అన్వేషించండి
Advertisement
Venkaiah Naidu Farewell: 'మీ కౌంటర్లకు ఎదురు లేదు, మీ పంచ్‌లకు తిరుగు లేదు'- వెంకయ్యపై మోదీ ప్రశంసలు
Venkaiah Naidu Farewell: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిపై ప్రశంసలు కురిపించారు ప్రధాని నరేంద్ర మోదీ.
Venkaiah Naidu Farewell: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు తన పదవీకాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. వెంకయ్య నాయుడు అనుభవం దేశానికి ఎంతో అవసరమని మోదీ అన్నారు.
Personally, it has been my fortune that I have seen you closely in different roles. I also had the fortune to work with you in some of those roles. Be it your ideological commitment as a party worker, your work as an MLA, your activity in the House as an MP..: PM Modi in RS (1/2) pic.twitter.com/kHLps0yvMl
— ANI (@ANI) August 8, 2022
" సభకు ఇది అత్యంత భావోద్వేగపూరిత క్షణం. వెంకయ్య నాయుడు సమక్షంలో సభలో అనేక చారిత్రక ఘటనలు జరిగాయి. "నేను రాజకీయాల నుంచి రిటైర్ అయ్యాను కానీ ప్రజా జీవితం నుంచి కాదు" అని మీరు చాలా సార్లు చెప్పారు. ఈ సభను నిర్వహించే బాధ్యత నుంచి మాత్రమే మీరు తప్పుకుంటున్నారు. కానీ మీ అనుభవం మా లాంటి నేతలకు తప్పకుండా ఉపయోగపడుతుంది. మీరు వివిధ హోదాల్లో పనిచేస్తున్నప్పుడు మిమ్మల్ని చాలా దగ్గర నుంచి చూసే అవకాశం దక్కడం నా అదృష్టం. మీతో కలిసి పనిచేసే అవకాశం కూడా నాకు దక్కింది. "
-ప్రధాని నరేంద్ర మోదీ
మీ పంచ్‌లకు
భాషపై వెంకయ్యనాయుడికి ఉన్న పట్టు, ఆయన ప్రాసలు, పంచ్‌లు, కౌంటర్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు మోదీ.
" మీ ఛలోక్తులకు ఎదురు లేదు. మీరు ఒకసారి కౌంటర్ వేస్తే ఇక దాని గురించి మాట్లాడటానికి కూడా ఏం ఉండదు. మీరు మాట్లాడే ప్రతి మాటా వినాలనిపిస్తుంది. వాటికి తిరిగి కౌంటర్ వేసే ధైర్యం కూడా ఎవరికీ ఉండదు. "
-ప్రధాని నరేంద్ర మోదీ
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
గాడ్జెట్స్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion