Smriti Mandhana Century: బిగ్‌బాష్‌లో మంధాన బిగ్‌హిట్స్.. 57 బంతుల్లో సెంచరీ కొట్టేసిన స్మృతి
బిగ్‌బాష్‌లో సెంచరీ కొట్టిన తొలి భారతీయురాలిగా స్మృతి మంధాన రికార్డులు సృష్టించింది. కేవలం 57 బంతుల్లోనే సెంచరీ చేసేసింది.
టీమ్‌ఇండియా క్రికెటర్ స్మృతి మంధాన (114*: 64 బంతుల్లో 14x4, 3x6) అదరగొట్టింది. మహిళల బిగ్‌బాష్ లీగులో దుమ్మురేపింది. కేవలం 64 బంతుల్లోనే 114 పరుగులతో అజేయంగా నిలిచింది. లీగులో అత్యధిక పరుగులు చేసిన యాష్ గార్డ్‌నర్‌ను సమం చేసింది. ఆమె ధాటికి ప్రత్యర్థి జట్టు దాదాపుగా హడలిపోయింది.
మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌తో 176 పరుగుల లక్ష్యఛేదనలో సిడ్నీ థండర్ బ్యాటర్ మంధాన తొలి 15 బంతుల్లో 15 పరుగులే చేసింది. పిచ్, పరిస్థితులు అర్థం చేసుకున్న తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగింది. 4 బౌండరీలు ఒక సిక్సర్‌తో 31 బంతుల్లోనే అర్ధశతకం అందుకుంది. ఆపై మరింత విధ్వంసకరంగా ఆడింది. ప్రత్యర్థి బౌలర్లను ఆటాడుకుంది. భీకరంగా బౌండరీలు బాదుతూ 57 బంతుల్లో సెంచరీ చేసింది. ఆమెకు తోడుగా తహిలా విల్సన్ (38; 39 బంతుల్లో 3x4) నిలిచింది. హర్మన్‌ప్రీత్ వేసిన ఆఖరి ఓవర్లో విజయానికి 13 పరుగులు అవసరం మంధాన జోడీ కేవలం 8 పరుగులే చేసి 4 పరుగుల తేడాతో ఓడిపోయింది.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన రెనెగేడ్స్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ (81*: 55 బంతుల్లో 11x4, 2x6) ఆటే హైలైట్. వీరవిహారం చేసిన కౌర్ 38 బంతుల్లోనే అర్ధశతకం అందుకుంది. ఆపై మరింత విజృంభించి అజేయంగా నిలిచింది. ఈవ్ జోన్స్ (42), జెస్ డఫిన్ (33) ఫర్వాలేదనిపించారు. మొత్తంగా ఈ మ్యాచులో ఇద్దరు భారత అమ్మాయిలే హవా కొనసాగించారు.
A beautiful innings!
— Weber Women's Big Bash League (@WBBL) November 17, 2021
Congratulations, @mandhana_smriti 🤩 #WBBL07 pic.twitter.com/Jwo4E1fN3X
Also Read: IND vs NZ: మరో చరిత్రకు నాంది! కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ మొదటి సిరీస్.. కివీస్‌తో నేడే ఢీ!
Also Read: IND vs NZ: టీమ్‌ఇండియాతో టీ20 సిరీసుకు కేన్ విలియమ్సన్ దూరం.. కెప్టెన్ ఎవరంటే!
Also Read: Uganda: ఉగాండాలో వరుస పేలుళ్లు.. భారత జట్టు సేఫ్.. ఈ వీడియోలు చూశారా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
What a partnership from Jess Duffin and Harmanpreet Kaur!
— Weber Women's Big Bash League (@WBBL) November 17, 2021
They've helped the @RenegadesWBBL to an imposing 4-175 in Mackay. Scorecard: https://t.co/e5UVmR8Ekj #WBBL07 pic.twitter.com/ElkYSdgLQv