Who is the Amul baby : అమూల్ బేబీ ఎవరో బయటపెట్టిన కంపెనీ - ఆ బేబీతో శశిథరూర్‌కు ఉన్న రిలేషన్ ఏమిటి ?
Amul baby: అమూల్ ప్రకటనల్లో వచ్చే బేబీ ఎవరా అన్నదానిపై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. వీటన్నింటికీ చెక్ పెట్టి కంపెనీ అసలు విషయం ప్రకటించేసింది.

Who is the Amul girl Brand breaks silence: భారతదేశ ప్రకటనల రంగంలో అమూల్ బేబీ ఓ సంచలనం. ఇప్పటికీ ఆ బేబీ ఫోటోనే అమూల్ ఉపయోగిస్తూ ఉంటుంది. ఇంతకీ ఆ బేబీ ఎవరు అన్నదానిపై రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. ఇటీవల ఆ బేబీ శశిధరూర్ సోదరి అనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. శోభా థరూర్ ట్విట్టర్‌లో కూడా స్పందించారు. తానే మొదటి అమూల్ బేబీనని.. శ్యామ్ బెనెగల్ ఫోటోలు తీశారని ప్రకటించుకున్నారు. నా సోదరి స్మితా థరూర్ రెండవ కలర్ క్యాంపెయిన్‌లో ఉన్నారు. " అని ట్వీట్ చేశారు . ఈ ప్రచారంపై అమూల్ కంపెనీ స్పందించింది.
అమూల్ గర్ల్ ఇలస్ట్రేషన్ శోభా థరూర్ నుంచి ప్రేరణ పొందలేదని స్పష్టం చేసింది. 1966లో అమూల్ ఛైర్మన్ డాక్టర్ వెర్ఘీస్ కురియన్ ఆధ్వర్యంలో, సిల్వెస్టర్ డాకున్హా , యుస్టేస్ ఫెర్నాండెస్ ఈ చిన్నారి చిత్రాన్ని రూపొందించారు., ఇది పోల్సన్ బటర్ గర్ల్‌కు పోటీగా సిద్ధం చేశారు. ఈ బ్లూ-హెయిర్డ్, పోల్కా-డాటెడ్ డ్రెస్ ధరించిన చిన్నారి ఫోటో భారతీయ సంస్కృతిలో ఒక ఐకాన్‌గా మారింది. దశాబ్దాలుగా సామాజిక, రాజకీయ, క్రీడా సంఘటనలపై తన సెటైరిక్ వ్యాఖ్యానాలతో ప్రజలను ఆకర్షిస్తోంది.
Wow! Turns out the face behind Amul’s iconic Utterly Butterly Delicious campaign is none other than Shashi Tharoor’s younger sister, Shobha Tharoor ji
— 𝑰𝒏𝒅𝒊𝒂𝒏 𝑫𝒊𝒗𝒂 (@itsDivasChoice) August 20, 2025
Is that true, @ShashiTharoor @ShobhaTharoor 😃#Amul pic.twitter.com/MJx3UojDqP
శోభా థరూర్ శ్రీనివాసన్, ఇప్పుడు కాలిఫోర్నియాలో పిల్లల కథా రచయిత్రిగా ఉన్నారు. శశిథరూర్ కు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. వారిద్దరూ అమూల్‌కు ప్రకటనల్లో నటించారు. శశి థరూర్ కూడా 2016లో ఒక ఆర్టికల్‌లో తన సోదరీమణులు అమూల్ బేబీలుగా నటించిన విషయాన్ని పేర్కొన్నారు. ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత అమూల్ కార్టూన్ యాడ్‌లో ఆయన కూడా కనిపించారు.
Received a charming reel posted by @chiefsanjay from so many asking whether I inspired the UtterlButterly blue haired cherub. Yes I was the first Amul baby. Yes #ShyamBenegal took the photos. My sister @SmitaTharoor was in the 2nd colour campaign. We may have. But we don’t know. pic.twitter.com/kIYvmqBYAp
— Shobha Tharoor Srinivasan (@ShobhaTharoor) August 21, 2025
1966లో సృష్టించి అమూల్ గర్ల్, భారతదేశంలో వైట్ రెవల్యూషన్‌కు నాంది పలికిన డాక్టర్ వెర్ఘీస్ కురియన్ ఆలోచనలతో రూపొందింది. ఈ పాత్ర అమూల్ బటర్‌ను ప్రమోట్ చేయడమే కాకుండా ఇప్పటికీ అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది. దశాబ్దాలుగా, అమూల్ గర్ల్ బిల్‌బోర్డ్‌లు భారతీయ సంస్కృతిలో ఒక భాగంగా నిలిచాయి. అయితే ఆ గర్ల్ మాత్రం.. కల్పితమని.. శశిథరూర్ .. సోదరీమణులు కాదని అమూల్ క్లారిటీ ఇచ్చినట్లయింది.
Even the Amul Girl is not free from the revisionistas. @ShashiTharoor has said his sisters Shobha and Smitha were "Amul babies", who featured in its 'Utterly Butterly' campaigns. Its creator Sylvester daCunha was a friend of his father Chandran Tharoor.@Amul_Coop says no. https://t.co/4M0faC2hxI pic.twitter.com/FpVfVSdefb
— churumuri (@churumuri) August 26, 2025





















