US Jets: అమెరికా గగనతలంలో మరో అనుమానాస్పద వస్తువు, పేల్చేసిన సైనికులు
US Jets: అమెరికాలోని అలాస్కాలో ఓ అనుమానాస్పద వస్తువుని సైనికులు పేల్చేశారు.
US Jets Shot Down:
అలాస్కాలో చక్కర్లు..
చైనా స్పై బెలూన్ వివాదం ఇంకా ముగిసిపోలేదు. ఇటీవలే ఓ బెలూన్ను పేల్చేసిన అమెరికా...ఇప్పుడు మరోసారి అదే పని చేసింది. ఓ అనుమానాస్పద వస్తువుని గుర్తించిన అమెరికా సైనికులు ఫైటర్ జెట్‌తో దాన్ని కాల్చి పారేశారు. అలాస్కాలో 40 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న ఆ వస్తువుని పేల్చేసినట్టు చెప్పారు. "ఎగురుతున్న వస్తువు ఏంటన్నది క్లారిటీ లేదు. కానీ అది ప్రజలకు హాని కలిగిస్తుందేమోనన్న అనుమానంతో ముందుగానే పేల్చేశాం" అని అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి వెల్లడించారు. అధ్యక్షుడు బైడెన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అంతకు ముందు పేల్చేసిన స్పై బెలూన్ కన్నా తక్కువ సైజ్‌లో ఉన్నట్టు వివరించారు. ఓ చిన్న కారు సైజ్‌లో ఉన్నట్టు తెలిపారు. అది ఎక్కడి నుంచి వచ్చింది..? ఏ దేశానికి చెందింది..? అన్నది తమకు స్పష్టత లేదని పేర్కొన్నారు. ఈ వస్తువు గగనతలంలో ఎందుకు చక్కర్లు కొట్టిందన్నదీ ప్రస్తుతానికి తేలలేదని చెప్పారు.
Second 'high altitude object' shot down over Alaska: White House
— ANI Digital (@ani_digital) February 10, 2023
Read @ANI Story | https://t.co/DGvawJEXxw#ChineseSpyBallon #Alaska #China #US pic.twitter.com/bnSYYCqr0Q
అమెరికా ఎయిర్‌బేస్‌లో చైనా స్పై బెలూన్ చక్కర్లు కొట్టడం సంచలనమైంది. దాదాపు రెండు రోజుల పాటు దానిపై నిఘా పెట్టిన అగ్రరాజ్యం.. చివరకు ఫైటర్ జెట్‌తో పేల్చి వేసింది. అయితే...ఈ స్పై బెలూన్ వివాదం ఇక్కడితో ముగిసేలా లేదు. అమెరికానే కాకుండా మరి కొన్ని దేశాలనూ చైనా టార్గెట్ చేసినట్టు ఓ రిపోర్ట్ వెల్లడించింది. ఈ లిస్ట్‌లో భారత్‌తో పాటు జపాన్ కూడా ఉంది. ఇప్పటికే ఈ బెలూన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అమెరికా భారత్‌కు తెలిపింది. వాషింగ్టన్లో జరిగిన ఓ కార్యక్రమంలో అమెరికా డిప్యుటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వెండీ శెర్మన్ ఈ విషయమై మాట్లాడారు.
"చైనా స్పై బెలూన్ చాలా రోజులుగా యాక్టివ్‌గా ఉంటోంది. మిలిటరీ పరంగా బలంగా ఉన్న దేశాల సమాచారాన్ని సేకరిస్తోంది. జపాన్, భారత్, వియత్నాం, తైవాన్, ఫిలిప్పైన్స్‌పై నిఘా పెట్టింది"
-వాషింగ్టన్ పోస్ట్
స్వయంగా కొందరు మిలిటరీ అధికారులే ఈ విషయాలు వెల్లడించారు. దాదాపు 5 ఖండాల్లోని గగనతలంలో ఈ స్పై బెలూన్లు చక్కర్లు కొట్టినట్టు వివరించారు. కీలక ఆపరేషన్లపైనా నిఘా పెడుతోందని దేశాల సమైక్యతను ఇది దెబ్బ తీస్తోందని చెప్పారు. ఈ మధ్య కాలంలో హవాయి, ఫ్లోరిడా, టెక్సాస్, గువాం ప్రాంతాల్లోని ఎయిర్‌బేస్‌లలో ఇలాంటి స్పై బెలూన్లు కనిపించాయని తెలిపారు. ట్రంప్ హయాంలోనే మూడు సార్లు ఇలాంటి బెలూన్లు కనిపించాయి. కొద్ది రోజులుగా అమెరికా ఎయిర్ బేస్‌లో చక్కర్లు కొడుతున్న చైనా స్పై బెలూన్ను షూట్ చేసేసింది అగ్రరాజ్యం. దాదాపు మూడు బస్సుల సైజ్ ఉన్న ఈ భారీ బెలూన్ను Fighter Jet F-22 షూట్ చేసింది. సింగిల్ మిజైల్‌తో ఆ బెలూన్ పేలిపోయింది.
Also Read: Price Hike: మీరు గమనించారా?, రోజువారీ సరుకుల రేట్లు పెరిగాయి & సైజులు తగ్గాయని!