US Supreme Court: ఇక అబార్షన్ పిల్స్ ఎక్కడైనా కొనుక్కోవచ్చు, తేల్చి చెప్పిన అమెరికా సుప్రీంకోర్టు
US Supreme Court: అబార్షన్ పిల్స్‌ను ఎక్కడైనా అందుబాటులో ఉంచేందుకు అమెరికా సుప్రీం కోర్టు అంగీకారం తెలిపింది.
US Supreme Court:
సుప్రీంకోర్టులో విచారణ
అమెరికా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అబార్షన్ పిల్‌పై దిగువ కోర్టులు విధించిన అన్ని ఆంక్షల్ని ఎత్తివేసింది. రీప్రొడక్టివ్ రైట్స్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ఈ పిల్స్ అందుబాటులో ఉండాలన్న వాదనలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. కానీ..దిగువ కోర్టులు
దీనిపై ఆంక్షలు విధించాయి. కేవలం కొన్ని చోట్ల మాత్రమే వీటిని విక్రయించాలని తేల్చి చెప్పాయి. ఈ నిర్ణయాన్ని అధ్యక్షుడు జో బైడెన్ స్వాగతించారు. అబార్షన్ పిల్స్ తయారు చేసే Danco Laboratories కంపెనీతో పాటు మరి కొందరు దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని కోర్టుని కోరారు. అయితే...అంతకు ముందు యాంటీ అబార్షన్ గ్రూప్‌లు పెద్ద ఎత్తున తమ వాదనలు వినిపించాయి. అబార్షన్ పిల్స్‌ను విచ్చలవిడిగా విక్రయించడం సరికాదని తేల్చి చెప్పాయి. కోర్టుల్లో పిటిషన్‌లు కూడా వేశారు. ఈ వాదనలు విన్న లోయర్ కోర్ట్‌లు ఈ పిటిషన్‌పై పూర్తి స్థాయి విచారణ జరిపి ఆ పిల్స్ విక్రయాలపై ఆంక్షలు విధించాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు మాత్రం ఆ కోర్టులు ఇచ్చిన తీర్పులపై స్టే విధించింది. దీనిపై వైట్‌హౌజ్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయాన్ని స్వాగతించింది.
"సుప్రీంకోర్టు స్టే విధించడం వల్ల Mifepristone (అబార్షన్ పిల్) అందరికీ అందుబాటులోకి వచ్చేందుకు వీలు కలిగింది. దాని భద్రతకు కూడా ఆమోద ముద్ర లభించినట్టైంది. ఎన్నో రోజులుగా కొనసాగుతున్న న్యాయ పోరాటం ఇన్నాళ్లకు ఫలితం దొరికింది"
- వైట్ హౌజ్
జో బైడెన్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల హక్కుల కన్నా ఈ చట్టాలేమీ ఎక్కువ కాదని తేల్చి చెప్పారు. వాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనని సమర్థించారు.
"అమెరికాలోని మహిళల హక్కుల కన్నా ఈ నిబంధనలు, చట్టాలు ఏమీ ఎక్కువ కావు. మహిళల ఆరోగ్యాన్ని రాజకీయం చేస్తున్న వారిపై మా పోరాటం కచ్చితంగా కొనసాగుతుంది"
- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
బైడెన్ ఆమోదం..
గత నెల అబార్షన్ పిల్స్ వినియోగంపై టెక్సాస్‌లోని కోర్టు ఈ తీర్పుని రిజర్వ్‌లో ఉంచింది. వారం రోజుల పాటు దీనిపై ఎలాంటి విచారణ జరపకపోవడం వల్ల ఈ అంశం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. ఈ ఏడాది జనవరిలోనే బైడెన్ ప్రభుత్వం అబార్షన్ పిల్స్ విక్రయించేందుకు అనుమతినిచ్చింది. గతేడాది అమెరికా సుప్రీం కోర్టు అబార్షన్ రాజ్యాంగ హక్కు కాదని సంచలన తీర్పునిచ్చింది. అప్పటి నుంచి ఆ దేశంలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. Food and Drug Administration (FDA) ప్రస్తుతానికి రూల్స్‌లో మార్పులు చేర్పులు చేసి రిటైల్ ఫార్మసీలు అబార్షన్ పిల్స్ విక్రయించేలా పర్మిషన్ ఇచ్చింది. Mifepristone పిల్ అమ్మేందుకు అనుమతినిచ్చింది. ఈ ట్యాబ్లెట్...గర్భం దాల్చకుండా అడ్డుకుంటుంది. అయితే..గర్భం దాల్చిన 10 వారంలో ఈ పిల్ వాడాలని సూచించింది. అయితే..మెడికల్ కన్సల్టేషన్ లేకుండా మాత్రం ఈ పిల్స్ విక్రయించరు. కచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాల్సిందే. గతంలో కేవలం కొన్ని స్పెషల్ డ్రగ్ స్టోర్స్‌లో మాత్రమే ఈ పిల్స్ అందుబాటులో ఉండేవి. ఇప్పుడు అన్ని రిటైల్ స్టోర్స్‌లోనూ ఉంటాయి.