Top Headlines Today: వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో ఊరట; బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్టులు - నేటి టాప్ 5 న్యూస్
AP Telangana Latest News: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం..
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట
తెలుగు దేశం ఆపీస్‌పై దాడి కేసులో వైసీపీ లీడర్లు దేవినేని అవినాష్, జోగి రమేష్, తలశిల రఘురామ్, నందిగమ సురేష్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వాళ్లకు ముందస్తు బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. విచారణకు సహకరించాలని ఆదేశించింది. పాస్‌పోర్టులను కూడా విచారణ అధికారులకు అప్పగించాలని సూచించింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ నందిగమ సురేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన గుంటూరు సబ్‌జైలులో ఉన్నారు. ఆయన్ని ఈ మధ్యే వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. ఆయనకి కూడా ఈ కేసులో ఊరట లభించింది. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల మంజూరు చేసిన వారిలో నందిగమ సురేష్ ఉన్నారు. ఇంకా చదవండి
మెదక్, మేడ్చల్ జిల్లాలో బీఆర్‌ఎస్ నేతల హౌస్ అరెస్టు
తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య తలెత్తిన వివాదంలో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంది. 11 గంటలకు గాంధీ ఇంటికి వెళ్తానంటూ కౌశిక్ రెడ్డి సవాల్ చేస్తే సాదరంగా ఆహ్వానించి టీ ఇచ్చి పంపిస్తానన్నారు గాంధీ. గురువారం గొడవలకు కౌశిక్ రేడ్డే కారణమని గాంధీ ఆరోపిస్తుంటే... పోలీసులను అడ్డంపెట్టుకొని బీఆర్‌ఎస్ నేతలపై ప్రభుత్వం దాడులు చేస్తోందని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. ఈ వివాదం కొనసాగుతుండానే శేరిలింగపల్లిలో గాంధీ ఇంట్లో బీఆర్‌ఎస్ నేతల సమావేశానికి పిలవడం ఆసక్తిగా మారింది. ఇంకా చదవండి
'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తుండడంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితులపై స్పందించారు. అధికారం కొల్పోయామనే అక్కసుతో కొందరు కొందరు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఇబ్బంది కలిగిస్తే ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ జితేందర్‌ను (DGP Jitendar) ఆదేశించారు. రాజకీయ కుట్రలు సహించేది లేదని.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే పనిలో బీఆర్ఎస్ ఉందని ఆరోపించారు. శుక్రవారం మధ్యాహ్నం శాంతిభద్రతలపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఇంకా చదవండి
నగరిలో కీలక నేతలపై వైసీపీ సస్పెన్షన్ వేటు - రోజా ఇక ఫీల్డులోకి వస్తారా?
వైసీపీ ఓడిపోయినప్పటి నుంచి ఆ పార్టీకి దూరంగా ఉన్న రోజాను బుజ్జగించేందుకు వైసీపీ పెద్దలు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆమె ప్రధాన డిమాండ్ అయిన పార్టీ వ్యతిరేకుల్ని బహిష్కరించడం అనే షరతును అమలుచేశారు. ఎన్నికలకు ముందు రోజాకు వ్యతిరేకంగా ఉన్న జడ్పీటీసీలు.. ఎంపీటులు పార్టీ క్యాడర్ ఇతర పార్టీల్లో చేరిపోయారు. అయితే పార్టీ వీడకపోయినా .. రోజాకు వ్యతిరేకంగా పని చేశారు కేజే కుమార్, కేజే శాంతి. నగరిలో వీరు కీలక నేతలుగా ఉన్నారు. మున్సిపల్ చైర్మన్‌గా.. ఈడిక కార్పొరేషన్ చైర్మన్ గా ఈ దంపతులు పని చేశారు. రోజాతో వీరికి సరిపడలేదు. వీరిద్దరినీ సస్పెండ్ చేస్తూ తాజాగా వైసీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఇంకా చదవండి
జనసేనలోకి బాలినేని
వైఎస్ఆర్‌సీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా జంప్ అవుతున్నారు. తాజాగా జగన్ సమీప బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడిపోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. రేపోమాపో ఆయన అధికారిక ప్రకటన చేయనున్నట్లుగా చెబుతున్నారు. పార్టీలో తనకు అవమానాలు ఎదురవుతున్నాయని కనీస మర్యాద ఇవ్వడం లేదని ఆయన అసంతృప్తిగా ఉన్నారు. కనీసం జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని ఇంత కాలం చెబుతూ వస్తున్నారు. తాను ఈవీఎంలపై చేస్తున్న పోరాటానికి మద్దతివ్వడం లేదని కూడా గతంలో పార్టీపై అసంతృృప్తి వ్యక్తం చేశారు. ఇంకా చదవండి