UP Election 2022: యోగి కేబినెట్‌లో మూడో వికెట్ డౌన్.. యూపీలో మరో మంత్రి రాజీనామా
యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌లో మూడో వికెట్ పోయింది. మరో మంత్రి తన పదవికి రాజీనామా చేసి అఖిలేశ్ యాదవ్‌ను కలిశారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా యోగి కెబినెట్ నుంచి మరో మంత్రి రాజీనామా చేశారు. వెనుకబడిన వర్గాలకు చెందిన నేత ధరమ్ సింగ్ సైని తన మంత్రి పదవికి నేడు రాజీనామా చేశారు.
ఇప్పటికే స్వామి ప్రసాద్ మౌర్య, ధారా సింగ్ చౌహాన్.. యోగి కేబినెట్‌కు రాజీనామా చేసి సమాజ్‌వాదీ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. సైనీ కూడా అదే దారిలో వెళ్లనున్నారు. ప్రస్తుతం నకుడ్ అసెంబ్లీ స్థానానికి సైనీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. యోగి కేబినెట్‌లో ఆయుష్, ఆహార భద్రత, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా పనిచేశారు.
ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనంది బెన్‌కు రాజీనామా సమర్పించిన అనంతరం తన సెక్యూరిటీ కవర్, అధికారిక నివాసాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి అప్పజెప్పారు సైనీ.
సమాజ్‌వాదీ చెంతకు..
రాజీనామా చేసిన అనంతరం సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌ను కలిశారు ధరమ్ సింగ్ సైనీ. పార్టీలోకి సైనీని సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు ఆయనతో ఉన్న ఫొటోను అఖిలేశ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
‘सामाजिक न्याय’ के एक और योद्धा डॉ. धर्म सिंह सैनी जी के आने से, सबका मेल-मिलाप-मिलन करानेवाली हमारी ‘सकारात्मक और प्रगतिशील राजनीति’ को और भी उत्साह व बल मिला है। सपा में उनका ससम्मान हार्दिक स्वागत एवं अभिनंदन!
— Akhilesh Yadav (@yadavakhilesh) January 13, 2022
बाइस में समावेशी-सौहार्द की जीत निश्चित है! #मेला_होबे pic.twitter.com/2FDkLLNW93
సైనీ కూడా అంతకుముందు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నుంచి 2016లో భాజపాలో చేరారు. ఇప్పుడు సమాజ్‌వాదీ గూటికి చేరుతున్నారు.
మరో ఎమ్మెల్యే..
ఈరోజు ఉదయం మరో ఎమ్మెల్యే ముఖేశ్ వర్మ కూడా పార్టీకి రాజీనీమా చేశారు. ప్రస్తుతం ఆయన శిఖోహాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈయనతో కలిపి ఇప్పటివరకు ఏడుగురు ఎమ్మెల్యేలు భాజపాను వీడారు.
మొత్తం 13 మంది ఎమ్మెల్యేలు భాజపాను వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యోగి కేబినెట్ నుంచి బయటకు వచ్చిన స్వామి ప్రసాద్ మౌర్య.. జనవరి 14న భాజపాకు పెద్ద షాక్ తగులుతుందని వ్యాఖ్యానించారు.
Also Read: ABP CVoter Survey: యూపీకి యోగి, ఉత్తరాఖండ్‌కు హరీశ్ రావత్.. సీఎంలుగా వీళ్లే కావాలట!
Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి