Man died after drinking beer: భార్య విడాకులిచ్చిందని నెల రోజుల పాటు బీర్లే తాగాడు - అయినా బాగుంటే చెప్పుకోవాల్సి వచ్చేది కాదేమో?
Thailand man dies: థాయ్‌ల్యాండ్‌లో ఓ వ్యక్తి కేవలం బీర్లు మాత్రమే తాగుతూ నెల రోజులు గడిపాడు. చివరికి చనిపోయాడు.

Thailand man dies after consuming only beer for a month: థాయిలాండ్‌లోని రాయాంగ్ ప్రావిన్స్‌లో ఓ వ్యక్తి ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని ఫోన్ కాల్ రావడంతో పోలీసులు వెంటనే స్పందించి ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే చనిపోయినట్లుగా గుర్తించారు. పోలీసులు అతని రూములో చూస్తే.. వందకుపైగా ఖాళీ బీర్ బాటిల్స్ కనిపించాయి.
థావీసాక్ నమ్వోంగ్సా అనే వ్యక్తికి భార్య విడాకులు ఇచ్చింది. విడాకుల అనంతరం తీవ్ర మానసిక ఒత్తిడితో ఒక నెల పాటు ఆహారం తినకుండా కేవలం బీర్ మాత్రమే తాగుతూ గడిపాడు. అతని బెడ్‌రూమ్‌లో 100కి పైగా ఖాళీ బీర్ బాటిళ్లును గుర్తించారు. శరీరంలో నీలిరంగులోకి అపస్మారక స్థితిలో ఉన్న సమయంలోనే ఆస్పత్రికి తరలించారు. అతని మరణానికి అధిక మద్యపానం ప్రధాన కారణంగా అధికారులు భావిస్తున్నారు.
థావీసాక్ నమ్వోంగ్సా తన భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత, తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నాడు. ఈ ఒత్తిడిని తట్టుకోవడానికి అతను ఆహారం తీసుకోవడం మానేసి, కేవలం బీర్ మాత్రమే తాగడం ప్రారంభించాడని భావిస్తున్నాడు. ఇంట్లో అతని 16 ఏళ్ల కుమారుడు కూడా ఉంటున్నాడు. అతడు పోలీసులకు తెలిపిన వివరాలు తెలిపారు. థావీసాక్ ఒక నెల పాటు ఆహారం తినడానికి నిరాకరించాడు. కుమారుడు ప్రతిరోజూ తన తండ్రి కోసం వంట చేసినప్పటికీ, అతను దానిని తినేవాడు కాదు.
More info 🚨
— Global Statistics (@Globalstats11) July 24, 2025
Man in Thailand dies after drinking only beer for a month, hundreds of empty bottles found in room
A man in Thailand has died after reportedly surviving for over a month on beer alone, refusing to eat any solid food during this period.
His 16-year-old son… pic.twitter.com/IG1rR6837z
పరిస్థితి తెలిసి వైద్య సిబ్బంది థావీసాక్ బెడ్‌రూమ్‌లో 100కి పైగా ఖాళీ బీర్ బాటిళ్లు ఉన్నాయి. బీర్‌లో కేలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇది అవసరమైన పోషకాలను అందించదు. ఆహారం లేకుండా బీర్ మాత్రమే తీసుకోవడం వల్ల పోషకాంశ లోపం, కాలేయానికి నష్టం, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్య నిపుణులు బీర్‌ను మితంగా తీసుకోవాలని సూచిస్తారు.
అధిక మద్యపానం మూర్ఛ , గుండె సంబంధిత సమస్యలు, శ్వాసకోశ అవరోధం, మరణానికి కూడా దారితీయవచ్చు. థావీసాక్ యొక్క ఆరోగ్యం వేగంగా ఈ కారణాల వల్లే వేగంగా క్షీణించిందని భావిస్తున్నారు. అధిక మద్యపానం యొక్క ప్రమాదాల గురించి ఈ ఘటన ఒక హెచ్చరికగా నిలుస్తుంది. ముఖ్యంగా ఒత్తిడి కాలంలో సమతుల్య ఆహారం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాముఖ్యతను గుర్తు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.





















