![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Charlie Chaplin Dressing: చార్లీ చాప్లిన్ డ్రెసింగ్ స్టైల్ ఎందుకలా ఉండేది? ఆ సూటు, బూటు కథేంటి?
Charlie Chaplin Dressing: చార్లీ చాప్లిన్ ఒకే రకమైన కాస్ట్యూమ్‌ను వేసుకోవటం వెనక చాలా పెద్ద కథే ఉంది.
![Charlie Chaplin Dressing: చార్లీ చాప్లిన్ డ్రెసింగ్ స్టైల్ ఎందుకలా ఉండేది? ఆ సూటు, బూటు కథేంటి? Why Charlie Chaplin Wear Suits, Interesting Facts About His Dressing Style Charlie Chaplin Dressing: చార్లీ చాప్లిన్ డ్రెసింగ్ స్టైల్ ఎందుకలా ఉండేది? ఆ సూటు, బూటు కథేంటి?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/17/d133d63bda0b36e3307395dc0a55245b1663414790255517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Charlie Chaplin Dressing Style:
ఫస్ట్ సినిమా నుంచే..
ఛార్లీ చాప్లిన్. ఈ పేరు పలకాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా తలుచుకున్నా చాలు మనం పెదవులపై ఓ చిరునవ్వు వచ్చేస్తుంది. ప్రపంచానికి నవ్వుని పరిచయం చేసిన నటుడు ఆయన. ఎన్ని దశాబ్దాలు గడిచిపోతున్నా...ఇప్పటికీ సినీ ప్రపంచం ఆయన గురించి మాట్లాడుకుంటూనే ఉంది. పెద్దగా హంగు ఆర్భాటాలు లేకుండా కేవలం తన ఎక్స్‌ప్రెషన్స్‌తో అందర్నీ కడుపుబ్బా నవ్వించాడు చార్లీ చాప్లిన్. ఆయన ఎన్ని సినిమాల్లో నటించారు..? ఎన్ని అవార్డులు వచ్చాయి..? ఆయన బయోగ్రఫీ ఏంటి..? ఇదంతా పాతకథే. ఇప్పుడు మనం ఆయనకు సంబంధించి ఓ కొత్త కథ తెలుసుకుందాం. ఛార్లీ చాప్లిన్ అంటే మీకేం గుర్తొస్తుంది..? అఫ్‌కోర్స్ కామెడీనే అంటారు. కానీ...ఆయన నటనకే కాదు. ఆయన డ్రెసింగ్ స్టైల్‌కీ ప్రపంచం ఫిదా అయిపోయింది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఆ డ్రెసింగ్ స్టైల్ గురించే. సూట్, షార్ట్ జాకెట్. తలపై హ్యాట్. చేతిలో కర్ర. కరెక్ట్‌గా గమిస్తే షూ సైజ్ కూడా పెద్దగా ఉంటుంది. అన్ని సినిమాల్లోనూ అదే కాస్ట్యూమ్‌తో కనిపించారు చాప్లిన్. ఎప్పుడూ ఆ స్టైల్‌ని మార్చలేదు. 1915లో చార్లీ చాప్లిన్ The Tramp అనే మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా నుంచి ఆఖరి సినిమా వరకూ దాదాపు అదే వేషధారణతో కనిపించారాయన. ఎందుకిలా..? ఇలా పర్టిక్యులర్‌గా అదే డ్రెస్‌ను ఎంచుకోవటం వెనక కారణమేంటి..?
(Image Credits: Economist)
బ్యాక్‌గ్రౌండ్ ఇదీ..!
చార్లీ చాప్లిన్ కుటుంబంలోని ముందు తరాలు పేదరికంలోనే గడిపాయి. పొట్టకూటి కోసం షూ తయారు చేసే వాళ్లు. అప్పట్లో షూ అనేది స్టేటస్ సింబల్. అవి చిరిగిపోయాయంటే వాళ్లు కటిక పేదరికంలో ఉన్నట్టు లెక్క. అప్పటి సినిమాల్లోనూ ఇదే విధంగా చూపించేవారు. అంటే పేదరికానికి అదో సింబాలిజం అన్నమాట. కానీ...చార్లీ చాప్లిన తల్లి మాత్రం తన కొడుకు అందంగా, హుందాగా కనబడాలని కోరుకునేదట. పేదరికంలో ఉన్నప్పటికీ...డ్రెసింగ్ విషయంలో మాత్రం లోటు రాకుండా చూసుకునేదట. ఉన్న వాటినే కాస్త అటు ఇటుగా కుట్టడం. పాత షూలకు పాలిష్ వేయటం లాంటివి చేసేదట. ఇదే విషయాన్ని చార్లీ చాప్లిన్ తన ఆటోబయోగ్రఫీలోనూ రాశారు. కానీ..రానురాను కటిక పేదరికం అనుభవించాల్సి వచ్చింది. చేసేదేమీ లేక చాప్లిన్ కూడా తల్లిదండ్రులతో పనులకు వెళ్లేవాడు. ఆ సమయంలో తన డ్రెసింగ్ స్టైల్‌ను మార్చుకోవాల్సి వచ్చింది. పాత బట్టలతోనే పనులు చేసేవాడు. యూనిఫామ్ ధరించి పని చేయాల్సి వచ్చేది. చాన్నాళ్ల పాటు అలా ఒకే చోట వెట్టి చాకిరీ చేసి తరవాత బయటకు వచ్చేశాడు చాప్లిన్. పొట్ట నింపుకునేందుకు ఏవేవో పనులు చేసేవాడు. అలా చేస్తూనే...మధ్యమధ్యలో తన
బట్టల్ని ఉతుక్కుంటూ అప్పుడప్పుడూ వేసుకుని మురిసిపోయేవాడు. షూకి పాలిష్ చేసి వేసుకునేవాడు. అప్పుడే సినిమాలపై ఆసక్తితోక్రమంగా అటు ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
అక్కడే కుట్టించే వారట..
