అన్వేషించండి

Amit Shah CRPF camp Visit: ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ మోదీ సర్కార్ సహించదు: అమిత్ షా

జమ్ముకశ్మీర్ పుల్వామాలోని సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌ను అమిత్ షా సందర్శించారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. పుల్వామా జిల్లా లెత్‌పొరాలో ఉన్న సీఆర్‌పీఎఫ్‌ క్యాంప్‌ను సందర్శించారు. మూడు రోజుల జమ్ము పర్యటనలో భాగంగా అక్కడికి వెళ్లారు. అక్కడ ఉన్న బలగాలతో కాసేపు మాట్లాడారు. ఆయుధ సామగ్రిని పరిశీలించారు.
" కశ్మీర్‌లో ఒకప్పుడు రాళ్ల దాడులు ఎక్కువగా జరిగేవి. కానీ ప్రస్తుతం అలాంటి ఘటనలు గణనీయంగా తగ్గాయి. ఉగ్రవాదాన్ని మోదీ సర్కార్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు. మానవతావాదానికి ఇది వ్యతిరేకం.                                                     "
-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి 
 
మూడు రోజుల పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు అమిత్ షా శ్రీకారం చుట్టారు. ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. జమ్ముకశ్మీర్‌లో అల్లకల్లోలం సృష్టించాలని ప్రయత్నించేవారిని వదిలిపెట్టేదిలేదని హెచ్చరించారు. జమ్ముకశ్మీర్‌లోని ఐఐటీ-జమ్ము కొత్త క్యాంపస్‌ను ఆయన ఇటీవల ప్రారంభించారు.
 
జమ్ముకశ్మీర్ ప్రజలకు అన్యాయం జరిగే సమయం అయిపోయింది. అది చెప్పేందుకే నేను జమ్ము వచ్చాను. ఎవరూ మీకు అన్యాయం చేయలేరు. ఇక్కడ జరుగుతోన్న అభివృద్ధిని అడ్డుకోవాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడ జరిగే అభివృద్ధిని ఎవరూ ఆపలేరు. జమ్ముకశ్మీర్.. ఎన్నో ఆలయాలకు నెలవు. మాతా వైష్ణో దేవి ఆలయం ఇక్కడే ఉంది. శ్యామా ప్రసాద్ ముఖర్జీ, ప్రేమ్ నాథ్ డోగ్రా వంటి వారి ప్రాణత్యాగానికి ఈ జమ్ముకశ్మీర్ ప్రతీక. ఇక్కడ అశాంతి నెలకొల్పాలని చూసేవారిని మేం సహించం.                                       "
-  అమిత్ షా, కేంద్ర హోంమంత్రి

స్థానిక రాజకీయ పక్షాలపై కూడా అమిత్ షా విమర్శలు గుప్పించారు. కశ్మీర్ ప్రజలను ఇన్నాళ్లు దోచుకున్న వారు ఇప్పుడు అభివృద్ధిని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

Also Read: Mumbai News: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్.. వాంఖడేపై విజిలెన్స్ విచారణ!

Also Read: UP Polls 2022: ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలకు ప్రియాంక వాగ్దానం.. ఈసారి ఉచిత వైద్యంపై హామీ

Also Read: Study: కరోనా వ్యాక్సిన్ ఇతర వ్యాధుల మరణాల రేటును కూడా ప్రభావితం చేస్తుందా?

Also Read: Corona virus: కరోనా కారణంగా భారతీయుల ఆయుర్ధాయం తగ్గిపోయిందా? కొత్త అధ్యయనంలో కలవరపెట్టే నిజాలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Sukhbir Singh Badal News: నాందేడ్‌లో సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై కత్తితో దాడి!  
నాందేడ్‌లో సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై కత్తితో దాడి!  
Digital India: డిజిటల్ ఇండియా మీ జీవితాన్ని ఎలా మార్చింది?
డిజిటల్ ఇండియా మీ జీవితాన్ని ఎలా మార్చింది?
Harbhajan - Sreesanth Drama: శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget