అన్వేషించండి

Trump about Vivek: వివేక్‌ వెరీ వెరీ వెరీ ఇంటలిజెంట్‌-ప్రశంసించిన ట్రంప్‌

Trump about Vivek: వివేక్‌ వెరీ వెరీ వెరీ ఇంటలిజెంట్‌ అని ప్రశంసించిన ట్రంప్‌

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి వివేక్‌ రామస్వామిపై ప్రశంసలు కురిపించారు. రిపబ్లికన్‌ పార్టీ నుంచి పోటీ పడుతున్న ఇండో అమెరికన్‌ అయిన వివేక్‌ను ట్రంప్‌ పొగడడం ఇది కొత్తేమీ కాదు. పలుమార్లు వివేక్‌ చాలా సమర్థుడని, చాలా తెలివైన వాడని, మంచిగా మాట్లాడగలడని పొగిడారు. ఒకే పార్టీ నుంచి పోటీ పడుతున్నప్పటికీ ట్రంప్‌ వివేక్‌పై పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. 

ట్రంప్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వివేక్‌ చాలా చాలా చాలా ఇంటలిజెంట్‌ , అతడిలో చాలా శక్తి ఉందంటూ, అది ఏ రూపంలోనైనా ఉండంచ్చని ప్రశంసించారు. అయితే వివేక్‌ చాలా మంచి వైస్‌ ప్రెసిడెంట్‌ అవుతారని ట్రంప్‌ పేర్కొన్నారు. వివేక్‌ను ఉపాధ్యక్షుడిగా తీసుకుంటారా అని అడిగిన ప్రశ్నకు ట్రంప్‌ ఈ విధంగా బదులిచ్చారు. అయితే వివేక్‌ కూడా అధ్యక్ష పదవి బరిలో ఉన్నారు.

ఇటీవల విస్కాన్సిన్‌లో జరిగిన అధ్యక్ష అభ్యర్థుల చర్చా కార్యక్రమంలో వివేక్‌ సహా ఎనిమిది మంది రిపబ్లికన్‌ అభ్యర్థులు పాల్గొన్నారు. ఇందులో వివేక్‌ రామస్వామి టాప్‌గా నిలిచారు. ఈ డిబేట్‌లో డొనాల్డ్ ట్రంప్‌ పాల్గొనలేదు. అయితే తాను డిబేట్‌ను చూస్తానని ఉపాధ్యక్షుడి పదవికి ఎంపిక చేసుకునేందుకు డిబేట్‌ చూస్తానని ట్రంప్‌ వెల్లడించారు. కాగా ఈ డిబేట్‌లో వివేక్‌ రామస్వామి వాక్చాతుర్యానికి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. పలువురు ప్రముఖులు సైతం ఆయనను ప్రశంసించారు. ముఖ్యంగా ఉక్రెయిన్‌ యుద్ధం, డొనాల్డ్‌ ట్రంప్‌ గురించి, వాతావరణ మార్పులకు సంబంధించిన ఆయన చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. 

డిబేట్‌లో వివేక్‌ రామస్వామి ప్రసంగం గురించి మాట్లాడమని ట్రంప్‌ను అడిగినప్పుడు కూడా ట్రంప్‌ ఆయనను ప్రశంసించారు. చాలా గొప్పగా మాట్లాడాడని, ముఖ్యంగా తనను 21 వ శతాబ్దపు గొప్ప అధ్యక్షుడిగా పేర్కొనడం చాలా నచ్చిందని అన్నారు. మంచిగా మాట్లాడేవారిని ప్రత్యేకంగా ఇష్టపడతారని చెప్పారు. 

వివేక్‌ రామస్వామి అమెరికాలోనే జన్మించారు. అయితే ఆయన తల్లిదండ్రులు భారత్‌లోని కేరళకు చెందిన వారు. వారు వలస వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. రెండో జనరేషన్‌ ఇండో అమెరికన్‌ అయిన వివేక్‌ 2014 లో రోవెంట్‌ సైన్సెస్‌ అనే బయోటెక్‌ సంస్థను స్థాపించి మంచి వ్యాపారవేత్తగా ఎదిగారు. 2015-2016 లో అతిపెద్ద బయోటిక్‌ ఐపీఓగా ఈ కంపెనీ నిలిచింది. వివేక్‌ హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి బయాలజీ చదివారు. యేల్‌ లా స్కూల్‌ నుంచి లాయర్‌ పట్టా పొందారు. హార్వర్డ్‌ పొలిటికల్‌ యూనియన్‌కు అధ్యక్షుడిగానూ పనిచేశారు. చర్చలంటే రామస్వామికి ఎంతో ఆసక్తి. ప్రస్తుతం అమెరికాలో టాప్‌ యువ బిలియనీర్లలో రామస్వామి ఒకరు. 

గత కొద్ది రోజులుగా రామస్వామి అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇతర రిపబ్లికన్‌ అభ్యర్థులను దాటుకుని ముందుకు వెళ్తున్నారు. ఒపీనియన్‌ పోల్స్‌ ప్రకారం ట్రంప్, ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డిసాంటిస్‌ తర్వాత వివేక్‌ మూడో స్థానంలో ఉన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ట్రంప్‌కు ఉపాధ్యక్షడిగా పనిచేస్తారా అని వివేక్‌ను అడగ్గా.. తమ ఇద్దరి కొన్ని విషయాలు కామన్‌గా ఉన్నాయని, మేమిద్దరం నంబర్ టూ గా చేయలేము అంటూ బదులిచ్చారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget