News
News
వీడియోలు ఆటలు
X

Viral News: ఫ్లైట్ అటెండెంట్‌తో ప్యాసింజర్ పిచ్చి చేష్టలు, ఫుల్‌గా తాగి బలవంతంగా ముద్దు

Viral News: డెల్టా ఎయిర్‌లైన్స్‌లో ఓ ప్యాసింజర్ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించాడు.

FOLLOW US: 
Share:

Passenger Kisses Flight Attendant:

డెల్టా ఎయిర్‌లైన్స్‌లో ఘటన 

"ఫ్లైట్‌లలో ప్రయాణం చేసే వాళ్లకు ఓ డిగ్నిటీ ఉంటుంది. చాలా డీసెంట్‌గా బిహేవ్ చేస్తారు" ఇందతా పాత ముచ్చట. ఇప్పుడు విమానాల్లోనే వింత ఘటనలు జరుగుతున్నాయి. ప్యాసింజర్స్‌ సీట్‌ల కోసం కొట్టుకుంటున్నారు. సిబ్బందితో గొడవ పడుతున్నారు. నోటికొచ్చినట్టు తిడుతున్నారు. ఒక్కరిద్దరి కారణంగా ప్రయాణికులందరూ ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇప్పుడు ఇలాంటి ఘటనే మరోటి వెలుగులోకి వచ్చింది. డెల్టా ఎయిర్‌లైన్స్‌కి (Delta Airlines) చెందిన  ఫ్లైట్‌లో ఓ ప్యాసింజర్‌ పీకలదాకా తాగాడు. సైలెంట్‌గా పడుకోకుండా పక్క వాళ్లను ఇబ్బంది పెట్టాడు. అలాస్కాకు వెళ్తున్న ఫ్లైట్‌ ఎక్కిన 61 ఏళ్ల ప్రయాణికుడు ఫుల్‌గా తాగి సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇక్కడ మరీ షాకింగ్ విషయం ఏంటంటే...ఓ మేల్ అటెండెంట్‌ని గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు. అక్కడితో ఆగకుండా "నువ్వు చాలా అందంగా ఉన్నావ్" అంటూ కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడు. The New York Post న్యూస్‌పేపర్ వెల్లడించిన వివరాల ప్రకారం...ఆ ప్యాసింజర్ పేరు డేవిడ్ అలన్ బ్రూక్. మిన్నెసొట నుంచి అలాస్కా వెళ్లేందుకు ఏప్రిల్ 10వ తేదీన ఫ్లైట్ ఎక్కాడు. బిజినెస్ ఫస్ట్‌ క్లాస్‌లో టికెట్ బుక్ చేసుకున్నాడు. ఫస్ట్‌ క్లాస్‌లో ట్రావెల్ చేసే వాళ్లకు ఆల్కహాల్ సర్వ్ చేస్తారు. కానీ దానికంటూ ఓ లిమిట్ ఉంటుంది. డేవిడ్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఫుల్‌గా తాగాడు. ఆ తరవాత ఫ్లైట్ క్రూకి చుక్కలు చూపించాడు. 

బలవంతంగా ముద్దు 

మితిమీరి మద్యం సేవిస్తున్నాడని గుర్తించిన సిబ్బంది కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించింది. కానీ...అది వర్కౌట్ కాలేదు. చేసేదేమీ లేక ఓ వ్యక్తి అతనికి మందు సర్వ్ చేసేందుకు వచ్చాడు. ఇది చూసి ఆ ప్యాసింజర్ తెగ మురిసిపోయాడు. అప్పటి వరకూ తిట్టిన వాడు కాస్త పొగడటం మొదలు పెట్టాడు. ముద్దు పెట్టుకుంటానంటూ ఆ మందు సర్వ్ చేసిన వ్యక్తిని పిలిచాడు. అందుకు అతడు ఒప్పుకోలేదు. వెంటనే పైకి లేచి గట్టిగా పట్టుకుని మెడపై ముద్దు పెట్టుకున్నాడు డేవిడ్. ఇది చూసి అంతా షాక్ అయ్యారు. అంతే కాదు. ట్రేలో సర్వ్ చేసిన ఫుడ్‌ని కూడా కింద పడేశాడు. ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే అధికారులకు సిబ్బంది ఫిర్యాదు చేసింది. FBI పోలీసులు ఆ ప్రయాణికుడిపై కేసు నమోదు చేశారు. విచారణ కొనసాగిస్తున్నారు. త్వరలోనే కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. 
 
