Thailand risky for tourists: థాయ్‌ల్యాండ్‌కు టూర్ ప్లాన్ చేసుకున్నారా ? అర్జంట్‌గా క్యాన్సిల్ చేసుకోండి - ఎందుకంటే ?
Thailand is risky : ధాయ్ ల్యాండ్ పర్యటనకు వెళ్లడం ఇప్పుడు రిస్క్ తో కూడుకున్నదని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. కాంబోడియాతో ఆ దేశం యుద్ధం ప్రారంభించడమే కారణం.

Thailand Tour is risky : భారతీయులు ఎక్కువగా వెళ్లే విదేశీ పర్యాటక ప్రాంతాల్లో థాయ్‌ల్యాండ్ కూడా ఒకటి. అయితే ఇప్పుడు అలాంటి పర్యటనలు ఏమైనా ఉంటే అర్జంట్‌గా రద్దు చేసుకోమని సలహాలు వినిపిస్తున్నాయి. అందమైన బీచ్‌లు, సాంస్కృతిక ఆకర్షణలు , అద్భుతమైన ఆతిథ్యం ఆకట్టుకుంటున్నప్పటికీ ప్రస్తుతం ఆ దేశంలో పరిస్థితి అంతగా బాగా లేవు.
థాయిలాండ్ , కంబోడియా శత్రుదేశాలుగా ఉన్నాయి. ప్రస్తుతం ఆ రెండు దేశాలు యుద్ధానికి దిగాయి. సరిహద్దుల్లో కాల్పులు జరుపుకుంటున్నారు. ఈ కాల్పుల్లో కనీసం 16 మంది మరణించారు మరియు పదివేల మంది నిరాశ్రయులయ్యారని నివేదికలు చెబుతున్నాయి.
మే నెలలో జరిగిన స్వల్ప కాల్పుల్లో కంబోడియా సైనికుడు ఒకరు మరమించారు. దీంతో పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడం ప్రారంభమయ్యాయి. అప్పటి నుండి క్రమంగా పెరిగాయి, ఇది దౌత్యపరమైన వివాదాలకు, ఇప్పుడు సాయుధ ఘర్షణలకు దారితీసింది.
థాయిలాండ్‌లో, ముఖ్యంగా దక్షిణ ప్రాంతాలైన యాలా, పట్టానీ, నరతివాట్, సాంగ్‌ఖ్లా ప్రావిన్స్‌లలో దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. సరిహద్దు వద్ద క్రమం తప్పకుండా బాంబు దాడులు , హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. ఇవి పర్యాటకులను కూడా ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే వెళ్లిన వారు బ్యాంకాక్, ఫుకెట్, చియాంగ్ మాయ్ వంటి ప్రధాన పర్యాటక ప్రాంతాలలో కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Bangkok transforms from tourist destination to warzone ‼️
— Resonant News🌍 (@Resonant_News) July 24, 2025
As per reports this is American armored light air-defense gun M42 “Duster” 40mm Self-Propelled Anti-Aircraft Guns used by Royal Thai Army.
Spotted in Bangkok as Thailand- Cambodia border tension escalates. pic.twitter.com/3EsSdB7tyZ
థాయిలాండ్-కంబోడియా సరిహద్దు వద్ద, ముఖ్యంగా బురిరామ్, సి సాకెట్, సురిన్, మరియు ఉబోన్ రత్చతానీ ప్రావిన్స్‌లలో, సాయుధ సంఘర్షణలు మరియు ల్యాండ్‌మైన్‌ల ప్రమాదం ఉంది. దేశంలోని తమ పౌరులకు భారత రాయబార కార్యాలయం ఒక సలహా జారీ చేసింది, కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఏడు ప్రావిన్సులకు ప్రయాణించకుండా ఉండాలని వారిని కోరింది.
#Thailand-#Cambodia #Borderdispute: Amid escalating violence along the disputed Thailand-Cambodia border, the Indian Embassy in Thailand has put out a travel advisory for Indian tourists, advising them to exercise extreme caution, be cautious, and regularly review official… pic.twitter.com/C0ERmHfhwS
— The Daily Jagran (@TheDailyJagran) July 25, 2025
"థాయిలాండ్-కంబోడియా సరిహద్దు సమీపంలో ఉన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, థాయిలాండ్‌కు వెళ్లే అన్ని భారతీయ ప్రయాణికులు TAT న్యూస్‌రూమ్‌తో సహా థాయ్ అధికారిక వనరుల నుండి నవీకరణలను తనిఖీ చేయాలని సూచించారు" అని భారత రాయబార కార్యాలయం X పోస్ట్‌లో తెలిపింది.





















