Weather Latest Update: నైరుతికి తోడైన ద్రోణి- తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలే
Weather Forecast: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.
Weather Latest News: నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. రాయలసీమ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి కూడా రుతుపవనాలకు తోడై జోరు వానలకు కారణమవుతోంది.
తెలంగాణ వాతావరణం
తెలంగాణలో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మంచిర్యాల, ములుగు, జగిత్యాల, ఆసిఫాబాద్, రాజన్నసిరిసిల్ల, కరీనంగర్, భూపాలపల్లి, పెద్దపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, వరంగల్, జిల్లాల్లో ఇప్పటికే కురుస్తున్నాయి. 20 వరకు కూడా వర్షాలు పడతాయి. వర్షాలతోపాటు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలుపు వీయనున్నాయి.
హైదరాబాద్‌లో వాతావరణం
ఆకాశం మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి వేళల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. గరిష్టఉష్ణోగ్రత 35 డిగ్రీలు ఉంటే కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలుగా నమోదు అయ్యే ఛాన్స్ ఉంది. ఆదివారం గరిష్ణ ఉష్ణోగ్రత 34.9 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 25.9 డిగ్రీలుగా నమోదు అయింది.
Thunder clouds crawling furthur from west, north west and south west direction, It is expected that Chanda nagar, Serlingampalli, moosapet, Jubilihills, Karwan, Mehdipatnam, Rajendra nagar, Charminar areas may experience light to moderate rainfall in next one hour. pic.twitter.com/tOTn3BA77I
— IMD_Metcentrehyd (@metcentrehyd) June 16, 2024
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం
ఆంధ్రప్రదేశ్‌లో కూడా వర్షాలు దంచికొట్టనున్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు మూడు రోజుల పాటు వానలు పడాతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు మెరుపులతో కూడిన వానలకు తోడు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలుగు కూడా వీస్తాయి. శనివారం నుంచే ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు పడుతున్నాయి.
7 Day midday forecast(in Telugu and English) of Andhra Pradesh dated 16-06-2024 #IMD #APWeather #APforecast #MCAmaravati #CEOAndhra #AndhraPradeshCM #dgpapofficial #IMDWeather pic.twitter.com/foZZb00bEF
— MC Amaravati (@AmaravatiMc) June 16, 2024
ఏపీలో సోమవారం వాతావరణం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటలకు 30-40 కిలోమీటర్లు వేగంతో వీస్తాయి. 23వ తేదీ వరకు ఇదే వాతావరణం కొనసాగనుంది. అందుకే వాతవరణ శాఖ అన్నిజిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అన్నిప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.