US envoy to India: భారత్‌కు అమెరికా రాయబారిగా వస్తున్న ది ఓ స్నేక్ - ఎలాన్ మస్క్ సంచలనం - ట్రంప్ ప్లానేంటి ?
Sergio Gor: భారత్‌లో అమెరికా కొత్త రాయబారిగా నియమితులైన వ్యక్తిపై తీవ్ర ఆరోపణలు వ్సతున్నాయి. ఆయన పాములాంటి వాడని ఎలాన్ మస్క్ కూడా ఆరోపణలు చేశారు.

US Envoy to India Sergio Gor: భారత్లో అమెరికా రాయబారిని డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మార్చారు. సెర్జియో గోర్ అనే వ్యాపారవేత్తను నియమించారు. సెర్జియో గోర్ న్యూజెర్సీలో ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్, ఇన్వెస్ట్‌మెంట్ ఫర్మ్ "SG Holdings" కంపెనీ యజమాని. మరాఠీ మూలాలు ఉన్న గోర్ ట్రంప్ కు సపోర్టర్. ట్రంప్ క్యాంపెయిన్‌కు 8 కోట్ల రూపాయల విరాళం కూడా ఇచ్చాడు. దానికి ప్రతిఫలంగా ఏమో కానీ భారత్ కు రాయబారిగా పంపుతున్నారు.
Elon Musk on 38 year old New US Ambassador to India, Sergio Gor. pic.twitter.com/MV5kAp5n2g
— Kashmiri Hindu (@BattaKashmiri) August 23, 2025
అయితే ట్రంప్ కోసం గట్టిగా పని చేసిన ఎలాన్ మస్క్..గోర్ పై తీవ్ర విమర్శలు చేశాడు. మోసగాడని మండిపడ్డారు. సెర్జియో గోర్ Tesla , SpaceX)తో గతంలో వ్యాపార లావాదేవీలు నిర్వహించాడు. 2020-2022 మధ్య గోర్ , మస్క్‌కు పెట్టుబడి ప్రణాళికలు ఇచ్చి, Tesla ఫ్యాక్టరీలు , SpaceX ప్రాజెక్టుల్లో పాలుపంచుకుంటానన్నాడు. దాంతో మస్క్ గోర్‌కు "కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్" షేర్ చేశాడు. కానీ గోర్ దాన్ని "మిస్‌యూజ్" చేసి, కాంపిటీటర్లకు అమ్మేశాడని మస్క్ తర్వాత తెలుసుకున్నాడు. దీని వల్లే టెస్లా ఇండియాకు రావడం ఆలస్యమయింది. ట్రంప్ ఇలాంటి మోసగాడిని ఎంపిక చేయడం షాకింగ్ అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
Sergio Gor comes straight from the MAGA camp, and few other people have Trump’s ear the way he does. He was part of the reason why Elon Musk and Trump fell out. Sending him to India as the ambassador to India and special envoy for South and Central Asian Affairs in this… pic.twitter.com/nfkpRe2XFS
— Shubhangi Sharma (@ItsShubhangi) August 23, 2025
ఎలాన్ మస్క్ ట్రంప్ సపోర్టర్ అయినప్పటికీ ఈ నియామకాన్ని వ్యతిరేకించాడు. కారణం, గోర్ ట్రంప్ క్యాంపెయిన్‌కు డొనేట్ చేసి, "పాలిటికల్ ఫేవర్" పొంది అంబాసడర్ పోస్ట్ పొందాడని మస్క్ భావిస్తున్నాడు. మస్క్ ఇండియాలో Tesla ఫ్యాక్టరీ స్థాపించాలనుకుంటున్నాడు.గోర్ అంబాసడర్ అయితే అడ్డుకుంటాడన ి్నుమానిస్తున్నారు. అయితే గోర్ మస్క్ ఆరోపణలను ఖండించాడు. " వ్యక్తిగత ద్వేషంతో మాట్లాడుతున్నాడని... మా మధ్య ఎలాంటి మోసపూరిత లావాదేవీలు జరగలేదన్నారు. " అని చెప్పాడు. గోర్ తన భారతీయ మూలాలను హైలైట్ చేసి, "ఇండియా-US రిలేషన్స్‌ను బలోపేతం చేస్తాను" అని ప్రకటించుకున్నారు.
Elon musk already warned the world about this new ambassador to india.
— Ravi🔆 (@NobelRK) August 23, 2025
Special envoy for South and Central Asian affairs.
He called "Sergio gor" a snake .🐍 🐍
All he will do is to jump from India to Pakistan.. just like a monkey...
I think Americans are not doing it out of… pic.twitter.com/IRKW2C5eOD





















