Kaushik Reddy Vs Arikepudi Gandhi: మెదక్, మేడ్చల్ జిల్లాలో బీఆర్‌ఎస్ నేతల హౌస్ అరెస్టు- కౌశిక్, గాంధీ ఇంటి చుట్టూ పోలీసుల పహారా
Kaushik Reddy Vs Arikepudi Gandhi: అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి వివాదంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. బీఆర్‌ఎస్ లీడర్లను ఎవర్నీ బయటకు రానివ్వడం లేదు. చాలా మందిని హౌస్ అరెస్టు ేశారు.
Kaushik Reddy Vs Arikepudi Gandhi: తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య తలెత్తిన వివాదంలో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంది. 11 గంటలకు గాంధీ ఇంటికి వెళ్తానంటూ కౌశిక్ రెడ్డి సవాల్ చేస్తే సాదరంగా ఆహ్వానించి టీ ఇచ్చి పంపిస్తానన్నారు గాంధీ.
గురువారం గొడవలకు కౌశిక్ రేడ్డే కారణమని గాంధీ ఆరోపిస్తుంటే... పోలీసులను అడ్డంపెట్టుకొని బీఆర్‌ఎస్ నేతలపై ప్రభుత్వం దాడులు చేస్తోందని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. ఈ వివాదం కొనసాగుతుండానే శేరిలింగపల్లిలో గాంధీ ఇంట్లో బీఆర్‌ఎస్ నేతల సమావేశానికి పిలవడం ఆసక్తిగా మారింది.
ఈ సమావేశానికి కౌశిక్ రెడ్డి కూడా సమాచారం అందింది. ఆయన కూడా సమావేశానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. గాంధీ ఇంటికి సమావేశానికి వెళ్లి అక్కడ ఇద్దరం కలిసి భోజనం చేసి అటు నుంచి తెలంగాణ భవన్‌కు వచ్చి మీడియా సమావేశం పెడతామని చెప్పుకొచ్చారు.
గాంధీ ఆహ్వానం మేరకు సమావేశానికి తరలి వస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. కొందరి హౌస్ అరెస్టు చేశారు. వారితోపాటు బీఆర్‌ఎస్‌లోని కీలకమైన నేతలను కూడా ఇంటి నుంచి బయటకు రానివ్వడం లేదు. హరీష్‌రావు లాంటి వాళ్లను కూడా నిర్బంధించారు.
ఇలా నేతలను నిర్బంధించడంపై బీఆర్‌ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమపార్టీ నేతలను బయటకు రాకుండా అడ్డుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసుల రాజ్యం నడుస్తోందని ఆరోపిస్తోంది. అన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని సరైన టైంలో బుద్ధి చెబుతారని చెప్పుకొచ్చింది.