Top Headlines Today: సెజ్‌లో ప్రమాద మృతుల ఫ్యామిలీలకు రూ.కోటి - జన్వాడ ఫామ్ హౌస్ చుట్టూ వివాదమెందుకు?
AP Telangana Latest News: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
అచ్యుతాపురం సెజ్‌లో ప్రమాద మృతుల కుటుంబాలకు కోటి పరిహారం
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా పరిశ్రమలో మృతు చెందిన వారిని భారీగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందుకే ఒక్కో మృతుడి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కోటి రూపాయల పరిహారం ఇస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్ ప్రమాద బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. జరిగింది ప్రైవేటు సంస్థలో ప్రమాదం అయినా భారీగా పరిహారం అందజేయాలని నిర్ణయించింది. సంస్థ సాయంతో సంబంధం లేకుండా ఒక్కొక్క మృతుడి కుటుంబానికి కోటి రూపాయల వరకు పరిహారం అందజేస్తున్నట్టు విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎవరూ అధైర్యపడొద్దని సూచించారు. ఇంకా చదవండి
జన్వాడ ఫామ్ హౌస్ ఎవరిది ? ఆ ఫామ్ హౌస్ చుట్టూ వివాదమెందుకు?
తెలంగాణ రాజకీయాల్లో రోజుకో అంశం తెరపైకి వస్తోంది. బుధవారం జన్వాడ ఫామ్ హౌస్ అంశం హాట్ టాపిక్ అయింది. కొద్ది రోజులుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువు శిఖం భూముల్లో కట్టిన నిర్మాణాలను వరుసగా కూల్చూతూ పోతున్నారు. ఈ క్రమంలో బుధవారం కూల్చబోయేది జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌసేనని విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో ప్రదీప్ రెడ్డి బీఆర్ఎస్ నేత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ఫామ్ హౌస్ కూల్చే ప్రయత్నంలో ఉన్నారని అడ్డుకోవాలని కోరారు. అదే సమయంలో తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన కేటీఆర్ తనకు ఎలాంటి ఫామ్ హౌస్‌లు లేవని స్పష్టం చేశారు. జన్వాడ ఫామ్ హౌస్ లీజుకు మాత్రమే తన మిత్రుని వద్ద తీసుకున్నానన్నారు. ఇంకా చదవండి
రేసుగుర్రంలా దూసుకెళ్తున్న హైడ్రా రంగనాథ్
చెరువైనా.. ప్రభుత్వ భూమైనా.. కబ్జాకు కాదేదీ అనర్హం అన్నట్లుగా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతీ చెరువూ కబ్జా కోరలకు చిక్కుకున్న విషయం అందరికీ తెలిసిందే. నగరం చుట్టు పక్కల కబ్జాకోరులకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి తీసుకున్న సంచలన నిర్ణయం హైడ్రా. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి నగరాల పరిధిలో ఆక్రమణకు గరైన ప్రభుత్వ భూములను రక్షించి, కబ్జాకోరుల వెన్నులో వణుకు పుట్టించడంలో ఊహలకందని విధంగా దూసుకుపోతున్న హైడ్రా పనితీరుపై ప్రసంశలు వెల్లువెత్తుతున్నాయి. జయహో రేవంత్, జయహో హైడ్రా కమీషనర్ రంఘనాధ్ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకూ అంతా ఓకే.. ఆపరేషన్ హైడ్రాకు తిరుగులేదు. కానీ తాజాగా హైడ్రా కథ కొత్త మలుపు తిరుగుతోంది. అత్యంత ప్రమాదకరమైన పొలిటికల్ ముళ్లపొదలను దాటుకుని ముందుకు సాగాల్సిన సవాలు హైడ్రా ముందుంది. ఇంకా చదవండి
119 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ ధర్నాలు
తెలంగాణ రైతు రుణమాఫీపై రాజకీయ రగడ జరుగుతోంది. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా 2 లక్షల రూపాయల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) చెప్తోంది. అయితే... సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పూర్తిగా రుణమాఫీ చేశామని చెప్తుంటే... మంత్రులు మాత్రం రుణమాఫీ ఇంకా పూర్తిగా చేయలేదని అంటున్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల మధ్యే సమన్వయం లేదని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. అర్హులైన రైతులందరికీ... రూ.2లక్షల రుపాయల వరకు పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ.. ధర్నాలు దిగింది బీఆర్‌ఎస్ (BRS). ఇంకా చదవండి
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఆయన పుట్టిన రోజు కావడంతో కుటుంబ సమేతంగా తిరుమల వచ్చిన ఆయన స్వామి వారి సేవలో పాల్గొన్నారు. బుధవారం రాత్రి రోడ్డు మార్గం ద్వారా తిరుమల చేరుకున్న చిరు.. గురువారం ఉదయం విఐపీ బ్రేక్ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. చిరంజీవి దంపతులకు స్వాగతం పలికారు టీటీడీ అధికారులు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదాశీర్వచన ఇచ్చిన పండితులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. చిరంజీవి వెంట ఆయన భార్య సురేఖ, తల్లి అంజనా దేవి, చిన్న కూతురు శ్రీజ, మనవరాళ్లు ఉన్నారు. ఇంకా చదవండి