(Source: ECI/ABP News/ABP Majha)
Viral News: క్లాస్‌లో పాఠాలు చెప్పకుండా క్యాండీ క్రష్ ఆడుతూ కూర్చున్న టీచర్, సస్పెండ్ చేసిన అధికారులు
Candy Crush: యూపీలోని ఓ స్కూల్ టీచర్ పిల్లలకు పాఠాలు చెప్పకుండా ఫోన్‌లో మునిగిపోయాడు. గంటల కొద్దీ క్యాండీ క్రష్ ఆడి సస్పెన్షన్‌కి గురయ్యాడు.
Teacher Played Candy Crush in Class: క్లాస్‌లో పాఠాలు చెప్పాల్సిన టీచర్ ఫోన్‌లో మునిగిపోయాడు. పిల్లల్ని పట్టించుకోకుండా మొబైల్ పట్టుకుని కూర్చున్నాడు. చివరకు సస్పెండ్ అయ్యాడు. యూపీలో జరిగిందీ ఘటన. ఓ గవర్నమెంట్ స్కూల్‌లో టీచర్ పాఠాలు చెప్పకుండా మొబైల్‌లో క్యాండీ క్రష్ ఆడుకుంటూ కూర్చున్నాడు. గంటల కొద్దీ అంతే కాలక్షేపం చేశాడు. సరిగ్గా అదే సమయంలో జిల్లా మెజిస్ట్రేట్ స్కూల్‌లో ఇన్‌స్పెక్షన్‌కి వెళ్లారు. విద్యార్థుల నోట్స్ చెక్ చేశారు. ఎక్కడ చూసినా తప్పుల తడకలే కనిపించాయి. దీనిపై ఆయన సీరియస్ అయ్యారు. ఆ తరవాత అనుమానం వచ్చి టీచర్ మొబైల్ చెక్ చేశారు. అందులో ఓ ఫీచర్ ఉంది. ఏ యాప్ ఎంత సేపు వాడామని అందులో చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఈ లెక్కలన్నీ తీస్తే క్యాండీ క్రష్‌ని గంటల కొద్దీ ఆడినట్టు తేలింది. పని వేళల్లోనే ఎక్కువ సేపు ఆడుతున్నట్టు గమనించారు అధికారులు. ఒక్కోసారి స్కూల్‌లోనే కూర్చుని రెండు గంటల పాటు గేమ్ ఆడుతున్నట్టు గుర్తించారు. ఆ టీచర్‌ని తీవ్రంగా మందలించారు. ఆ తరవాత సస్పెండ్ చేశారు. టీచర్‌లు విద్యార్థులకు పాఠాలు చెప్పడంపైనే దృష్టి పెట్టాలని, వాళ్ల బుక్స్ రెగ్యులర్‌గా చెక్ చేయాలని ఆదేశించారు.
"విద్యార్థుల క్లాస్‌వర్క్, హోమ్ వర్క్ నోట్స్‌లను తరచూ చెక్ చేయాలి. వాళ్లకు సరైన విధంగా అర్థమవుతోందా అన్నది గమనించాలి. మొబైల్ వాడడం తప్పు కాదు. కానీ స్కూల్ అవర్స్‌లో ఇలా విద్యార్థులను గాలికి వదిలేసి గంటల కొద్ది పర్సనల్ పనుల కోసం మొబైల్ వాడడం మాత్రం కచ్చితంగా తప్పే"
- అధికారులు
కొందరి విద్యార్థుల బుక్స్‌లో చాలా తప్పులు కనిపించడం అధికారులను అసహనానికి గురి చేసింది. టీచర్ మొబైల్‌లో Digital Well-being ఫీచర్ ఉండడం వల్ల అధికారులు అంతా ట్రాక్ చేశారు. ఐదున్నర గంటల పని వేళల్లో దాదాపు రెండు గంటల పాటు గేమ్స్ ఆడుతున్నట్టు గుర్తించారు. రోజూ అరగంట ఫోన్ కాల్స్ మాట్లాడడంతోనే టైమ్‌పాస్ చేస్తున్నాడు. ఇలాంటి తప్పుల్ని అసలు క్షమించమని జిల్లా మెజిస్ట్రేట్ హెచ్చరించారు. స్కూల్స్‌లో టీచర్లు ఫోన్‌లు వాడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్‌లో ఈ సమస్య ఎక్కువగా ఉందన్న వాదన ఉంది. కొన్ని చోట్ల స్ట్రిక్ట్‌గా రూల్స్ పెడుతున్నా మరి కొన్ని చోట్ల మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. అటు విద్యార్థులు కూడా స్కూల్స్‌కి మొబైల్స్ పట్టుకొస్తున్న ఘటనలూ వెలుగులోకి వచ్చాయి. అందుకే మొబైల్ వినియోగంపై అంతా అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా వాడితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆ మధ్య కర్ణాటకలో ఓ స్కూల్‌లో పిల్లలు మొబైల్స్ పట్టుకొచ్చి నానా రచ్చ చేశారు. స్కూల్ యాజమాన్యం అందరినీ చెక్ చేసి వాటిని సీజ్ చేసింది. ఆ తరవాత తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపింది. అప్పట్లో ఈ ఘటన మిగతా స్కూల్స్‌పైనా ఫోకస్ పెట్టేలా చేసింది.
Also Read: Japan Laugh Rule: రోజుకోసారైనా చచ్చినట్టు నవ్వాల్సిందే, ఆ దేశంలో వింత చట్టం - కారణమదే