అన్వేషించండి

Donald Trump: విడుదలైన గంటల్లోనే బెస్ట్‌ సెల్లర్‌గా ట్రంప్ పుస్తకం 'సేవ్‌ అమెరికా'

Save America: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రచారంలో దూకుడుగా ఉన్నారు. అతనితో పాటు తన పుస్తకం సేవ్ అమెరికా కూడా హవా కొనసాగిస్తుంది.దీని ధర 92.06డాలర్లుగా ఉంది.

Donald Trump:ఈ ఏడాది నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. దాదాపు 24 కోట్ల మంది అమెరికన్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. డెమోక్రటిక్ పార్టీ నుంచి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్ అధ్యక్ష రేసులో ఉన్నారు. ఇప్పటికే వీరిద్దరూ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మొత్తం 50 రాష్ట్రాలున్న అమెరికాలో 7 రాష్ట్రాలు ముఖ్యమైనవి. అగ్రరాజ్యానికి అధ్యక్షుడు ఎవరనేది ఈ ఏడు రాష్ట్రాలు నిర్ణయిస్తాయి. దీంతో తటస్థ ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు ఇరు పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.  

ఉత్కంఠ రేపుతున్న ఎన్నికలు
ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి వైదొలగడంతో కమలా హారిస్ రేసులోకి దిగడంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. కమలా హారిస్‌పై మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌ విమర్శలు గుప్పిస్తున్నారు. వీరితో పాటు జో బిడెన్, కమలా హారిస్ కూడా ట్రంప్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.  అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇరు పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.  స్వింగ్ స్టేట్స్ అని పిలువబడే ఈ రాష్ట్రాలు యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిగా ఎవరు ఉండాలో నిర్ణయిస్తాయి. ఆ రాష్ట్రాలు అరిజోనా, జార్జియా, మిచిగాన్, నెవాడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్. దీంతో అక్కడి తటస్థ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇరు పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

బెస్ట్ సెల్లర్ గా ‘సేవ్ అమెరికా’
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రచారంలో దూకుడుగా ఉన్నారు. అతనితో పాటు తన పుస్తకం సేవ్ అమెరికా కూడా హవా కొనసాగిస్తుంది. అతని కొత్త పుస్తకం 'సేవ్ అమెరికా' విడుదలైన కొద్దిగంటల్లోనే అమెజాన్ బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. దీని ధర కొంచెం ఎక్కువగా  92.06డాలర్లుగా ఉన్నప్పటికీ, ఇది అమెజాన్‌లో 'ప్రెసిడెంట్స్ అండ్ హెడ్స్ ఆఫ్ స్టేట్ బయోగ్రఫీస్' జాబితాలో అగ్రస్థానంలో ఉంది. మొత్తం మీద 13వ స్థానంలో ఉంది. ఈ పుస్తకంలో ట్రంప్ తన అధ్యక్ష పదవీ కాలం,  ప్రచార సమయంలోని ముఖ్య సంఘటనల గురించి వివరించాడు. జులైలో పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ప్రచార ర్యాలీలో ఓ యువకుడు ట్రంప్ పై కాల్పులు జరిపిన ఘటన గుర్తుండే ఉంటుంది.. ఆ సమయంలో రక్తమోడుతున్నప్పటికీ ట్రంప్ త్వరగా కోలుకుని వేదికపై పిడికిలి బిగించి ‘ఫైట్’ అంటూ నినదిస్తున్న ఫోటో సోషల్ మీడియాతో తెగ వైరల్ అయింది.  ఆ  ఫోటోనే పుస్తకం కవర్ పేజీలో ముద్రించారు. 


'సేవ్ అమెరికా'లో ట్రంప్ మొదటి టర్మ్ ముఖ్యాంశాలు
 అప్పటి జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఉత్తర కొరియా నియంత కిమ్ లతో ఉన్న  ఫోటోలు ఈ పుస్తకంలో ఉన్నాయని ఓ అంతర్జాతీయ మీడియా కథనం పేర్కొంది. మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌పై విమర్శలు, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశాన్ని సమర్థించుకుంటున్నట్లు పేర్కొంది. "తన గత పదవీకాలంతో పాటు, తాను మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైతే ఎలాంటి పాలన అందించాలనే ఆలోచనను ఈ పుస్తకంలో పేర్కొన్నాడు. 'సేవ్ అమెరికా'లో తన తొలి పరిపాలనలోని ముఖ్యాంశాలను పొందుపరిచాడు. పన్నులు వంటి అంశాలు, అంతర్జాతీయ దౌత్యం ,  సరిహద్దు భద్రతను ప్రస్తావించారు" అని అమెజాన్ వెల్లడించింది. ట్రంప్ తన సోషల్ మీడియా యాప్ 'ట్రూత్'లో ఈ పుస్తకం గురించి ప్రచారం చేశారు. అందులో పొందుపరిచిన ఛాయాచిత్రాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. దేశభక్తులకు ఈ చరిత్ర తప్పక తెలుసుకోవాలనే కోణంలో పోస్ట్ చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Fact Check: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Embed widget