UP Election 2022: యూపీ ఎన్నికల్లో విక్రమార్కుడు.. 74 ఏళ్లలో 94వ సారి పోటీ.. సెంచరీ కొట్టే వరకు తగ్గేదేలే!

ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఓ పెద్దాయన ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఎందుకంటే రానున్న ఎన్నికల్లో ఆయన 94వ సారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

FOLLOW US: 

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు కాక రేపుతున్నాయి. ఓవైపు జంపింగ్ జపాంగ్‌లు పార్టీలు మారుతుంటే.. మరోవైపు కీలక నేతలు తాము పోటీ చేసే స్థానాలను ప్రకటిస్తున్నారు. ఇలాంటి ఎన్నికల వేడిలో ఓ పెద్దాయన 94వ సారి ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

అవును.. అక్షరాలా 93 సార్లు వివిధ ఎన్నికల్లో హసనురామ్ అంబేడ్కరీ పోటీ చేశారు. అయితే అన్ని సార్లు పరాజయమే వరించింది. అయినా సరే ఓటముల్లో సెంచరీ రికార్డ్ కొట్టేవరకు పోటీ చేస్తూనే ఉంటానంటున్నారు.

ఎవరీ ఈయన?

హసనురామ్ అంబేడ్కరీ.. ఓ సాధార‌ణ వ్యవసాయ కూలీ. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌య‌సు 74 సంవ‌త్స‌రాలు. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు జరిగిన వివిధ ఎన్నికల్లో 93 సార్లు పోటీ చేశారు.100 సార్లు ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన రికార్డు సృష్టించాల‌ని భావిస్తున్నారు. ఈ సారి ఎన్నిక‌ల్లో ఆగ్రాలోని ఖేరాఘర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. 

93 ఇలా..

  • హసనురామ్ అంబేడ్కరీ.. కాన్షీరామ్ స్థాపించిన ఆల్ ఇండియా బ్యాక్‌వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (BAMCEF)లో సభ్యుడు.
  • ఆయ‌న 1985 నుంచి లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ, పంచాయితీ ఎన్నికలతో పాటు వివిధ ఎన్నికల్లో, వివిధ స్థానాల నుంచి పోటీ చేశారు.
  • ఆయ‌న 1988లో భారత రాష్ట్రపతి పదవికి తన నామినేషన్ పత్రాలను కూడా స‌మ‌ర్పించారు. అయితే ఆ నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ‌కు గురైంది.
  • 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ స్థానాల నుంచి పోటీ చేశారు.
  • 2021లో జిల్లా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు. 

అదే ఉత్సాహం..

" నేను ఓడిపోతాన‌ని తెలిసినా పోటీ చేస్తున్నాను. గెలిచే రాజకీయ నాయకులు జనాలను మర్చిపోతారు. అలాంటి జనాలకు ఓ ఆప్షన్‌గా ఉండేందుకు నేను పోటీ చేస్తున్నాను. నా ప్ర‌త్య‌ర్థులు ఎవ‌ర‌నే విష‌యం నాకు అనవసరం. ఎన్నికల్లో 100 సార్లు ఓడిపోయి రికార్డు సృష్టించాలి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)ని బలోపేతం చేయడానికి ప‌ని చేశాను. కానీ 1985లో పార్టీ నుంచి టిక్కెట్ అడిగినప్పుడు.. నా భార్య కూడా నాకు ఓటు వేయదని నన్ను ఎగతాళి చేశారు. అప్ప‌టి నుంచి ప్రతి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను.                                                "
-హసనురామ్ అంబేడ్కరీ

Also Read: Pramod Gupta Joins BJP: యూపీలో భాజపా దెబ్బకు దెబ్బ.. నిన్న కోడలు, నేడు తోడల్లుడు.. ఎస్పీకి వరుస షాక్‌లు!

Also Read: UP Cong Candidate List: యూపీలో కాంగ్రెస్ 'మహిళా' అస్త్రం.. రెండో జాబితాలో 16 మందికి చోటు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 20 Jan 2022 06:55 PM (IST) Tags: UP Assembly Election 2022 UP Election 2022 Uttar Pradesh Man Set to Contest 94th Election 100 times

సంబంధిత కథనాలు

MS Dhoni IPL 2023: ఎంఎస్ ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, విజిల్ వేస్తున్న సీఎస్కే అభిమానులు

MS Dhoni IPL 2023: ఎంఎస్ ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, విజిల్ వేస్తున్న సీఎస్కే అభిమానులు

Sirpurkar Commission Report: దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకమా - కేసుపై సంచలన విషయాలు వెల్లడించిన సిర్పూర్కర్ రిపోర్ట్‌లో ఏముందంటే !

Sirpurkar Commission Report: దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకమా - కేసుపై సంచలన విషయాలు వెల్లడించిన సిర్పూర్కర్ రిపోర్ట్‌లో ఏముందంటే !

AP Courier Offices: బెజవాడ డ్రగ్స్ ఎఫెక్ట్ - ఏపీలో కొరియ‌ర్ ఆఫీస్‌లపై పోలీసుల నిఘా

AP Courier Offices: బెజవాడ డ్రగ్స్ ఎఫెక్ట్ - ఏపీలో కొరియ‌ర్ ఆఫీస్‌లపై పోలీసుల నిఘా

Breaking News Live Updates : ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ సీఎం కేసీఆర్

Breaking News Live Updates : ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ సీఎం కేసీఆర్

Gyanvapi Mosque Row: 'జ్ఞానవాపి'పై సుప్రీం విచారణ- మసీదుకు ఒక్కసారిగా 700 మంది ముస్లింలు!

Gyanvapi Mosque Row: 'జ్ఞానవాపి'పై సుప్రీం విచారణ- మసీదుకు ఒక్కసారిగా 700 మంది ముస్లింలు!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Mathura Krishna Janmabhoomi: శ్రీకృష్ణ జన్మభూమి వివాదమేంటి? హిందూ- ముస్లింల ఒప్పందంలో ఏముంది?

Mathura Krishna Janmabhoomi: శ్రీకృష్ణ జన్మభూమి వివాదమేంటి? హిందూ- ముస్లింల ఒప్పందంలో ఏముంది?

Poorna Photos: కుందనపు బొమ్మా నిను చూస్తే మనసుకి వెలుగమ్మా

Poorna Photos: కుందనపు బొమ్మా నిను చూస్తే మనసుకి వెలుగమ్మా

eMudhra IPO: ఈ-ముద్రా ఐపీవోకు తొలిరోజు 47% స్పందన, రిటైల్‌ కోటాలో 90% బుక్‌!

eMudhra IPO: ఈ-ముద్రా ఐపీవోకు తొలిరోజు 47% స్పందన, రిటైల్‌ కోటాలో 90% బుక్‌!

Shekar Review: శేఖర్ రివ్యూ: రాజశేఖర్ కొత్త సినిమా ఎలా ఉందంటే?

Shekar Review: శేఖర్ రివ్యూ: రాజశేఖర్ కొత్త సినిమా ఎలా ఉందంటే?