Top Headlines Today: గన్ లైసెన్స్ కోసం పోలీసుల వద్దకు దువ్వాడ శ్రీను; కవిత బెయిల్‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు - నేటి టాప్ న్యూస్
AP Telangana Latest News: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
తుపాకీ ఉంది లైసెన్స్ ఇవ్వండి - పోలీసులకు దరఖాస్తు చేసిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్
ఎవరైనా తమకు ప్రాణహాని ఉందని గన్ లైసెన్స్ కావాలని దరఖాస్తు చేస్తారు. ఒక వేల పోలీసులు లైసెన్స్ ఇవ్వాలనుకుంటే.. ఇస్తే.. ఆ లైసెన్స్‌లో ఇచ్చిన ఆమోదం ప్రకారం తుపాకీని కొనుగోలు చేసుకుంటారు. అదీ ప్రాసెస్ .. కానీ వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం డిఫరెంట్. ముందుగా ఆయన తనకు కావాల్సిన తుపాకీని కొనుక్కున్నారు. ఇప్పుడు దానికి లైసెన్స్ కావాలని పోలీసులకు దరఖాస్తు చేశారు. దువ్వాడ దరఖాస్తు చేసుకునన వైనం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంకా చదవండి
ఎంపీ మిథున్ రెడ్డికి సీఆర్పీఎఫ్ భద్రత
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సీఆర్పీఎఫ్ రక్షణ కల్పించింది. తనపై దాడులు జరుగుతున్నాయని ఇటీవల పుంగనూరులో పర్యటించిన సమయంలో జరిగిన ఘటల్ని ఆయన కేంద్ర హోంశాఖకు వివరించారు. ఆ రోజు జరిగిన గొడవల్లో మిథున్ రెడ్డి గన్ మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. ఓ వాహనాన్ని కూడా దుండగులు తగులబెట్టారు. ఈ పరిణామాల తర్వాత తనకు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న భద్రత సరిపోదని సీఆర్పీఎఫ్ భద్రత కావాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ విజ్ఞప్తి మేరకు కేంద్ర హోంశాఖ సీఆర్పీఎఫ్ భద్రత కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇంకా చదవండి
కవితకు వచ్చే వారం బెయిల్ - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ లిక్కర్ కేసులో తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు వచ్చే వారం బెయిల్ వస్తుందని ఆమె సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెబుతున్నారు. ఇప్పటికే బెయిల్ ప్రాసెస్ నడుస్తోందన్నని తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చెప్పారు. కవిత జైల్లో 11కిలోల బరువు తగ్గారని, కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయన్నారు. జైల్లో కవితకు బీపీ వచ్చింది... రోజుకు రెండు ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది, జైలు అపరిశుభ్రంగా ఉండటంతో పాటు 11వేల మంది ఖైదీలు ఉండాల్సిన ఆ జైల్లో ఏకంగా 30వేల మందిని ఉంచారని కేటీఆర్ చిట్ చాట్ లో తెలిపారు. జైల్లో కవిత చాలా ఇబ్బంది పడుతున్నారు... కానీ జైలుకు వెళ్లి వచ్చిన వారు భవిష్యత్ లో పెద్ద లీడర్లు అయిన ప్రచారం కూడా ఉందని ఆయన గుర్తు చేశారు. ఇంకా చదవండి
గచ్చిబౌలి ఫ్లైఓవర్ రాత్రి 11 నుంచి క్లోజ్
హైదరాబాద్‌లో కీలకమైన గచ్చిబౌలి ఫ్లైఓవర్‌ను రాత్రి 11 గంటలకు మూసివేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు. ఎస్‌ఆర్‌డిపి శిల్పా లేఅవుట్ ఫేజ్-2 ఫ్లైఓవర్ నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. రాత్రి 11 గంట నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఈ రోడ్లు మూసివేస్తున్నట్టు తెలిపారు. ఇంకా చదవండి
వైఎస్ఆర్‌సీపీ పార్టీ పదవులకు ఆళ్ల నాని గుడ్ బై
వైఎస్ఆర్‌సీపీ ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి ఆళ్ల నాని పార్టీ పదవులకు.. రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు.. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు జగన్‌కు లేఖ రాశారు. అయితే ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయలేదని అనుచరులు చెబుతున్నారు. అయితే ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారని అందుకే .. పార్టీ పదవులకు రాజీనామా చేశారని చెబుతున్నారు. ఇంకా చదవండి