By: ABP Desam | Updated at : 23 Apr 2023 08:10 AM (IST)
అమృత్ పాల్ సింగ్ అరెస్టు
ఎట్టకేలకు వారిస్ పంజాబ్ చీఫ్ అమృత్ పాల్ సింగ్‌ను 36 రోజుల తర్వాత పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఖలిస్తాన్ మద్దతుదారుడు అమృతపాల్ సింగ్‌ను పోలీసులు మోగాలోని గురుద్వారా నుండి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. దీంతో 36 రోజుల పోలీసుల అన్వేషణకు తెరపడింది. అజ్నాలా ఘటన తర్వాత అతడు పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. పరారీలో ఉన్న అతని భార్య కిరణ్‌దీప్ కౌర్‌ను మూడు రోజుల క్రితం గురువారం (ఏప్రిల్ 21) అమృత్‌సర్ విమానాశ్రయంలో అడ్డుకున్నారు.
అమృత్ పాల్‌కు సంబంధించిన అనుచరులు, సహచరులు అందరినీ ఇప్పటికే అరెస్టు చేశారు. అతని సహచరులను లోతుగా విచారణ చేశారు. అతని భార్యపై పోలీసులు ఒత్తిడి తీసుకురావడంతో అతడి ఆచూకీ తెలిసి, అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అమృత్ పాల్‌ని దిబ్రూగఢ్ జైలుకు పంపే అవకాశం ఉంది. అమృత్ పాల్ పరారీలో ఉన్న సమయంలో, ఆయన చాలాసార్లు సోషల్ మీడియా ద్వారా వీడియోలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
'Waris Punjab De' chief Amritpal Singh arrested by Punjab Police from Moga district of Punjab: Sources
— ANI (@ANI) April 23, 2023
Amritpal Singh was on the run since March 18. pic.twitter.com/ks9IOJIWIc
మార్చి 18 నుంచి పరారీలో
మార్చి 18న అమృత్ పాల్ సింగ్ పరారీలో ఉన్నాడు. అతడికి అత్యంత సన్నిహితుడైన లవ్‌ప్రీత్ సింగ్ అలియాస్ తూఫాన్ సింగ్‌ను ఇటీవల పంజాబ్ పోలీసులు ఓ కిడ్నాప్ కేసులో అరెస్టు చేశారు. దాన్ని వ్యతిరేకిస్తూ అమృత్ పాల్ సింగ్ పిలుపు ఇచ్చి.. ఫిబ్రవరి 24న పెద్ద సంఖ్యలో యువత అమృత్ సర్ జిల్లాలోని అజ్‌నాలా పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. అల్లర్లు జరిగేలా యువతను రెచ్చగొట్టాడన్న ఆరోపణలపై అమృత్ పాల్‌పై కేసు నమోదైంది. ఆ తర్వాత అమృత్ పాల్ పారిపోయారు.
అలా అతణ్ని, అతని సహచరులను పట్టుకునేందుకు పోలీసులు అన్వేషణ మొదలుపెట్టారు. ఈ సమయంలో పోలీసులు అతని సహచరులను చాలా మందిని అరెస్టు చేశారు, అయితే అమృత్ పాల్ మాత్రం దొరకలేదు. అప్పటి నుంచి పోలీసులు అతని కోసం నిరంతరం వెతుకుతున్నారు. పోలీసులకు దొరక్కుండా ఎప్పటికప్పుడు వేషాలు మారుస్తూ బురిడీ కొట్టించాడు.
The latest picture of #AmritpalSingh in Punjab Police custody shared with ANI by Official sources pic.twitter.com/z7VB91Na0D
— ANI (@ANI) April 23, 2023
Form 16: ఇంకా ఫామ్-16 అందలేదా?, ఆన్‌లైన్‌లో చూసే ఆప్షన్ కూడా ఉంది
NEET UG 2023: వెబ్‌సైట్‌లో నీట్ యూజీ రెస్పాన్స్ షీట్లు, త్వరలోనే ఆన్సర్ కీ!
EPFO: 6 కోట్ల మంది సబ్‌స్క్రైబర్‌లకు EPFO మెసేజ్‌లు, అందులో ఏం ఉంది?
Youngest Billionaire: లైఫ్‌లో రిస్క్ చేయకపోతే మిగిలేది రస్కే - యంగెస్ట్ బిలియనీర్ సలహా
Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్, కవచ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్
TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు
Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?
Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు
Prashanth Neel Birthday : ప్రశాంత్ నీల్ పుట్టినరోజు - విషెస్ చెప్పిన ప్రభాస్, 'సలార్' మేకింగ్ వీడియో విడుదల