1915లో The Tramp మూవీ విడుదలయ్యాక చాప్లిన్‌కు మంచి పేరే వచ్చింది. క్రమంగా సంపాదన కూడా మొదలైంది. చేతినా డబ్బు అందింది. 1920 నాటికి సొంతగా బట్టలు కొనుక్కునే స్తోమత సంపాదించుకున్నాడు చాప్లిన్. అదిగో అప్పుడే...ఆయనకు సూట్ కొనుక్కోవాలనే కోరిక కలిగింది. అమ్మ కోరుకున్నట్టుగా హుందాగా కనిపించాలని అప్పుడే బలంగా అనుకున్నాడు చాప్లిన్. లండన్‌లో ఇప్పటికీ ఫేమ్‌స్ అయిన Bespoke Tailors వద్ద ఖరీదైన సూట్ కుట్టించుకున్నాడు. అప్పుడే కాదు. ఇప్పుడు కూడా ధనికులు ఇక్కడే సూట్ కుట్టించుకుంటారు. అప్పటి యూకే ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ కూడా అక్కడే సూట్ కుట్టించుకునే వారట. ఈ కారణంగానే..చార్లీ చాప్లిన్, చర్చిల్ స్నేహితులయ్యారు. అయితే...అసలు ఇదే కాస్ట్యూమ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారని అడిగితే చాప్లిన్ ఓ ఆసక్తికర విషయం చెప్పారు. "నేనిలాంటి డ్రెస్ మాత్రమే వేసుకోవాలని ముందుగానే నిర్ణయించుకోలేదు. అప్పటికి నా వార్డ్‌రోబ్‌లో ఆ డ్రెస్ మాత్రమే కనిపించింది. అవి ఎలా ఉన్నాయో అలాగే
వాటిని వేసుకున్నాను. బ్యాగీ ప్యాంట్, పెద్ద షూస్...ఇలా ఒక్కోటి చెక్ చేసుకుని ధరించాను. ఎందుకో అలా డ్రెసప్ అవగానే తెలియని అనుభూతికి లోనయ్యాను. నేను చేయాల్సిన క్యారెక్టర్‌కి ఈ కాస్ట్యూమ్ సరైందని అనిపించింది. ఒక్కసారి కెమెరా ముందుకు రాగానే చాలా కాన్ఫిడెంట్‌గా అనిపించింది. ఎన్నో కామెడీ ఐడియాలు కూడా తట్టాయి" అని వివరించాడు చార్లీ చాప్లిన్.
(Image Credits: smithsonianmag)
సక్సెస్‌కు సంకేతం..?
అయితే...ఆయన డ్రెసింగ్ స్టైల్ గురించి కొందరు వేరే విధంగానూ చెబుతారు. ఓ సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మేన్‌కి సంకేతంగా ఆయన అలాంటి దుస్తులు ధరించేవారని అంటారు. 1920 తరవాత పూర్తిగా ఇదే వేషధారణతో కనిపించారు చాప్లిన్. ఎంతమంది ప్రముఖులను కలిసినా...అదే డ్రెసింగ్‌లో వెళ్లే వాడు. ఇక ఆయన నటించిన సినిమాల్లో డైలాగ్‌లు ఉండవు. అంటే..కేవలం ఎక్స్‌ప్రెషన్స్,బాడీ లాంగ్వేజ్‌తోనే అంతా చెప్పాలి. ఆయన ప్రత్యేకించి ఒకే డ్రెసింగ్ స్టైల్‌ని ఎంచుకోవటానికి ఇది కూడా ఓ కారణమై ఉండొచ్చు. ఆయన తన చేతి కర్ర, హ్యాట్, షూస్‌ని కూడా కామెడీలో ఆబ్జెక్ట్స్‌లో వాడుకునే వాడు.
(Image Credits: Voiceoffashion)
Also Read: Dog Attacks: కుక్కలు ఎందుకంత అగ్రెసివ్‌గా మారిపోతాయి? డాగ్ సైకాలజీ ఏం చెబుతోంది?
Also Read: History of Eating Meat: మనుషులు మాంసం తినడం ఎప్పుడు మొదలైంది? మన మెదడు సైజ్‌కి, డైట్‌కి లింక్ ఉందా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)