Viral News: ముక్కలు చేసి ఎత్తుకెళ్తున్న యూకే సైన్యం - రూ. 900 కోట్ల విలువైన ఫైటర్‌జెట్‌కు ఫైనల్ పరిష్కారం!
Kerala: కేరళలో అత్యవసర ల్యాండింగ్ అయిన యూకే యుద్ధ విమానాన్ని ముక్కలు చేసి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇందు కోసం 40మంది ఇంజినీర్లు వచ్చారు.

UK scrambles 110 million dollers stealth jet: ఆ విమానం విలువ దాదాపుగా 900 కోట్ల రూపాయలు. అత్యాధునిక యుద్ధ విమానం. కేరళలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. కానీ మళ్లీ ఎగరలేకపోయింది. ఏమయిందో ఎవరూ తెలుసుకోలేకపోయారు. హ్యాంగర్ లో పెట్టుకోమంటే.. యూకే అధికారులు ఒప్పుకోలేదు. దాని రహస్యాలన్నీ ఎక్కడ కనిపెడతారోనని.. భయపడ్డారు. చివరికి నలభై మంది ఇంజినీర్లను పంపి దాన్ని ముక్కలు చేసి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.
బ్రిటీష్ రాయల్ నేవీకి చెందిన $110 మిలియన్ (సుమారు ₹920 కోట్లు) విలువైన ఎఫ్-35బి లైటనింగ్ II స్టెల్త్ ఫైటర్ జెట్, జూన్ 14, 2025 నుంచి కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ తర్వాత ఎగరలేకపోయింది. 21 రోజుల పాటు రిపేర్ ప్రయత్నాలు విఫలమైన తర్వాత, యూకే ఈ సమస్యను పరిష్కరించడానికి జెట్‌ను డిస్‌మాంటిల్ చేసి యూకేకి తిరిగి ఎయిర్‌లిఫ్ట్ చేయాలని నిర్ణయించుకుంది.
ఎఫ్-35బి లైటనింగ్ II అనేది లాక్‌హీడ్ మార్టిన్ తయారు చేసిన ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ జెట్, ఇది షార్ట్ టేక్-ఆఫ్ అండ్ వర్టికల్ ల్యాండింగ్ (STOVL) సామర్థ్యం, అధునాతన సెన్సార్ సిస్టమ్స్, రాడార్-ఎవేడింగ్ స్టెల్త్ టెక్నాలజీకి ప్రసిద్ధి చెందింది. జూన్ 14, 2025న, ఎఫ్-35బి జెట్ ఒక సాంకేతిక సమస్య కారణంగా తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేసింది. సంయుక్త సైనిక విన్యాసాల కోసం ఆసియా-పసిఫిక్ తీరానికి వచ్చింది. ల్యాండింగ్ తర్వాత, స్థానిక సాంకేతిక నిపుణులు , యూకే నుంచి వచ్చిన బృందం 21 రోజుల పాటు విమానాన్ని రిపేర్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ, సమస్యను పరిష్కరించలేకపోయారు.
#WATCH | Kerala: Latest visuals of the F-35 at Thiruvananthapuram airport. British navy officials are expected to arrive here by the end of this week to carry out repairs and take the aircraft back to its base: Defence officials
— ANI (@ANI) July 4, 2025
The F-35 jet had made an emergency landing at the… pic.twitter.com/8MYaKC0K7l
21 రోజుల తర్వాత, యూకే 40 మంది ఇంజనీర్లు మరియు స్పెషలిస్ట్‌లతో కూడిన బృందాన్ని పంపింది. ఈ బృందం దానిని డిస్‌మాంటిల్ చేసి సైనిక రవాణా విమానం ద్వారా యూకేకి తిరిగి రవాణా చేయడానికి ప్రయత్నిస్తోంది. ఎఫ్-35బి స్టెల్త్ ఫీచర్స్, అధునాతన ఎలక్ట్రానిక్స్ కారణంగా, దాని రిపేర్ లేదా రవాణా అత్యంత రహస్యంగా చేస్తారు. విమానం సాంకేతిక రహస్యాలు లీక్ కాకుండా జాగ్రత్తలుతీసుకున్నారు. డిస్‌మాంటిల్ చేసి ఎయిర్‌లిఫ్ట్ చేయడం అనేది సంక్లిష్టమైన ప్రక్రియ. దీనికి ఎన్ని రోజులు పడుతుందో స్పష్టత లేదు.





















