Save Energy: కరెంట్ ఆదా చేయాలంటే టై కట్టుకోవడం మానేయాలట!
Save Energy: విద్యుత్ వినియోగం తగ్గించాలంటే మెడకు టై లు ధరించడం మానేయాలంటూ సలహా ఇచ్చారు ఓ దేశ ప్రధాని
Save Energy: కరెంట్ ఎక్కువగా వినియోగిస్తున్నారా? అయితే "టై కట్టుకోవడం మానేయండి". అదేంటి అర్థం లేకుండా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? సాక్షాత్తు ఓ ప్రధాన మంత్రి ఈ సలహాను దేశ ప్రజలకు ఇచ్చారు. ఇంధనాన్ని ఆదా చేయాలంటే ఇక నుంచి టై ధరించవద్దని చెప్పుకొచ్చారు.
ఇదేంట్రా బాబు
స్పానిష్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ తమ దేశ ప్రజలకు ఇంధనాన్ని సాధ్యమైనంత మేర తక్కువగానే వినియోగించుకోవాలంని విజ్ఞప్తి చేశారు. వృథాగా ఇంధనాన్ని ఖర్చు పెట్టకుండా ఉండేందుకు ఓ వింత ట్రిక్ చెప్పారు.
LMAO He really said this
— Alex Agut (@apagut) July 29, 2022
Spain's PM: "Whenever is not necessary, please do not wear a tie. That way we will be assisting with the energy savings..."
Spain's a fucking joke
They were saying in the news today that "WE ARE RUNNING OUT OF ICE! (for sodas in bars, etc)" https://t.co/dB6PAEG3vW
అర్థం కాలేదు
అయితే స్పెయిన్ ప్రధాని సాంచెజ్ ఇలా ఎందుకు చెప్పారో అర్థం కాలేదు. అయితే దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ ప్రతిపాదనను తీసుకువచ్చినట్లు సమాచారం. అందుకే ఆయన కూడా ఆ ప్రసంగంలో నెక్‌కి టై ధరించకుండా ఉన్నారు.
ఇంధనం ఆదా చేయడానికికి నెక్‌కి టై ధరించకపోవడానికిక సంబంధం ఏమిటో ప్రజలకు అర్థం కాలేదు. అయితే దాని వెనుక ఉన్న అంతరార్థం ఏంటంటే అధిక ఉష్ణోగ్రతలు కారణంగా స్పెయిన్ ప్రజలు ఎయిర్ కండిషనింగ్ పై ఆధారపడుతున్నారు. దీంతో దేశంలో గృహాలకు, వ్యాపార కార్యాలయాలకు అధిక ఇంధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది.
అసలే ఉష్టోగ్రతలు పెరుగుతోన్న సమయంలో మెడకు టై కూడా ధరిస్తే గాలి సరిగా ఆడదు. అందుకని టై పెట్టుకోవద్దని ప్రధాని సూచించారట. వింతగా ఉంది కదా సలహా. యుటీలిటీ బిల్లులను తగ్గించడంతోపాటు ఇంధనం కోసం రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించుకునే ప్రణాళికలో భాగంగా ఈ పొదుపు ప్రణాళిక ట్రిక్‌ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read: Congress: ముగ్గురు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ సస్పన్షన్ వేటు- ఇదే కారణం!
Also Read: Sanjay Raut ED Case: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇంట్లో ఈడీ సోదాలు- 'తగ్గేదేలే' అంటూ ట్వీట్