అన్వేషించండి

Bike Driving Tips: బైక్‌ రిజర్వ్‌లో నడుపుతుంటే జాగ్రత్త ! ఇంజిన్‌ సేఫ్‌గా ఉండాలంటే ఎంత పెట్రోల్ ఉండాలి

Bike Driving Tips: కొందరు వ్యక్తులు అలవాటుగా, దాదాపు ఎప్పుడూ తమ బైక్‌లను 'రిజర్వ్'లో ఉంచి నడుపుతుంటారు. అయితే, ఈ అలవాటు మీ బైక్ ఇంజిన్‌కు మరియు దాని పనితీరుకు హానికరమని మీకు తెలుసా?

చాలా మంది తమ బైక్‌ పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేపించరు. రైడర్లు కేవలం అవసరానికి తగినట్లుగా కొంచెం కొంచెం పెట్రోల్ పోయించేవారు చాలా మంది ఉంటారు. అయితే బైక్ రిజర్వ్ మోడ్‌లోకి వచ్చే వరకు నడుపుతూనే ఉంటారు. కొంతమంది అయితే అలవాటుగా తమ బైక్‌ను దాదాపు ఎప్పుడూ రిజర్వ్‌‌లోనే నడుపుతుంటారు. ఈ అలవాటు మీ బైక్ ఇంజన్‌కు, దాని పెర్ఫార్మెన్స్ దెబ్బతింటుందని మీకు తెలుసా? మరి ప్రతిరోజూ రిజర్వ్‌లో బైక్ నడపడం వల్ల ఇంజన్‌ ఏమవుతుంది, దానిపై ఏ ప్రభావం పడుతుందో ఇక్కడ తెలుసుకోండి. 

రిజర్వ్ మోడ్ అంటే ఏమిటి?
బైక్‌లో రిజర్వ్ మోడ్ అనేది ఒక రకమైన ఎమర్జెన్సీ సౌకర్యం. పెట్రోల్ అయిపోవచ్చినప్పుడు, మీరు దగ్గర్లోని పెట్రోల్ బంకుకు చేరుకోవడానికి వీలుగా బైక్‌ను రిజర్వ్‌లో పెట్టి కొంత దూరం వరకు వెళ్లవచ్చు. దీని అసలు ఉద్దేశ్యం బైక్‌ను ఎప్పుడూ ఈ మోడ్‌లో నడపడం సరి కాదు. ఇది కేవలం అత్యవసర పరిస్థితుల కోసం మాత్రమే ఇచ్చిన ఓ సౌకర్యం. ఎప్పుడైనా ఒకసారి బైక్ రిజర్వ్‌లో నడిస్తే పెద్ద సమస్య ఉండదు. కానీ మీరు రెగ్యూలర్‌గా ఇదే అలవాటుగా మార్చుకుంటే మీకు నష్టం కలిగే అవకాశం ఉంది. 

రెగ్యూలర్‌గా బైక్ రిజర్వ్‌లో నడపడం వల్ల ఇంజన్‌పై ప్రభావం

ఇంజన్ పనితీరు దెబ్బతింటుంది - బైక్‌లో తక్కువ పెట్రోల్ ఉన్నప్పుడు మీరు గమనించి ట్యాంకులో ఎంతో కొంత పెట్రోల్ కొట్టించాలి. పెట్రోల్ అయిపోయిందరి నిరంతరం రిజర్వ్‌లో నడిపినప్పుడు, ఇంజన్‌కు ఫ్యూయల్ సరైన రీతిలో అందదు. దాంతో ఇంజన్ ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది. దీని ప్రభావం ఒక్కసారిగా కాదు, క్రమంగా కనిపిస్తుంది. మీ బైక్ పికప్ తగ్గవచ్చు, యాక్సిలరేషన్ తగ్గినట్లు అనిపించవచ్చు. బైక్ ఇంజన్ స్మూత్‌నెస్ తగ్గుతుంది. ఎక్కువ రోజులు, రెగ్యూలర్‌గా ఇలా చేయడం వల్ల ఇంజన్ లైఫ్ టైం తగ్గి త్వరగా చెడిపోతుంది. 

