అద్భుతం చేసిన అమెరికన్ వైద్యులు, గర్భంలో ఉన్న శిశువుకి బ్రెయిన్ సర్జరీ - ప్రపంచంలోనే తొలిసారి
US Doctors Surgery: అమెరికన్ వైద్యులు ఓ మహిళ గర్భంలోని శిశువుకి బ్రెయిన్ సర్జరీ చేసి రికార్డు సృష్టించారు.
US Doctors Surgery:
అరుదైన సర్జరీ
అమెరికన్ వైద్యులు ఓ అరుదైన సర్జరీ చేశారు. మెడికల్ హిస్టరీలోనే ఇలాంటి శస్త్రచికిత్స ఇంకెక్కడా జరిగి ఉండదు. ఓ మహిళ గర్భంలోని శిశువు మెదడులో సమస్య వచ్చింది. అబ్‌నార్మల్‌గా ఉందని గుర్తించిన వైద్యులు వెంటనే సర్జరీ చేయాలని చెప్పారు. కానీ చాలా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం కనుక కాస్త వెనకడుగు వేశారు. ఆ తరవాత ధైర్యం చేసి సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో జరిగిందీ ఘటన. మెదడు నుంచి గుండెకు రక్త ప్రసరణ సరిగ్గా జరగడం లేదని గుర్తించి సర్జరీ చేశారు. ఈ సమస్య అలాగే ఉండి ఉంటే...నరాలపై ఒత్తిడి పెరిగి అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముందని వైద్యులు చెప్పారు. చిన్నారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో వెంటనే చికిత్స అందించినట్టు వెల్లడించారు. పుట్టిన వెంటనే గుండె ఆగిపోవడమో, లేదంటే బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడమో లాంటివి ఎదుర్కోవాల్సి వచ్చేదని చెప్పారు.
"ఈ సర్జరీ చేయడం మాకు ఓ సవాల్‌గా అనిపించింది. పుట్టిన తరవాత ఆ చిన్నారికి చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముంది. అందుకే ముందస్తు జాగ్రత్తగా సర్జరీ చేశాం. కాకపోతే చాలా సమయం పట్టింది. అడ్వాన్స్‌డ్ పరికరాలు అందుబాటులో ఉండటం వల్ల మా పని కాస్త సులువైంది. ఇలాంటి సమస్యతో బాధ పడే చిన్నారుల్లో 50-60% మంది మాత్రమే సేఫ్‌గా ఉంటారు. మిగతా 40% మంది పురిట్లోనే చనిపోతారు. అందుకే జాగ్రత్త పడి చికిత్స చేశాం. అల్ట్రాసౌండ్ తీసినప్పుడు మాకు ఈ సమస్య ఉందని తెలిసింది. అప్పటికే ప్రెగ్నెన్సీ వచ్చి 34 వారాలు దాటింది. ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో సర్జరీ సక్సెస్‌ఫుల్‌గా చేశాం"
- వైద్యులు
ఇరాక్‌లో మరో అరుదైన సర్జరీ..
ఇరాక్‌కు చెందిన ఇద్దరు అవిభక్త కవలలకు అరుదైన సర్జరీ చేసి వేరు చేశారు వైద్యులు. దాదాపు 11 గంటల పాటు 27 మంది వైద్యులు శ్రమించి ఈ సర్జరీని విజయవంతం చేశారు. సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఈ అరుదైన శస్త్రచికిత్స జరిగింది. స్పెషలిస్ట్‌లు, నర్సులు, టెక్నికల్ స్టాఫ్..ఇలా అంత మంది కష్టపడితే కానీ ఆ సర్జరీ పూర్తి కాలేదు. ఈ ఇద్దరు చిన్నారుల కాలేయం, పొత్తి కడుపు అతుక్కునిపోయాయి. చాలా సున్నితమైన సర్జరీని...కింగ్ సాల్మన్ ఆదేశాలతో పూర్తి చేశారు వైద్యులు. Saudi Conjoined Twins Programలో భాగంగా సౌదీ అరేబియాలో ఇలాంటి సర్జరీలు చేస్తుంటారు. ఇప్పటికే 23 దేశాలకు చెందిన 127 మంది అవిభక్త కవలల్ని విడదీశారు. 32 ఏళ్లుగా ఈ సేవలందిస్తున్నారు. ప్రస్తుతానికి ఇద్దరు చిన్నారులూ ఆరోగ్యంగా ఉన్నారు. కింగ్ అబ్దుల్లా స్పెషలైజ్డ్ ఆసుపత్రిలో దాదాపు ఆరు దశలుగా ఈ సర్జరీ చేశారు. అయితే ఈ సర్జరీని నేతృత్వం వహించిన వైద్యుడు కీలక విషయం వెల్లడించారు. ఆపరేషన్ 70% మాత్రమే సక్సెస్ అయిందని చెప్పారు. చాలా వరకు అవయవాలు అతుక్కుపోయాయని అన్నారు. ఈ సర్జరీని పూర్తి చేసిన వైద్యులకు థాంక్స్ చెప్పారు. హెల్త్ సెక్టార్‌లో అభివృద్ధి సాధిస్తున్నామనడానికి ఇదే నిదర్శనమని తెలిపారు. గతేడాది సెప్టెంబర్‌లో ఈ కవలలను సౌదీకి తీసుకొచ్చారు.
Also Read: Turkey Summit: రష్యా ప్రతినిధిపై ఉక్రెయిన్ ఎంపీ దాడి, జెండా లాక్కున్నాడని పిడిగుద్దులు