నితీశ్ వ్యాఖ్యలపై అమెరికన్ సింగర్ ఆగ్రహం,అందుకే మోదీ బెస్ట్ లీడర్ అంటూ ప్రశంసలు
Mary Millben: జనాభా నియంత్రణపై నితీశ్ చేసిన వ్యాఖ్యల్ని అమెరికన్ సింగర్ మేరీ మిల్బెన్ ఖండించారు.
Mary Millben Slams Nitish:
నితీశ్ వివాదాస్పద వ్యాఖ్యలు..
జనాభా నియంత్రణపై అసెంబ్లీలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఆయన క్షమాపణలు చెప్పినా...జరగాల్సిన డ్యామేజ్ అప్పటికే జరిగిపోయింది. ప్రతిపక్షంలోని మహిళా నేతలు తీవ్రంగా మండి పడుతున్నారు. ముఖ్యంగా బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ వివాదం ఇక్కడికే పరిమితం కాలేదు. అమెరికా వరకూ వెళ్లింది. ఆఫ్రికన్-అమెరికన్ సింగర్ మేరీ మిల్‌బెన్ (Mary Millben) ఈ వివాదంపై స్పందించారు. మహిళల గౌరవాన్ని ప్రశ్నించే విధంగా మాట్లాడడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యల్ని విన్నప్పుడే మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడాలని సూచించారు. ప్రత్యేకంగా ఓ వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
"మహిళల గౌరవాన్ని సవాలు చేసే దారుణమైన ఘటన బిహార్‌లో జరగడం విచారకరం. నాకు తెలిసినంత వరకూ ఈ సవాలుకి ఒకే సమాధానం ఉంది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు విన్న మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి నిరసన వ్యక్తం చేయాలి. తమ గొంతుని బలంగా వినిపించాలి. నేను ఇండియాలో పుట్టి ఉంటే బిహార్ ముఖ్యమంత్రి పదవికి పోటీ చేసే దాన్ని. నితీశ్ కుమార్ రాజీనామా చేయాల్సిన సమయం వచ్చింది. బిహార్ మహిళలు సాధికారత సాధించేలా బీజేపీ చర్యలు చేపడుతుందని బలంగా నమ్ముతున్నాను. అలాంటి వ్యాఖ్యలకు ఇదే సరైన సమాధానం. బిహార్ ప్రజలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలి. ఎన్నింటినో మార్చగలిగే శక్తి ఓటుకి ఉంది"
- మేరీ మిల్బెన్, అమెరికన్ సింగర్
Washington, DC | On Bihar CM Nitish Kumar's statement, African-American actress and singer Mary Millben says, "Today, India faces a defining moment, right here in Bihar, where the value of women is being challenged. And I believe there is only one answer to this challenge. After… pic.twitter.com/FjhtavawG1
— ANI (@ANI) November 8, 2023
మోదీపై ప్రశంసలు
నితీశ్‌పై అసహనం వ్యక్తం చేసిన మేరీ..ప్రధాని నరేంద్ర మోదీని ఆకాశానికెత్తేశారు. భారత్‌తో పాటు అమెరికాలోనూ వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయన్న ఆమె ఆచితూచి ఓటు వేయాలని సూచించారు. మార్పు కోరుకునే వాళ్లకు ఇదే మంచి అవకాశమని స్పష్టం చేశారు. భారత్ అంటే తనకు ఎంతో అభిమానమని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీకి తన మద్దతు ఎప్పటికీ ఉంటుందని అన్నారు.
"చాలా మంది నన్ను అడుగుతుంటారు ఇండియాపై ఎందుకంత శ్రద్ధ అని. ఎందుకంటే ఇండియా అంటే నాకు చాలా ఇష్టం. అమితంగా అభిమానిస్తాను. ప్రధాని నరేంద్ర మోదీపైనా నాకు గౌరవం ఉంది. భారత్‌కి ఆయనే బెస్ట్ లీడర్ అని కచ్చితంగా చెప్పగలను. అమెరికా,భారత్ మైత్రిని ముందుకు తీసుకెళ్లడంలోనూ ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రధాని మోదీ మహిళలకు అండగా నిలబడతారు"
- మేరీ మిల్బెన్, అమెరికన్ సింగర్
Also Read: వచ్చే ఏడాది ఏప్రిల్ వరకూ ఎల్ నినో ఎఫెక్ట్, హెచ్చరించిన ఐక్యరాజ్యసమితి