అన్వేషించండి

VinFast VF MPV 7 Launched: విన్‌ఫాస్ట్ నుండి అదిరిపోయే ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ ఛార్జ్‌తో 517 కిలోమీటర్లు! ‘VF MPV 7’ ధర, ఫీచర్లు ఇవే!

విన్‌ఫాస్ట్ కంపెనీ భారత మార్కెట్లోకి VF MPV 7 ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. రూ. 24.49 లక్షల ధరతో వస్తున్న ఈ వాహనం 517 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

VinFast VF MPV 7 Launched in India: ప్రముఖ వియత్నామీస్ ఆటోమొబైల్ సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast) భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో తన మూడవ మోడల్‌ను ప్రవేశపెట్టింది. సరికొత్త ‘VF MPV 7’ ఎలక్ట్రిక్ కారును రూ. 24.49 లక్షల (ఎక్స్‌షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ కారు బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కేవలం రూ. 21,000 టోకెన్ అమౌంట్ చెల్లించి కస్టమర్లు తమ వాహనాన్ని రిజర్వ్ చేసుకోవచ్చు. కమర్షియల్ రంగం కోసం ఈ ఏడాది చివరలో ‘లిమో గ్రీన్’ అనే ప్రత్యేక వెర్షన్‌ను కూడా కంపెనీ తీసుకురాబోతోంది.

డిజైన్ - కొలతలు..
VF MPV 7 కారు చూడటానికి చాలా స్టైలిష్‌గా, ఆధునిక డిజైన్ లాంగ్వేజ్‌తో కనిపిస్తుంది. దీని పొడవు 4,740 మిమీ, వెడల్పు 1,872 మిమీ కాగా, ఎత్తు 1,734 మిమీ ఉంటుంది. ముందు భాగంలో కంపెనీ సిగ్నేచర్ ‘V’ లోగోతో కలిసేలా ఎల్ఈడీ డీఆర్ఎల్స్ (LED DRLs) అమర్చారు. దీనికి తోడుగా వర్టికల్ హెడ్‌ల్యాంప్స్ కారుకు ఒక ప్రత్యేక గుర్తింపునిస్తాయి. 19-అంగుళాల అలాయ్ వీల్స్, పుల్-స్టైల్ డోర్ హ్యాండిల్స్ సైడ్ ప్రొఫైల్‌ను ఆకర్షణీయంగా మార్చాయి. వెనుక వైపు కూడా సన్నని ఎల్ఈడీ టైల్ లైట్స్ ‘V’ ఆకారంలో మెరుస్తూ కారుకు రాజసాన్ని ఇస్తాయి. ఇందులో ఏకంగా 1,240 లీటర్ల భారీ బూట్ స్పేస్ లభిస్తుంది అని నిపుణులు చెబుతున్నారు.

ఇంటీరియర్ - అదిరిపోయే ఫీచర్లు..
కారు లోపల లగ్జరీతో పాటు ప్రాక్టికాలిటీకి ప్రాధాన్యత ఇచ్చారు. 10.1-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ ఇందులో ఉన్నాయి. ప్రీమియం లెదరెట్ సీట్లు, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ప్రయాణాన్ని సుఖవంతం చేస్తాయి. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్ వంటి ఫీచర్లు భద్రతను పెంచుతాయి. మూడవ వరుస ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏసీ వెంట్స్, కప్ హోల్డర్లు కూడా ఏర్పాటు చేశారు. వివి (ViVi) వర్చువల్ అసిస్టెంట్, క్యాంప్ మోడ్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఈ కారు ప్రత్యేకతలుగా విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

రేంజ్ - పవర్‌ట్రెయిన్..
పెర్ఫార్మెన్స్ విషయంలో VF MPV 7 చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇందులో 60.1 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏఆర్ఏఐ (ARAI) ప్రమాణాల ప్రకారం 517 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. దీనిలోని ఎలక్ట్రిక్ మోటార్ 201 hp పవర్, 280 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 9 సెకన్ల లోపే సున్నా నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. లో, మీడియం, హై అనే మూడు రకాల రీజెనరేటివ్ బ్రేకింగ్ లెవల్స్ ఇందులో ఉన్నాయి. గరిష్టంగా గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. ఫ్యామిలీతో కలిసి లాంగ్ ట్రిప్స్ వెళ్లే వారికి ఈ ఎలక్ట్రిక్ ఎంపీవీ ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది అని నిపుణులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ఏదేమైనా వరుస మోడళ్లతో ఈవీ రంగంలో విన్ ఫాస్ట్ తన దూకుడును చూపిస్తోంది. తాజా మోడల్లోని ఫీచర్లతో ఇండియన్ ఈవీ మార్కెట్ ను షేక్ చేయాలని కంపెనీ పట్టుదలగా ఉన్నట్లు గా తెలుస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Revanth Reddy Challenges KCR: సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget