News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Maharashtra News: ప్రెగ్నెంట్ అని బ్లాక్ మెయిల్- ప్రియుడి నుంచి రూ.67 లక్షలు దోచేసిన యువతి!

Maharashtra News: ప్రెగ్నెంట్ అని బ్లాక్ మెయిల్ చేసి ప్రియుడి దగ్గర నుంచి రూ.67 లక్షలు దోచేసింది ఓ యువతి.

FOLLOW US: 
Share:

Maharashtra News: ఓ ప్రియురాలు చేసిన మోసానికి ప్రియుడు నట్టేట మునిగాడు. గర్భం దాల్చినట్లు ప్రియుడ్ని బ్లాక్ మెయిల్ చేసిన యువతి అతడి దగ్గర నుంచి పలు దఫాలుగా రూ.67 లక్షలు దోచుకుని పరారైంది. దీంతో ప్రియుడు.. పోలీసులను ఆశ్రయించాడు.

ఇలా జరిగింది

మహారాష్ట్ర పుణేలో ఈ సంఘటన జరిగింది. ఓ వ్యాపారి దగ్గర బాధితుడు (26) ఏళ్లు పని చేస్తున్నాడు. ఈ ఏడాది జనవరిలో కోరెగావ్ భీమా ప్రాంతంలోని ఒక లాడ్జిలో బస చేసిన సందర్భంగా ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అనంతరం ఇద్దరి పరిచయం ప్రేమ వరకు వెళ్లింది. అయితే యువతి ప్రేమిస్తుందని నమ్మిన బాధితుడు అప్పుడప్పుడూ అడిగితే ఆమెకు డబ్బులు ఇచ్చేవాడు.

బ్లాక్ మెయిల్

అయితే కొద్ది రోజుల తర్వాత ఆ యువతి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి బాధితుడ్ని బ్లాక్‌మెయిల్‌ చేసింది. హడప్సర్‌లో నివాసం ఉండే రవీంద్ర హింగ్‌మీర్‌ను భర్తగా, గౌరవ్‌ అనే వ్యక్తిని సామాజిక కార్యకర్తగా పరిచయం చేసింది. తాను ప్రెగ్నెంట్‌ అని, రేప్‌ కేసు పెడతానంటూ ఆ వ్యక్తిని బెదిరించింది. దీంతో ఆ ముగ్గురు కలిసి అతడి నుంచి పలు దఫాలుగా రూ.67.07 లక్షలు వసూలు చేశారు.

ఫిర్యాదు

అన్ని డబ్బులు ఇచ్చినా ఇంకా డిమాండ్‌ చేస్తుండటంతో ఆ వ్యక్తి  పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన యాంటీ ఎక్స్‌టార్షన్ సెల్ బృందం రంగంలోకి దిగింది. ఈ కేసు దర్యాప్తును ప్రారంభించింది. యువతి స్నేహితులైన రవీంద్ర, నిఖిల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న ఆ యువతి కోసం గాలిస్తున్నారు.

" ఓ యువతి తాను రేప్ చేశానని బెదిరిస్తోందని ఫిర్యాదు చేశాడు వ్యక్తి. తన బంధువుకు సంబంధించిన ఓ వ్యాపార సంస్థలో అతను పని చేస్తున్నాడు. నిందితురాలు మరో ఇద్దరు వ్యక్తులతో కలిపి తన దగ్గర డబ్బులు వసూలు చేసిందని ఆ వ్యక్తి ఫిర్యాదు ఇచ్చాడు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను మేం అరెస్ట్ చేశాం. యువతి కోసం గాలిస్తున్నాం.                                            "
-  పోలీసులు

Also Read: Rajasthan News: భార్యను చెట్టుకు కట్టేసి 7 గంటల పాటు చిత్ర హింస!

Also Read: ED Detains Sanjay Raut: శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ అరెస్ట్- ఆ కేసులో ఈడీ దూకుడు!

Published at : 31 Jul 2022 06:41 PM (IST) Tags: maharashtra news Woman flees extorting Rs 67 lakh from lover

ఇవి కూడా చూడండి

Modi Popularity: ప్రపంచంలోనే పాపులర్ లీడర్‌గా ప్రధాని మోదీ,ఏం క్రేజ్ బాసూ -ఎక్కడా తగ్గట్లే!

Modi Popularity: ప్రపంచంలోనే పాపులర్ లీడర్‌గా ప్రధాని మోదీ,ఏం క్రేజ్ బాసూ -ఎక్కడా తగ్గట్లే!

Free Bus Scheme in Telangana: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం - 2 పథకాలకు ప్రభుత్వం శ్రీకారం

Free Bus Scheme in Telangana: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం - 2 పథకాలకు ప్రభుత్వం శ్రీకారం

Look Back 2023 Womens Reservation Act : సమానత్వం వైపు మరో అడుగు మహిళా రిజర్వేషన్ల చట్టం - 2023లో సాకారం !

Look Back 2023 Womens Reservation Act :  సమానత్వం వైపు మరో అడుగు మహిళా రిజర్వేషన్ల చట్టం - 2023లో సాకారం !

KCR And KTR Absent: అసెంబ్లీకి కేసీఆర్, కేటీఆర్ గైర్హాజరు - ప్రమాణస్వీకారం చేయకముందే ముగ్గురు రాజీనామా

KCR And KTR Absent: అసెంబ్లీకి కేసీఆర్, కేటీఆర్ గైర్హాజరు - ప్రమాణస్వీకారం చేయకముందే ముగ్గురు రాజీనామా

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో నూతన ఎమ్మెల్యేల ప్రమాణం - తొలుత సీఎం, తర్వాత మంత్రుల ప్రమాణ స్వీకారం, 14కు శాసనసభ వాయిదా

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో నూతన ఎమ్మెల్యేల ప్రమాణం - తొలుత సీఎం, తర్వాత మంత్రుల ప్రమాణ స్వీకారం, 14కు శాసనసభ వాయిదా

టాప్ స్టోరీస్

Look Back 2023 - Sreeleela: ఒక్కటే క్యారెక్టర్, రెండు సినిమాలు - ఇలాగైతే ఎలా శ్రీలీల, చూసుకోవాలిగా!

Look Back 2023 - Sreeleela: ఒక్కటే క్యారెక్టర్, రెండు సినిమాలు - ఇలాగైతే ఎలా శ్రీలీల, చూసుకోవాలిగా!

Look Back 2023: బాక్సాఫీస్ రికార్డులు, పాన్ ఇండియా సక్సెస్ కొట్టిన సినిమాలు - 2023లో బ్లాక్‌బస్టర్స్

Look Back 2023: బాక్సాఫీస్ రికార్డులు, పాన్ ఇండియా సక్సెస్ కొట్టిన సినిమాలు - 2023లో బ్లాక్‌బస్టర్స్

ఎందుకు ఓడిపోయాం, ఎక్కడ తప్పు జరిగింది - ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ రివ్యూ

ఎందుకు ఓడిపోయాం, ఎక్కడ తప్పు జరిగింది - ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ రివ్యూ

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి ఎవరు? అంచనాలు ఆయన అందుకుంటారా?

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి ఎవరు? అంచనాలు ఆయన అందుకుంటారా?