బైక్ అకస్మాత్తుగా ఆగిపోవచ్చు - రిజర్వ్‌లో బైక్ రెగ్యూలర్‌గా నడపడం వల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే, పెట్రోల్ ఎప్పుడు అయిపోతుందో ఖచ్చితంగా అంచనా వేయలేరు. బైక్ రోడ్డు మధ్యలో, మీ దారిలో ఎప్పుడైనా అకస్మాత్తుగా ఆగిపోవచ్చు. దాంతో మీరు పక్కకు బండిని నెట్టే అవకాశం లేకపోతే ట్రాఫిక్‌లో ఇబ్బందులు కలగవచ్చు. కొన్నిసార్లు ప్రమాదం సైతం జరగవచ్చు.

ఫ్యూయల్ సిస్టమ్‌లోకి వ్యర్థాలు  - ట్యాంక్‌లో పెట్రోల్ చాలా తక్కువగా ఉన్నప్పుడు, ఫ్యూయల్ పంప్ అడుగున పేరుకుపోయిన మట్టి, మురికి, వ్యర్థాలు అలాగే లోపలికి వెళ్తాయి. దీనివల్ల ఫ్యూయల్ లైన్ జామ్ అయి ఇంజన్‌లోకి మురికి చేరవచ్చు. ఫలితంగా బైక్ ఇంజిన్ పనితీరు, మైలేజ్ రెండూ దెబ్బతింటాయి.

ఫ్యూయల్ సెన్సార్ దెబ్బతింటుంది -  రెగ్యూలర్‌గా మీరు తక్కువ పెట్రోల్‌తో కనుక బైక్ నడపడం వల్ల ఫ్యూయల్ ట్యాంక్ సెన్సార్ కూడా త్వరగా పాడైపోవచ్చు. సెన్సార్ పాడైతే ఫ్యూయల్ లెవల్ మీకు సరిగ్గా కనిపించదు. రాంగ్ ఇండికేషన్స్ కూడా రావచ్చు. దీనివల్ల తరచూ రిపేర్ చేయాల్సి వస్తుంది. 

బైక్‌లో ఎంత ఇంధనం ఉండాలి
బైక్‌లో ఎప్పుడూ కనీసం 2 నుండి 3 లీటర్ల పెట్రోల్ ఉండాలి. అలా చేసినప్పుడు మీ బైక్ ఇంజన్ సరిగ్గా పనిచేస్తుంది. మీ ఫ్యూయల్ పంప్, ఇంజిన్ సురక్షితంగా ఉంటుంది. బైక్ ఇంజిన్ లైఫ్ టైమ్ తగ్గకుండా ఉంటుంది. 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

కియా సిరోస్‌ EVకి అదిరిపోయే డిమాండ్‌.. 650కి పైగా బుకింగ్స్‌, ఒక్కరోజులోనే 150 డెలివరీలు
ఈ EV డిమాండ్‌ మామూలుగా లేదుగా! ఒక్కరోజులో 150.. ఇది నేషనల్‌ రికార్డ్‌
KTM 390 Duke వర్సెస్‌ RE Guerrilla 450 Apex.. ధర, పవర్‌, ఫీచర్లలో ఏది బెస్ట్‌?
KTM 390 Duke వర్సెస్‌ Guerrilla 450.. పెద్ద ఇంజిన్‌ ఉన్నా తక్కువ ధరలో RE బైక్‌!
2026 Skoda Slavia ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌లో భలే అప్‌డేట్స్‌.. వెనుక సీట్‌లో కూర్చున్నవాళ్లకు మంచి మసాజ్‌!
2026 Skoda Slavia ఫేస్‌లిఫ్ట్‌.. కొత్త ఫీచర్లతో అదరగొడుతున్న సెడాన్! బుకింగ్స్‌ ప్రారంభం
రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి
రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Embed widget