అన్వేషించండి

Vande Bharat Express: దక్షిణాదిన తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్, అక్కడి నుంచే సర్వీసులు

Vande Bharat Express: ఐదో వందే భారత్ ట్రైన్‌ను తొలిసారి సౌత్‌లోనూ ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ.

Vande Bharat Express in South:

చెన్నై-బెంగళూరు-మైసూర్‌ మార్గంలో..

నాలుగో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ని ఇటీవలే హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రారంభించారు ప్రధాని మోదీ. అహ్మదాబాద్-ముంబయి మధ్య సర్వీస్‌లు మొదలు పెట్టిన వెంటనే హిమాచల్‌లోనూ స్టార్ట్ చేశారు. ఇప్పుడు దక్షిణాదిన వందేభారత్‌ ట్రైన్‌ను ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. చెన్నై-బెంగళూరు-మైసూర్ మార్గంలో ఈ ట్రైన్‌ను నడపనున్నారు. నవంబర్ 10వ తేదీన ఈ ఎక్స్‌ప్రెస్‌ను అధికారికంగా
ప్రారంభించనున్నారు. మొత్తం 483 కిలోమీటర్లను కవర్ చేయనుంది...ఈ ఎక్స్‌ప్రెస్. ఎన్నికలున్న రాష్ట్రాల్లోనే వరుసగా ఈ వందేభారత్ ట్రైన్స్‌ని ప్రారంభిస్తోంది కేంద్రం. ఇటీవలే గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌లో ఈ పని పూర్తికాగా...వచ్చే ఏడాది కర్ణాటకలో ఎన్నికలున్న తరుణంలో ఇప్పుడు బెంగళూరులోనూ ఈ సర్వీస్‌లు మొదలు పెట్టనున్నారు. 

పీఎం గతి శక్తి..

2019ఫిబ్రవరి 15న మొదటి వందేభారత్ ట్రైన్‌ను ప్రారంభించారు ప్రధాని మోదీ. ఈ రైళ్లలో self-propelled engine ఉంటుంది. డీజిల్‌ను ఆదా చేయడంతో పాటు...30% విద్యుత్‌తోనే నడుస్తాయి.  వందేభారత్ ట్రైన్స్‌ను సెమీ హై స్పీడ్ రైళ్లుగా చెబుతోంది ఇండియన్ రైల్వేస్. వీటిని పూర్తిగా దేశీయంగా తయారు చేశారు. ఆటోమెటిక్ డోర్స్, AC చెయిర్ కార్, రివాల్వింగ్ చైర్‌లు అందుబాటులో ఉంటాయి. వచ్చే మూడేళ్లలో 400 వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో వెల్లడించారు. పీఎం గతిశక్తి లో భాగంగా ఈ రైళ్లను ప్రవేశపెడుతున్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారతీయ రైల్వే వందే భారత్ రైళ్లను నడుపుతోంది. 

హిమాచల్‌లో నాలుగో ట్రైన్ 

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఉనాలో  వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించారు. ఈ కార్యక్రమం కోసం అక్కడకు వచ్చిన కార్యకర్తలు.. మోదీకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అభిమానులు 'మోదీ.. మోదీ, జై శ్రీరాం' వంటి నినాదాలతో రైల్వే స్టేషన్‌ పరిసరాలను హోరెత్తించారు. రైలు ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని రైల్వే ప్లాట్‌ఫాం నుంచి అలా నడుచుకొని వెళ్తూ జనానికి అభివాదం చేశారు. ఈ సందర్భంగా కొంతమంది "దేఖో దేఖో కౌన్‌ ఆయా.. షేర్‌ ఆయా.. షేర్‌ ఆయా" (చూడు చూడు ఎవరు వచ్చారో.. పులి వచ్చింది.. పులి) అంటూ నినాదాలు చేశారు. త్వరలో హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న తరుణంలో.. నాలుగో వందే భారత్ ట్రైన్‌ను ఇక్కడి నుంచే ప్రారంభించారు మోదీ. ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్, రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. జెండా ఊపి ఈ ట్రైన్‌ను ప్రారంభించిన తరవాత...ప్రధాని ఓ సభలో పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు తీర్చని సమస్యల్ని భాజపా తీర్చుతోందని, ప్రజల అవసరాలను అర్థం చేసుకుంటోందని వెల్లడించారు.

Also Read: Lokesh Unstoppable : అమ్మాయిలతో ఫోటోలు, ఎన్నికల్లో ఓటమిపై మామకు లోకేష్ ఇచ్చిన ఆన్సర్ ఏమిటో తెలుసా ?

 

టాప్ హెడ్ లైన్స్

Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Revanth Reddy Challenges KCR: సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget