Rajasthan News: భార్యను చెట్టుకు కట్టేసి 7 గంటల పాటు చిత్ర హింస!
Rajasthan News: కట్టుకున్న భార్యను చెట్టుకు కట్టేసి హింసించాడు ఓ వ్యక్తి.
Rajasthan News: కనీస జాలి కూడా లేకుండా ఓ భర్త రాక్షసుడిలా ప్రవర్తించాడు. కట్టుకున్న భార్యను చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టాడు. భార్యపై అనుమానంతో క్రూరంగా ప్రవర్తించాడు. రాజస్థాన్‌లో ఈ ఘటన జరిగింది.
అనుమానమే
బన్స్వారా జిల్లాలో ఓ మహిళను ఆమె భర్త చెట్టుకి కట్టి 7 గంటల పాటు చిత్ర హింసలకు గురి చేశాడు. ఇందుకు భర్త తరఫు బంధువులు కూడా సాయం చేశారు. ఆ మహిళ.. దెబ్బలకి తట్టుకోలేక కేకలు పెడుతున్న కనికరించలేదు.
భార్యను తన స్నేహితుడితో ఉండటం చూసిన ఆమె భర్త ఆగ్రహవేశాలకు లోనై ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆమెతో కనిపించిన వ్యక్తిని కూడా చెట్టుకు కట్టి ఇలానే హింసించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మహిళా కమిషన్
National Commission for Women (NCW) has taken cognizance of the video showing a woman tied to a tree and being beaten up by a man in Rajasthan's Banswara
— ANI (@ANI) July 30, 2022
Chairperson Rekha Sharma has written to DGP Rajasthan Police to intervene in the matter and to register FIR: NCW pic.twitter.com/fQ5wvG6QrG
ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) రాజస్థాన్ డీజీపీకి లేఖ రాసింది. ఆ లేఖలో ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్ రేఖా శర్మ నిందితులందరినీ వెంటనే అరెస్టు చేయడమే కాకుండా బాధితురాలికి తగిన వైద్యం అందించి, భద్రత కల్పించాలని అధికారులను కోరారు.
వెంటనే స్పందించిన పోలీసులు బాధితురాలి భర్త, బావతో సహా నలుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు మైనర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఈ ఘటనపై రాష్ట్రంలోని ప్రతిపక్ష భాజపా విమర్శలు చేసింది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించింది. ఈ ఘటన సోషల్ మీడియా వైరల్ అయినప్పటికీ పోలీసులు వెంటనే చర్యలు చేపట్టలేదని విమర్శించింది.
Also Read: ED Detains Sanjay Raut: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అరెస్ట్- ఆ కేసులో ఈడీ దూకుడు!