British fighter jet: ఎట్టకేలకు బాగు చేశారు- నెల రోజులకు ఎగిరిన బ్రిటిష్ ఫైటర్ జెట్ - కేరళ నుంచి బ్రిటన్ పయనం !
Fighter jet Kerala: అత్యవసర ల్యాండింగ్ బ్రిటిష్ ఫైటర్ జెట్ ను ఎట్టకేలకు రిపేర్ చేశారు. అవకపోతే ముక్కలు చేసి తీసుకెళ్లాలనుకున్నారు. కానీ నిపుణులు రిపేర్ చేయగలిగారు.

British F 35 fighter jet finally flies home: బ్రిటన్ రాయల్ నేవీకి చెందిన అత్యాధునిక ఎఫ్-35బి స్టెల్త్ యుద్ధ విమానం, సాంకేతిక సమస్యల కారణంగా గత ఐదు వారాలుగా కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో నిలిచిపోయింది. ఈ విమానం హైడ్రాలిక్ సిస్టమ్‌లో సమస్య కారణంగా జూన్ 14న అర్ధరాత్రి అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఎంతో పేరు పొందిన నిపుణులు వచ్చి రిపేర్ చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. చివరి విడత రక్షణ శాఖ సైంటిస్టులు వచ్చి పని పూర్తి పూర్తి చేశారు.
భారత్, బ్రిటన్ ఉమ్మడి విన్యాసాల కోసం వచ్చిన ఎఫ్-35బి విమానంలో హైడ్రాలిక్ సిస్టమ్ వైఫల్యం సంభవించింది, ఇది ల్యాండింగ్ గేర్, బ్రేక్‌లు, ఫ్లైట్ కంట్రోల్ సర్ఫేస్‌ల వంటి కీలక భాగాల పనితీరుపై ప్రభావం చూపించింది. సుదీర్ఘ ప్రయత్నాల త్రవాత జూలై 6న బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఎయిర్ బస్ ఎ400ఎం అట్లాస్ విమానంలో 24-25 మంది బ్రిటిష్ , అమెరికన్ ఇంజనీర్ల బృందం తిరువనంతపురం వచ్చింది. ఈ బృందం ఎయిర్ ఇండియా మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్ (ఎంఆర్‌వో) హ్యాంగర్‌లో మరమ్మతులు చేసింది. రారంభంలో మరమ్మతు ప్రయత్నాలు విఫలమయ్యాయి.
UK Royal Navy F-35B fighter jet that made an emergency landing at the Thiruvananthapuram International Airport on June 14 successfully departed for Australia on Monday, following extensive repairs and safety checks, according to an official statement from the British High… pic.twitter.com/CyfRd334cp
— Breaking Aviation News & Videos (@aviationbrk) July 22, 2025
ఓ దశలో విమానాన్ని విడదీసి సీ-17 గ్లోబ్‌మాస్టర్ విమానంలో బ్రిటన్‌కు తరలించాలని యోచించారు. జూలై 21, 2025 నాటికి, ఇంజనీర్ల బృందం హైడ్రాలిక్ సిస్టమ్‌లోని లోపాలను విజయవంతంగా సరిచేసింది. విమానాన్ని హ్యాంగర్ నుంచి బయటకు తీసుకొచ్చి, ట్రయల్ ఫ్లైట్ నిర్వహించారు. అంతా సవ్యంగా ఉండటంతో జూలై 22న ఎఫ్-35బి విమానం తిరువనంతపురం విమానాశ్రయం నుంచి విజయవంతంగా టేకాఫ్ చేసి, బ్రిటన్‌కు బయలుదేరింది. భారత వైమానిక దళం మరియు తిరువనంతపురం విమానాశ్రయ అధికారులు బ్రిటిష్ బృందానికి అవసరమైన సహకారాన్ని అందించారు.
VIDEO | Thiruvananthapuram: British Royal Navy F-35B Lightning fighter jet, which made an emergency landing at the international airport over a month ago, takes off.
— Press Trust of India (@PTI_News) July 22, 2025
Known to be one of the most advanced fighter aircraft in the world and worth over USD 110 million, the jet… pic.twitter.com/DjWHCtU9eB
ఎఫ్-35బి ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానం, ఇది షార్ట్ టేకాఫ్ , వర్టికల్ ల్యాండింగ్ (STOVL) సామర్థ్యం కలిగి ఉంది. ఇది రాడార్‌లను గుర్తించకుండా శత్రు స్థావరాలపై దాడులు చేయగలదు, అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్, నిఘా సామర్థ్యాలను కలిగి ఉంది. ఒక్కో ఎఫ్-35బి విమానం ధర సుమారు రూ. 920 కోట్లు.





















