన  జీవితంలోకి సంతోషం తిరిగి వచ్చిందని అందుకే వేడుకలు చేసుకుంటున్నానని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఈ విడాకుల పార్టీ సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. 

Also Read : మూడు రోజుల చిన్నారికి పాలు ఇస్తుంటే... ఆ రెస్టారెంట్ ఓనర్ వెళ్లిపొమ్మన్నాడు... కారణం అడిగితే...

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
Sarfaraz Khan Returns: టీమిండియాలోకి సర్ఫరాజ్ సర్ప్రైజ్ రీ-ఎంట్రీ.. సాయి సుదర్శన్ ప్లేస్ లో లక్కీ ఛాన్స్, ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు ద‌క్కుతుందా!
టీమిండియాలోకి సర్ఫరాజ్ సర్ప్రైజ్ రీ-ఎంట్రీ.. సాయి సుదర్శన్ ప్లేస్ లో లక్కీ ఛాన్స్, ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు ద‌క్కుతుందా!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Embed widget