News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Oreo Biscuits: యూఏఈలో ఓరియో బిస్కెట్‌లపై వివాదం, క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

Oreo Biscuits: ఓరియో బిస్కెట్‌లపై యూఏఈలో పెద్ద రచ్చ జరుగుతోంది.

FOLLOW US: 
Share:

 Oreo Biscuits in UAE:

నాన్ హలాల్‌ అంటూ ప్రచారం..

యూఏఈలో ఓరియో (OREO) బిస్కెట్‌లపై పెద్ద వివాదం నడుస్తోంది. యూఏఈ ప్రభుత్వం ఓరియో బిస్కెట్‌లను నాన్ హలాల్ (Non Halal) ప్రొడక్ట్ అంటూ  సోషల్ మీడియాలో ఓ పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలూ వచ్చాయి. దీనిపై అధికారులు స్పందించారు. "ఓరియో బిస్కెట్‌లు నాన్ హలాల్ అని, ఈ బిస్కెట్‌లలో పంది మాంసం, ఆల్కహాల్‌ ఉన్నాయని  ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. అది ముమ్మాటికీ తప్పు" అని యూఏఈ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఓరియో బిస్కెట్‌లో ఎలాంటి మాంసం లేదని, జంతువుల కొవ్వుతో తయారయ్యాయన్న ప్రచారమూ అవాస్తవం అని వెల్లడించింది. ఇక ఇందులో ఆల్కహాల్‌ ఉంటుందన్న ప్రచారాన్ని కొట్టి పారేసింది. "ఇది నిజం కాదు. ఇదో డ్రై ప్రొడక్ట్. అందులో ఆల్కహాల్ కలవదు. లేబొరేటరీ టెస్ట్‌ల ఫలితాల ఆధారంగానే ఇది చెబుతున్నాం" అని అధికారులు తెలిపారు. అత్యున్నత ప్రమాణాలు పాటించిన ఆహార పదార్థాలనే దిగుమతి చేసుకుంటున్నామని తేల్చి చెప్పింది. ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు అధికారులు. ఇక ఈ పోస్ట్‌ని తీవ్రంగా పరిగణించింది...అబుదాబి అగ్రికల్చర్ అండ్ ఫుడ్‌ సేఫ్‌టీ అథారిటీ. ఇందులోపంది కొవ్వు కలుపుతారన్న ప్రచారాన్ని ఖండించింది. కొన్ని ఆహార పదార్థాల్లో ఇథనాల్‌ కలుస్తుందని, ఫర్మెంటేషన్‌కు అది అవసరం అని తెలిపింది. 

హలాల్ అంటే ఏంటి..

హలాల్ అనే పదం.. అరబ్బీ నుంచి వచ్చింది. హలాల్ అంటే ధర్మబద్ధమైనది లేదా అనుమతించదగినదని అర్థం. ప్రపంచంలోని దాదాపు ముస్లింలు అంతా ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తారు. ఈ హలాల్ ఆహార పదార్థాల వాణిజ్య మార్కెట్టు ప్రపంచవ్యాప్తంగా 580 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉందని అంచనా. హలాల్‌కు వ్యతిరేక పదం హరామ్. దీనికి నిషేధించినది, అధర్మమైనది, అనైతికమైనది అని అర్థం ఉంది. ఆహార పదార్థాలకు "హలాల్ సర్టిఫికేట్" ఇచ్చే సంప్రదాయం ముస్లింలలో ఉంది. జంతువుల మాంసాలను, హలాల్ చేసిన తరువాత మాత్రమే తినాలని వారు నమ్ముతారు. హలాల్‌ అనేది జంతువును వధించేందుకు వాడే ఓ పద్ధతి. ఇందులో మొదట జంతువుల మెడ దగ్గర నరాన్ని కోసి రక్తం బయటకు వచ్చేలా చూస్తారు. ఆ రక్తం జంతువు శరీరంలోనే ఉండిపోతే.. దాన్ని తినడంతో మనకు జబ్బులు వస్తాయని మహమ్మద్ ప్రవక్త చెప్పారు. రక్తం మొత్తం బయటకు వెళ్లిపోతే, ఆ మాంసాన్ని తిన్న తర్వాత మనకు ఏమీ కాదని వారు నమ్ముతారు. ఈ పద్ధతిని జబీహా అని పిలుస్తారు.

Also Read: Ram temple: అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ఠకు ముహూర్తం ఖరారు, వచ్చే ఏడాది మకర సంక్రాంతి వరకూ వేడుకలు

Published at : 07 Jan 2023 12:53 PM (IST) Tags: UAE Oreo Biscuits Non Halal Haram

ఇవి కూడా చూడండి

BEL Jobs: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 52 ట్రైనీ, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు - ఈ అర్హతలుండాలి

BEL Jobs: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 52 ట్రైనీ, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు - ఈ అర్హతలుండాలి

Anantapur News: డిసెంబర్ 1 ఎయిడ్స్ డే: హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు ఏపీ సర్కార్ పింఛను ఎంతో తెలుసా

Anantapur News: డిసెంబర్ 1 ఎయిడ్స్ డే: హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు ఏపీ సర్కార్ పింఛను ఎంతో తెలుసా

Revanth Reddy: రేపు ఈసీ వద్దకు కాంగ్రెస్ నేతలు, కేసీఆర్‌పై ఫిర్యాదు - వాటిని మార్చేస్తున్నారని ఆరోపణలు

Revanth Reddy: రేపు ఈసీ వద్దకు కాంగ్రెస్ నేతలు, కేసీఆర్‌పై ఫిర్యాదు - వాటిని మార్చేస్తున్నారని ఆరోపణలు

AP Telangana Water Issue: కృష్ణాజలాలపై ఢిల్లీలో రేపు కీలక మీటింగ్ - ఏపీ, తెలంగాణ హాజరవ్వాలని ఆదేశాలు

AP Telangana Water Issue: కృష్ణాజలాలపై ఢిల్లీలో రేపు కీలక మీటింగ్ - ఏపీ, తెలంగాణ హాజరవ్వాలని ఆదేశాలు

RK Roja: ఏపీలో ‘ఆడుదాం ఆంధ్రా’ - 51 రోజుల్లో 3 లక్షల మ్యాచ్‌లు, కీలక వివరాలు చెప్పిన మంత్రి రోజా

RK Roja: ఏపీలో ‘ఆడుదాం ఆంధ్రా’ - 51 రోజుల్లో 3 లక్షల మ్యాచ్‌లు, కీలక వివరాలు చెప్పిన మంత్రి రోజా

టాప్ స్టోరీస్

Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్

Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్

Ambati Rambabu: 'మా వాటాకు మించి ఒక్క నీటి బొట్టునూ వాడుకోం' - సాగర్ నీటి విషయంలో ఏపీ చర్యలు సరైనవేనన్న మంత్రి అంబటి

Ambati Rambabu: 'మా వాటాకు మించి ఒక్క నీటి బొట్టునూ వాడుకోం' - సాగర్ నీటి విషయంలో ఏపీ చర్యలు సరైనవేనన్న మంత్రి అంబటి

Hanamkonda News: సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్, స్పాట్‌లో మహిళ మృతి, షాకింగ్ వీడియో

Hanamkonda News: సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్, స్పాట్‌లో మహిళ మృతి, షాకింగ్ వీడియో