News
News
X

UP news: రాత్రంతా నగ్నంగా రోడ్లపై తిరిగిన మహిళ, ఇంటింటికీ వెళ్లి కాలింగ్ బెల్ కూడా కొట్టింది

UP news: యూపీలో ఓ మహిళ అర్ధరాత్రి నగ్నంగా రోడ్లపై తిరగడం సంచలనమైంది.

FOLLOW US: 
Share:

UP news:

ఇదీ జరిగింది..

యూపీలోని రాంపూర్‌లో ఓ మహిళ రాత్రంతా నగ్నంగా రోడ్లపై తిరగడం సంచలనం సృష్టించింది. ఈ తిరిగే క్రమంలో కనబడిన తలుపునల్లా కొడుతూ పోయింది. కాలింగ్ బెల్‌ కొడుతూ అర్ధరాత్రి పూట అందరినీ డిస్టర్బ్ చేసింది. ఇది గమనించిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆ మహిళను గుర్తించారు. సోషల్ మీడియాలోనూ ఈ ఘటన వైరల్ అవుతోంది. రాంపూర్‌కు చెందిన ఓ మహిళ రోడ్లపై రాత్రి పూట నగ్నంగా తిరుగుతున్నట్టు తెలిపారు. ఆ మహిళను గుర్తించిన పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆమెకు మతిస్థిమితం లేదని విచారణలో తేలింది. దాదాపు 5 ఏళ్లుగా ఆమెకు బరేలిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు కుటుంబ సభ్యులు వివరించారు. ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని, రాత్రి పూట ఇంట్లోనే ఉండేలా చూడాలని కుటుంబ సభ్యులను మందలించారు పోలీసులు. రాంపూర్‌లోని మాలిక్ గ్రామంలో ఆమె రోడ్లపై తిరుగుతున్నట్టు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. అంతకు ముందు ట్విటర్‌లో పోస్ట్ చేశారు పోలీసులు. ఆ మహిళను ఎవరు గుర్తించినా వెంటనే సమాచారం అందించాలని కోరారు. చివరకు ఆమెను గుర్తించారు. పోలీస్ పాట్రోలింగ్ సరిగా లేకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి పూట ఆ మహిళ చాలా మందిని డిస్టర్బ్ చేసిందని అన్నారు. 

అలా తిరగడం లీగల్..

మొన్నీమధ్య బాలీవుడ్ స్టార్‌ రణ్‌వీర్‌ సింగ్‌ న్యూడ్‌గా ఫొటోలకు ఫోజులు ఇస్తే చాలా మంది ఆశ్చర్యపోయారు. సోషల్ మీడియాలో దీనిపై విపరీతంగా ట్రోల్స్ నడిచాయి. ఇప్పుడూ నడుస్తున్నాయి కూడా. కొన్ని దేశాల్లో ఇలా అర్థనగ్నంగా ఉండాల్సిన పని లేదు. అనుకుంటే రోడ్డుపై నగ్నంగా తిరిగేయవచ్చు. ప్రేమను వ్యక్తపరచడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఒక్కొక్క దేశంలో ఒక్కో రూల్ ఉంటుంది. కొన్ని దేశాల్లో బహిరంగంగా కిస్ చేయడం ఓకే కానీ అదే మరికొన్ని దేశాల్లో  అయితే షేక్‌ హ్యాండ్ ఇవ్వడం కూడా నేరమే. కానీ ఆ దేశాల్లో నగ్నంగా తిరిగేయడం, బహిరంగ ప్రదేశాల్లో శృంగారం చేసుకోవడానికి కూడా అనుమతి ఉందట. ఫ్రాన్స్‌లో కొన్ని ప్రదేశాల్లో పూర్తిగా నగ్నంగా తిరగ డానికి అనుమతి ఉంది. అలాంటి ప్రదేశాల్లో ఒకటి క్యాప్‌ డి అగ్డే అనే పట్టణం. సముద్ర తీరానికి అనుకొని ఉన్న ఈ నగరం ప్రపంచంలోనే అత్యత్తుమ నగ్న ప్రదేశాల్లో ఒకటి. ఇక్కడ మీరు సంవత్సరంలో కొన్ని సీజన్స్‌లో నగ్నంగా తిరిగేయవచ్చు. బహిరంగంగానే సెక్స్‌ కూడా చేసుకోవచ్చు. క్రొయేషియాలో ప్రకృతిని ఎక్కువ ఆరాదించే ఈ దేశంలో అందమైన క్యాంప్‌సైట్‌లు, హోటళ్లు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అలాంటి ఈ దేశంలో పబ్లిక్‌లో న్యూడ్‌గా తిరగొచ్చు. దీనిపై ఎలాంటి నిషేధం లేదు. నెదర్లాండ్స్ లో కూడా మీరు అతిగా ప్రవర్తించనంత వరకు నగ్నంగా తిరగవచ్చు. కొన్ని ప్రదేశాల్లో నగ్న వినోదాలకు అనుమతి ఇస్తారు. ఈ దేశం సమగ్ర లైంగిక విద్య, చట్టపరమైన వ్యభిచారం, నగ్న, టాప్‌లెస్ బీచ్‌లకు కూడా ప్రసిద్ధి చెందింది.

Also Read: CM Yogi Adityanath: ఇండియా ఇప్పటికీ సెక్యులర్ దేశమే, సనాతన ధర్మాన్ని గౌరవించండి - యోగి ఆదిత్యనాథ్

Published at : 04 Feb 2023 12:56 PM (IST) Tags: up UP News Woman Rampur Naked Woman Woman Roaming

సంబంధిత కథనాలు

Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, 10 గంటల పాటు ప్రశ్నల వర్షం

Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, 10 గంటల పాటు ప్రశ్నల వర్షం

Breaking News Live Telugu Updates: ముగిసిన ఈడీ విచారణ, 10 గంటలకు పైగా కవితను ప్రశ్నించిన అధికారులు

Breaking News Live Telugu Updates: ముగిసిన ఈడీ విచారణ, 10 గంటలకు పైగా కవితను ప్రశ్నించిన అధికారులు

జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

UPSC Recruitment: కేంద్ర కొలువులకు నోటిఫికేషన్ - పోస్టులు, అర్హతల వివరాలు ఇలా!

UPSC Recruitment: కేంద్ర కొలువులకు నోటిఫికేషన్ - పోస్టులు, అర్హతల వివరాలు ఇలా!

Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్

Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