ఇండిగో ఫ్లైట్‌లో.. 

ఇండిగో ఫ్లైట్‌లో మద్యం మత్తులో ఓ ప్రయాణికుడు సిబ్బందితో గొడవ పడ్డాడు. బ్యాంకాక్ నుంచి ముంబయికి వచ్చే ఫ్లైట్‌లో స్వీడిష్ ప్రయాణికుడు ఓ క్రూ మెంబర్‌ను తిట్టాడు. ముంబయిలో ల్యాండ్ అయిన వెంటనే సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు తెలుసుకున్న పోలీసులు ఆ ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు. అంధేరి మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరిచారు. ఆ వ్యక్తిని మందలించిన కోర్టు రూ.20 వేల జరిమానా విధించి బెయిల్ ఇచ్చింది. ఈ ఘటనపై పూర్తి విచారణకు అధికారులు ఆదేశించారు. నిందితుడి పేరు క్లాస్ ఎరిక్‌గా గుర్తించారు. వయసు 63 ఏళ్లు. ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పిన వివరాల ప్రకారం...ఆహారం విషయంలో ఫ్లైట్ సిబ్బందితో గొడవ పడినట్టు తెలుస్తోంది. సీ ఫుడ్ కావాలని మొండి పట్టు పట్టడంతో పాటు పదేపదే సిబ్బందిని తిట్టాడు. సీ ఫుడ్ లేదని చెప్పిన ఎయిర్ హోస్టెస్ చికెన్ తీసుకొచ్చి ఇచ్చింది. బిల్ పే చేయాలని అడగ్గా...ఆమె చేయి పట్టుకున్నాడు. వెంటనే చేయి వెనక్కి లాక్కున్న ఎయిర్ హోస్టెస్ బిల్ కట్టాలని గట్టిగా అడిగింది. వెంటనే ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. ఈ గొడవలో జోక్యం చేసుకున్న మరో ప్రయాణికుడిపై దాడి చేశాడు. అప్పటికే ఎయిర్ హోస్టెస్ ఫ్లైట్ కేప్టెన్‌కు ఈ గొడవ గురించి చెప్పింది. ల్యాండ్ అయిన వెంటనే పైలట్...అక్కడి అధికారులకు ఈ సంఘటన అంతా వివరించాడు. ఆ తరవాత పోలీసులు వచ్చి నిందితుడిని అరెస్ట్ చేశారు. 

Also Read: Amritpal Singh Arrested: ఎట్టకేలకు అమృత్ పాల్ సింగ్‌ అరెస్టు! 36 రోజుల పోలీసుల అన్వేషణకు తెర

Published at : 23 Apr 2023 11:03 AM (IST) Tags: Drunk passenger Viral News Delta Airlines Delta flight Passenger Kisses Flight Attendant

సంబంధిత కథనాలు

AP PG CET: ఏపీ పీజీ సెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

AP PG CET: ఏపీ పీజీ సెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్

Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Odisha Train Accident: కవచ్‌ ఉన్నా లాభం లేకపోయేది, కొన్ని ప్రమాదాల్ని ఏ టెక్నాలజీ అడ్డుకోలేదు - రైల్వే బోర్డ్

Odisha Train Accident: కవచ్‌ ఉన్నా లాభం లేకపోయేది, కొన్ని ప్రమాదాల్ని ఏ టెక్నాలజీ అడ్డుకోలేదు - రైల్వే బోర్డ్

Telangana As Number 1: జయహో తెలంగాణ‌, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హ‌ర్షం

Telangana As Number 1: జయహో తెలంగాణ‌, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హ‌ర్షం

టాప్ స్టోరీస్

Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ

Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

Allu Arjun - Telugu Indian Idol 2 : గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పేసిన అల్లు అర్జున్ - ఇంటికెళ్లాక పరిస్థితి ఏంటో?

Allu Arjun - Telugu Indian Idol 2 : గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పేసిన అల్లు అర్జున్ - ఇంటికెళ్లాక పరిస్థితి ఏంటో?