UAV Missile test in Kurnool: కర్నూలులో అత్యాధునిక వార్ డ్రోన్ మిస్సైల్ ప్రయోగాలు సక్సెస్ - ఓర్వకల్లుపై రాజ్ నాథ్ సంచలన ట్వీట్
KurnoolWar drone missile: కర్నూలు జిల్లా ఓర్వకల్లులో భారత రక్షణ శాఖ ఓ అద్భుతమైన విజయాన్ని సాధించింది. వార్ డ్రోన్ మిస్సైల్స్ విజయవంతంగా పరీక్షించింది.

National Open Area Range test range in Kurnool: కర్నూలు జిల్లాలోని ఓర్వకర్లు సమీపంలో ఉన్న నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ (NOAR) టెస్ట్ రేంజ్‌లో UAV లాంచ్‌డ్ ప్రెసిషన్ గైడెడ్ మిస్సైల్ (ULPGM)-V3 క్క ఫ్లైట్ ట్రయల్స్‌ను డీఆర్‌డీఏ విజయవంతంగా నిర్వహించింది. భారత రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నారు. డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఈ విజయాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోషల్ మీడియా లో ప్రకటించారు.
ఓర్వకల్లులో నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్
కర్నూలుజిల్లా ఓర్వకల్లు మండలం, పాలకొలను సమీపంలో నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ (NOAR) ఉంది. NOAR అనేది అత్యాధునిక రక్షణ సాంకేతికతలను పరీక్షించడానికి DRDO ఉపయోగించే కీలక సౌకర్యం, ఇది గతంలో హై-ఎనర్జీ లేజర్ ఆధారిత డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ (DEWs) పరీక్షలకు కూడా ఉపయోగించబడింది. ULPGM-V3 ఫ్లైట్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి, ఇది భారత్ కు చెందిన డ్రోన్-లాంచ్‌డ్ ప్రెసిషన్ స్ట్రైక్ సామర్థ్యాలలో ఎంతో కీలకమైనది. ]
In a major boost to India’s defence capabilities, @DRDO_India has successfully carried out flight trials of UAV Launched Precision Guided Missile (ULPGM)-V3 in the National Open Area Range (NOAR), test range in Kurnool, Andhra Pradesh.
— Rajnath Singh (@rajnathsingh) July 25, 2025
Congratulations to DRDO and the industry… pic.twitter.com/KR4gzafMoQ
అత్యంత అధునాతన వార్ డ్రోన్
ULPGM సిరీస్‌లో మూడు తెలిసిన వేరియంట్‌లు ఉన్నాయి. DRDO టెర్మినల్ బాలిస్టిక్స్ రిసెర్చ్ లాబొరేటరీ (TBRL) ద్వారా అభివృద్ధి చేసిన ప్రొడక్షన్ వేరియంట్ బహుళ వార్‌హెడ్ కాన్ఫిగరేషన్‌లతో ఉంటుంది. ఎక్స్‌టెండెడ్ రేంజ్ వేరియంట్, ఇమేజింగ్ ఇన్‌ఫ్రారెడ్ సీకర్ , డ్యూయల్-త్రస్ట్ ప్రొపల్షన్ సిస్టమ్‌లతో మెరుగైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ వేరియంట్ ను Aero India 2025లో ప్రదర్శించారు. ఈ మిస్సైల్ సిస్టమ్ తేలికైనది, ఖచ్చితమైనది, వివిధ ఏరియల్ ప్లాట్‌ఫామ్‌లతో అనుకూలంగా ఉంటుంది, ఇది ఆధునిక యుద్ధాలలో వ్యూహాత్మక సౌలభ్యాన్ని అందిస్తుంది.
అదాని, బీడీఎల్ సంయుక్త నిర్మాణం
అదానీ గ్రూప్ , భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) ULPGM ప్రాజెక్ట్‌లో కీలక తయారీ భాగస్వాములు. ఈ పరీక్షలు భారత పరిశ్రమ, ముఖ్యంగా MSMEs స్టార్టప్‌ల సామర్థ్యాన్ని సూచిస్తాయని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. , ఇవి కీలక రక్షణ సాంకేతికతలను గ్రహించి, ఉత్పత్తి చేయడంలో సఫలమవుతున్నాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ సహకారాన్ని ప్రశంసించారు. ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో ముఖ్యమైన అడుగుగా పేర్కొన్నారు .
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా అనంతపురం, కర్నూలు జిల్లాల్లో రక్షణ పరికరాల ఉత్పత్తికి కేంద్ర స్థానంగా మార్చాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇలాంటి ప్రయోగాలు ఏపీలో జరగడం వల్ల మరింత పేరు వచ్చే అవకాశం ఉంది.





















