అన్వేషించండి

Mpox Cases: డేంజర్ బెల్స్ మోగిస్తున్న మరో ప్యాండెమిక్! గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO

Mpox Pandemic: ప్రపంచ దేశాల్లో మంకీపాక్స్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దాదాపు 116 దేశాల్లో బాధితుల సంఖ్య పెరుగుతోంది. WHO గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది.

Mpox Surge: తరచూ ఏదో ఓ మహమ్మారి మనల్ని వెంటాడుతూనే ఉంది. కొవిడ్ నుంచి బయటపడ్డామని అనుకునే లోగా ఇంకోటి దాడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో mpox కేసులు పెరుగుతున్నాయి. దాదాపు 116 దేశాల్లో వ్యాప్తి చెందుతోంది. ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఓ కీలక ప్రకటన చేసింది. mpox కేసులు పెరుగుతుండడాన్ని దృష్టిలో పెట్టుకుని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. mpox పై హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడం ఇది రెండోసారి. దాదాపు రెండేళ్లుగా ఈ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ మేరకు WHO డైరెక్టర్ జనరల్ టెడ్రాస్ అధనామ్‌ అధికారిక (mpox cases) స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఎమర్జెన్సీ కమిటీ ఇప్పటికే ఈ కేసులపై రివ్యూ చేస్తోంది. చాలా వేగంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోందని గుర్తించింది. డెమొక్రటిక్ రిపబ్లికన్ ఆఫ్ కాంగోలో clade 1b స్ట్రెయిన్‌ విపరీతంగా వ్యాప్తి చెందుతోందని స్పష్టం చేసింది. కాంగోతో పాటు చుట్టు పక్కల దేశాల్లోనూ ప్రభావం చూపుతోంది. లైంగిక సంపర్కం ద్వారా వ్యాప్తి చెందుతుందని చెప్పిన వైద్యులు చెబుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఆఫ్రికాలో కేసులు పెరుగుతుండడంపైనా హెచ్చరికలు జారీ చేశారు. తక్షణమే కట్టడి చర్యలు చేపట్టకపోతే ప్రపంచమంతా ఇదే దుస్థితి తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు. 

ఏంటీ వైరస్..?

Orthopoxvirus కారణంగా ఈ వ్యాధి సోకుతుంది. 1970లో మొట్టమొదటి సారి మనుషుల్లో ఈ వైరస్‌ని గుర్తించారు. డెమొక్రటిక్ రిపబ్లికన్ ఆఫ్ కాంగోలోనే తొలిసారి కనుగొన్నారు. ఆ తరవాత అన్ని ఆఫ్రికన్ దేశాల్లో వైరస్ వ్యాప్తి చెందింది. గతేడాది ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. 15,600 కేసులు నమోదు కాగా 537 మంది ప్రాణాలు కోల్పోయారు. బురుండి, కెన్యా, ఉగాండా, ర్వాండాలో ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుల సంఖ్యని చూసి ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించింది. అల్పాదాయ దేశాల్లో వ్యాక్సిన్‌లు పెద్ద మొత్తంలో అందించాలని స్పష్టం చేసింది. లేదంటే మరో మహమ్మారిని ఎదుర్కోక తప్పదని వెల్లడించింది. mpox ని గతంలో మంకీపాక్స్‌గా పిలిచేవాళ్లు. జంతువుల నుంచి మనుషులకు ఈ వైరస్ సోకుతుంది. ఇటుక ఆకారంలో ఉండే ఈ వైరస్ సోకితే...ఒళ్లంతా దద్దుర్లు వస్తాయి. 

వ్యాక్సిన్ ఉందా..?

చూడడానికి Smallpox లాగే కనిపించినా లక్షణాలు కాస్త వేరుగా ఉంటాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ల ప్రాణాల్ని తీసేస్తుంది. చిన్న పిల్లలు, గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలి. వీళ్లలోనే ఎక్కువగా లక్షణాలు కనిపిస్తాయి. స్కిన్ ఇన్ఫెక్షన్‌లు, కళ్ల సమస్యలతో పాటు న్యుమోనియా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తాయి. స్మాల్‌పాక్స్‌తో పోల్చి చూస్తే mpox కారణంగా చనిపోయే వాళ్ల సంఖ్య తక్కువే అయినా సరైన సమయానికి వైద్యం అందించకపోతే ప్రమాదం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. European Medicines Agency ఇప్పటికే ఓ మెడిసిన్‌కి అప్రూవల్ ఇచ్చింది. దాని పేరు tecovirimat. వాస్తవానికి స్మాల్‌పాక్స్‌ కోసం ఈ మందులు తయారు చేశారు. mpox కోసమూ దీన్నే వినియోగిస్తున్నారు. OrthopoxVac వ్యాక్సిన్‌ని ప్రస్తుతానికి అందిస్తున్నారు. ఇది కూడా స్మాల్‌పాక్స్ కోసం తయారు చేసిందే. 

Also Read: Kolkata Doctor Murder: ట్రైనీ డాక్టర్‌ డైరీలో చివరి పేజీ, ఈ దారుణానికి కొద్ది గంటల ముందు ఏం రాసుకుందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget