అన్వేషించండి

Pramod Gupta Joins BJP: యూపీలో భాజపా దెబ్బకు దెబ్బ.. నిన్న కోడలు, నేడు తోడల్లుడు.. ఎస్పీకి వరుస షాక్‌లు!

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ తోడల్లుడు ప్రమోద్ గుప్తా భాజపాలో చేరారు.

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న కొద్దీ వలసలు పెరుగుతున్నాయి. ములాయం సింగ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ భాజపాలో బుధవారం చేరగా తాజాగా ఆయన తోడల్లుడు ప్రమోద్ గుప్తా కాషాయ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా అఖిలేశ్ యాదవ్‌పై విమర్శలు గుప్పించారు. 

" నేను భాజపాలో చేరడానికి కారణం వారి పాలసీ నాకు నచ్చింది. అఖిలేశ్.. ఎస్పీలో ఉన్న సమాజ్‌వాదీలు అందరినీ ద్వేషిస్తున్నారు. ఒక్కొక్కరిగా అందిరినీ పార్టీ నుంచి బయటికి పంపేందుకు పొగ పెడుతున్నారు. ఇప్పుడు కేవలం తన గురించి డబ్బా కొట్టేవాళ్లు మాత్రమే పార్టీలో ఉన్నారు. బిధున నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు నేను తప్ప ఇంకెవరు 18 వేల కంటే ఎక్కువ మెజారిటీతో గెలవలేదు.                                                                         "
-ప్రమోద్ గుప్తా, ములాయం సింగ్ తోడల్లుడు

రానున్న రోజుల్లో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు భాజపాలో చేరనున్నట్లు ప్రమోద్ గుప్తా అన్నారు. భాజపా అధిష్ఠానం పచ్చజెండా ఊపిన వెంటనే పార్టీలో చేరతారని వెల్లడించారు.

ములాయం భార్య సాధనా గుప్తా సోదరి భర్తే ప్రమోద్ గుప్తా. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత అఖిలేశ్‌కు, ఆయన బాబాయి శివపాల్ యాదవ్‌కు మధ్య విభేదాలు వచ్చాయి. శివపాల్.. సమాజ్‌వాదీ నుంచి బయటికి వచ్చి ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ (పీఎస్పీ) పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. ఆ సమయంలో ప్రమోద్ గుప్తా కూడా పీఎస్పీలో చేరారు.

అయితే తాజా ఎన్నికల్లో శివపాల్ యాదవ్, అఖిలేశ్ యాదవ్ ఒక్కటవ్వడం నచ్చక ప్రమోద్ గుప్తా భాజపాలో చేరారు.

కాంగ్రెస్ నేత ప్రియాంక మౌర్య కూడా ఈరోజు భాజపాలో చేరారు.

అపర్ణా యాదవ్..

ములాయం సింగ్ చిన్న కోడలు అపర్ణా దేవి.. భాజపాలో బుధవారం చేరారు. పైగా ములాయం సింగ్ ఆశిర్వాదంతోనే తాను భాజపాలో చేరినట్లు అపర్ణా దేవి.. ఏబీపీ న్యూస్‌కు ఇచ్చి ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ములాయం సింగ్ రెండో భార్యకు పుట్టిన ప్రతీక్ యాదవ్​ను అపర్ణ వివాహం చేసుకున్నారు. 2017 ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్​వాదీ పార్టీ తరఫున పోటీ చేశారు. భాజపా అభ్యర్థి రీటా బహుగుణ చేతిలో ఓడిపోయారు. అపర్ణ భాజపాలో చేరుతారని ముందు నుంచీ ఊహాగానాలు వచ్చాయి. వీటిని నిజం చేస్తూ ఇప్పుడు ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.

అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అపర్ణ పోటీ చేయరని సమాచారం. భాజపా మహిళా మోర్చా బాధ్యతలు ఆమెకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: UP Cong Candidate List: యూపీలో కాంగ్రెస్ 'మహిళా' అస్త్రం.. రెండో జాబితాలో 16 మందికి చోటు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Thandel: సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Ola News: కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
Embed widget