Turkey Summit: రష్యా ప్రతినిధిపై ఉక్రెయిన్ ఎంపీ దాడి, జెండా లాక్కున్నాడని పిడిగుద్దులు
Turkey Summit: టర్కీలో జరిగిన ఓ సదస్సులో రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధులు ఘర్షణ పడ్డారు.
Ukraine MP Attacks Russian:
అంతర్జాతీయ సదస్సులో కొట్లాట
రష్యా-ఉక్రెయిన్ మధ్య ఇంకా వైరం చల్లారలేదని మరోసారి రుజువైంది. ఇటీవలే పుతిన్ బిల్డింగ్ డ్రోన్‌లు తిరగడం రెండు దేశాల మధ్య శత్రుత్వాన్ని మరింత పెంచింది. ఇప్పుడు ఓ రష్యన్ ప్రతినిధిపై ఉక్రెయిన్ ఎంపీ చేయి చేసుకోవడం సంచలనమవుతోంది. ఓ అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌కు హాజరైన ఈ ఇద్దరు నేతలు గల్లా పట్టుకుని కొట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టర్కీ రాజధాని అంకారాలోని ఓ సదస్సుకి ఈ ఇరు దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. దాదాపు 14 నెలలుగా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో వీళ్లు ఒకే వేదికపైకి రావడం ఆసక్తిని పెంచింది. అయితే...ఉక్రెయిన్ ఎంపీ ఒకరు నేషనల్ ఫ్లాగ్‌ని పట్టుకుని నిలబడి ఉన్న సమయంలో రష్యన్ ప్రతినిధి వచ్చి ఆ జెండాను లాగేసుకున్నారు. అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు. ఇది చూసిన ఉక్రెయిన్ ఎంపీ కోపంతో ఊగిపోయాడు. ఆ వ్యక్తిని తరుముకుంటూ వెళ్లాడు. జెండా మళ్లీ తిరిగి లాక్కునేందుకు ప్రయత్నించాడు. కానీ రష్యన్ ప్రతినిధి ఆ జెండాను గట్టిగా పట్టుకున్నాడు. సహనం నశించిన ఉక్రెయిన్ ఎంపీ పిడి గుద్దులతో విరుచుకు పడ్డాడు. జెండా తిరిగి తన చేతుల్లోకి లాక్కున్నాడు. ఈ గొడవతో ఒక్కసారిగా అక్కడి వాళ్లంతా ఉలిక్కి పడ్డారు. ఘర్షణ పెరిగే ప్రమాదముందని గుర్తించి ఇద్దరికీ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కాసేపటికి ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. ఇంటర్నేషనల్ మీటింగ్‌లో ఇలా కొట్టుకోవడం ఏంటని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
🥊 In Ankara 🇹🇷, during the events of the Parliamentary Assembly of the Black Sea Economic Community, the representative of Russia 🇷🇺 tore the flag of Ukraine 🇺🇦 from the hands of a 🇺🇦 Member of Parliament.
— Jason Jay Smart (@officejjsmart) May 4, 2023
The 🇺🇦 MP then punched the Russian in the face. pic.twitter.com/zUM8oK4IyN
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. పుతిన్ చేస్తున్న నేరాలకు తప్పకుండా శిక్ష అనుభవిస్తాడని తేల్చి చెప్పారు. త్వరలోనే ఇది జరిగి తీరుతుందని జోష్యం చెప్పారు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఉన్న హేగ్ నగరంలోనే ఈ కామెంట్స్ చేశారు జెలెన్స్కీ.
"పుతిన్ తన బలాన్ని చూసుకుని మిడిసిపడుతున్నారు. ఉక్రెయిన్‌పై దాడి చేసి తీవ్రమైన నేరం చేశారు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఉన్న ఈ హేగ్ సిటీలో పుతిన్‌ను చూడాలని ఉంది. ఆ కోర్టు విధించిన శిక్ష అనుభవిస్తూ పుతిన్ ఇక్కడే ఉండాలని మేం బలంగా కోరుకుంటున్నాం. అలాంటి శిక్షకు ఆయన అర్హుడే. కచ్చితంగా ఇది జరుగుతుందని ఆశిస్తున్నాం. మేం విజయం సాధించిన వెంటనే పుతిన్‌కు శిక్ష పడుతుందని గట్టిగా నమ్ముతున్నాం. యుద్ధానికి కారణమైన వాళ్లు ఇలాంటి పర్యవసానాలు ఎదుర్కోక తప్పదు"
- జెలెన్స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు