అన్వేషించండి

Todays Top 10 headlines: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్, ఏపీలో బిగ్‌ అనౌన్స్‌మెంట్‌ ఉందన్న లోకేష్ వంటి టాప్ న్యూస్

Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల సమాహారం ఇక్కడ చూడొచ్చు.

Top 10  News : 

1. ఏపీలో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు 
ఏపీలో ఆహార భద్రత పెంపొందించే విషయంలో కీలక ముందడుగు పడింది. ఆహార భద్రత తనిఖీల కోసం ఫుడ్‌ సేప్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (FSSAI)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం.. ల్యాబ్‌లు, మౌలిక వసతుల ఏర్పాటుతోపాటు సిబ్బందికి FSSAI శిక్షణ ఇవ్వనుంది. రాష్ట్రంలో 5 ప్రాథమిక ప్రయోగ కేంద్రాలు, 15 మొబైల్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
2. నేడు బిగ్‌ అనౌన్స్‌మెంట్‌: మంత్రి లోకేశ్‌
నేడు బిగ్‌ అనౌన్స్‌మెంట్‌ ఉండబోతుందంటూ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. టాటా సన్స్‌ బోర్డు చైర్మన్‌ చంద్రశేఖరన్‌ తో భేటీ అయిన ఫొటోను ఎక్స్‌లో షేర్ చేశారు. ఆయనతో సమావేశం ఫలప్రదంగా జరిగిందని తెలిపారు. రేపటి ప్రకటన కోసం అందరూ ఎదురు చూడండి అని చెప్పారు. దీంతో నేడు ఎలాంటి ప్రకటన వెలువడుతుందనే అంశంపై అందరిలో ఆసక్తి నెలకొంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
3. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను క‌లిసిన షాయాజీ షిండే
ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను న‌టుడు షాయాజీ షిండే క‌లిశారు. మంగవారం మంగ‌ళ‌గిరిలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాల‌యంలో ప‌వ‌న్‌తో షిండే భేటీ అయ్యారు. ఆల‌యాల్లో భ‌క్తుల‌కు ప్రసాదంతో పాటు ఒక మొక్కను అంద‌జేస్తే ప‌చ్చదనం పెరుగుతుంద‌ని ఇటీవ‌ల షాయాజీ షిండే చెప్పిన సంగతి తెలిసిందే. త‌న ఆలోచ‌న‌ను ప‌వ‌న్‌తో పంచుకునేందుకు ఆయన భేటీ అయ్యారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
4. మేం రాజకీయాల్లోకి రాకూడదా? : యాంకర్ శ్యామల
సినిమాల్లో పనిచేసిన వాళ్లు రాజకీయాల్లోకి రాకూడదా అని వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల ప్రశ్నించారు. టీడీపీని స్థాపించిన సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు సినిమా ఇండస్ట్రీ నుంచి రాలేదా అని అన్నారు. తనను వైసీపీ అధికార ప్రతినిధిగా ఎంపిక చేసినప్పటి నుంచి టీడీపీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు రెచ్చిపోయానని శ్యామల మండిపడ్డారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
5. నిరుద్యోగులకు డిప్యూటీ సీఎం గుడ్‌న్యూస్
తెలంగాణ నిరుద్యోగులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుడ్‌న్యూస్ చెప్పారు. విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి త్వరలోనే భారీ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఖమ్మం, వరంగల్‌ జిల్లాల విద్యుత్‌ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘పదేళ్లుగా నిలిచిన పదోన్నతులను ఇప్పటికే పూర్తి చేశాం. విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి ప్రజలు 1912 నంబర్‌కు కాల్‌ చేయండి’ అని సూచించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
6. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చే రెండురోజుల పాటు వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సూచించింది. అరేబియా సముద్రంలో ఒక ఉపరితల ద్రోణి, బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేశారు. ఏపీలో రెండు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో మరో ఒకట్రెండు రోజులు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతవరణ కేంద్రం తెలిపింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
7. కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలి: నాగార్జున
మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని హీరో నాగార్జున నాంపల్లి కోర్టుకు తెలిపారు. ‘కొండా సురేఖ నా కుటుంబంపై అమర్యాదకరంగా.. నాగచైతన్య, సమంతపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మా కుటుంబ పరువు, మర్యాదలకు భంగం వాటిల్లింది. రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి కామెంట్స్‌ చేశారు. ఈ వార్తలు అన్ని చానెళ్లు, పేపర్లలో వచ్చాయి. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి’ అని కోర్టుకు నివేదించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
9. సీఏం రేసులో ఎవరెవరున్నారు 
హర్యానా, జమ్మూకశ్మీర్‌లో ఫలితాలు వెల్లడైన తర్వాత ప్రమాణం చేసే సీఎంలు ఎవరనే చర్చ నడుస్తోంది. హర్యానాలో 3 వసారి అధికారం లోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ లో  ముఖ్య మంత్రిగా నయాబ్‌ సింగ్ సైనీ, అనిల్ విజ్ లకు అవకాశంఉంది . జమ్ము కాశ్మీర్ లో కాంగ్రెస్, ఎన్పీ కలిసి అధికారంలోకి  వస్తుండగా   నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఇప్పటికే తన కుమారుడు ఒమర్ అబ్దుల్లా కేంద్ర పాలిత ప్రాంతానికి తదుపరి ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
9. సమంతపై త్రివిక్రమ్‌ ఆసక్తికర కామెంట్స్
తమిళం, తెలుగు, మలయాళం ఇలా అన్ని చోట్ల ఒకే విధమైన అభిమానగణం ఉన్న నటుల్లో రజనీకాంత్‌ తర్వాత సమంత మాత్రమేనని దర్శకుడు త్రివిక్రమ్‌ కొనియాడారు. ‘జిగ్రా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఏ మాయ చేసావె’ సినిమా నుంచే సమంత హీరో. ఆమెకు వేరే శక్తి అక్కర్లేదు. తానే ఓ శక్తి. సమంత.. మీరు ముంబైలోనే ఉండకుండా అప్పుడప్పుడు హైదరాబాద్‌కు రండి. మీరు సినిమాలు చేయడం లేదని మేం కథలు రాయడం లేదు’ అని అన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
 
10 . ముగిసిన అజారుద్దీన్ విచారణ
 టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత అజారుద్దీన్ ఈడీ విచారణ కాసేపటి క్రితం ముగిసింది. అజారుద్దీన్‌ను దాదాపు 10 గంటలపాటు ఈడీ అధికారులు విచారించారు. ఈ విచారణలో HCAలో జరిగిన అవకతవకలు, క్రికెట్ పరికరాలు, నిధుల దుర్వినియోగంపై ఈడీ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. కాగా 2020-23 మధ్యలో అజారుద్దీన్ HCA ప్రెసిడెంట్‌గా ఉన్నారు.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag TCS: విశాఖలో టీసీఎస్ సంస్థ, 10 వేల మందికి ఉద్యోగాలు - మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేష్‌
విశాఖలో టీసీఎస్ సంస్థ, 10 వేల మందికి ఉద్యోగాలు - మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేష్‌
YS Jagan On Haryana : హర్యానా ఎన్నికలపై అనుమానాలు - బ్యాలెట్లతోనే ప్రజాస్వామ్యం సేఫ్ - జగన్ ట్వీట్ వైరల్
హర్యానా ఎన్నికలపై అనుమానాలు - బ్యాలెట్లతోనే ప్రజాస్వామ్యం సేఫ్ - జగన్ ట్వీట్ వైరల్
Central Cabinet Decisions : పేదలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇక ఉచితంగా ఫోర్టిఫైడ్ బియ్యం
పేదలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇక ఉచితంగా ఫోర్టిఫైడ్ బియ్యం
Chandrababu: వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు చంద్రబాబు మద్దతు, మరో ఎన్నికలు సైతం నిర్వహణపై యోచన
వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు చంద్రబాబు మద్దతు, మరో ఎన్నికలు సైతం నిర్వహణపై యోచన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కశ్మీర్‌కి ఆర్టికల్ 370 మళ్లీ వస్తుందా, మోదీ ఉండగా సాధ్యమవుతందా?రాహుల్‌కి కిలో జిలేబీలు పంపిన బీజేపీ, విపరీతంగా ట్రోలింగ్Amalapuram News: అమ్మవారి మెడలో దండ వేసే గొప్ప ఛాన్స్, వేలంలో రూ.లక్ష పలికిన అవకాశంJammu and Kashmir: ముస్లిం ఇలాకాలో హిందూ మహిళ సత్తా! ఈమె గురించి తెలిస్తే కన్నీళ్లే!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag TCS: విశాఖలో టీసీఎస్ సంస్థ, 10 వేల మందికి ఉద్యోగాలు - మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేష్‌
విశాఖలో టీసీఎస్ సంస్థ, 10 వేల మందికి ఉద్యోగాలు - మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేష్‌
YS Jagan On Haryana : హర్యానా ఎన్నికలపై అనుమానాలు - బ్యాలెట్లతోనే ప్రజాస్వామ్యం సేఫ్ - జగన్ ట్వీట్ వైరల్
హర్యానా ఎన్నికలపై అనుమానాలు - బ్యాలెట్లతోనే ప్రజాస్వామ్యం సేఫ్ - జగన్ ట్వీట్ వైరల్
Central Cabinet Decisions : పేదలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇక ఉచితంగా ఫోర్టిఫైడ్ బియ్యం
పేదలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇక ఉచితంగా ఫోర్టిఫైడ్ బియ్యం
Chandrababu: వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు చంద్రబాబు మద్దతు, మరో ఎన్నికలు సైతం నిర్వహణపై యోచన
వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు చంద్రబాబు మద్దతు, మరో ఎన్నికలు సైతం నిర్వహణపై యోచన
TGPSC: అక్టోబరు 21 నుంచి 'గ్రూప్-1' మెయిన్స్ పరీక్షలు, హాల్‌టికెట్లు ఎప్పటినుంచంటే?
అక్టోబరు 21 నుంచి 'గ్రూప్-1' మెయిన్స్ పరీక్షలు, హాల్‌టికెట్లు ఎప్పటినుంచంటే?
Nobel Prize 2024: రసాయనశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌, ప్రొటీన్ పై పరిశోధలకు అత్యున్నత పురస్కారం
రసాయనశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌, ప్రొటీన్ పై పరిశోధలకు అత్యున్నత పురస్కారం
Akkineni Naga Chaitanya : నాగ చైతన్య X అకౌంట్ హ్యాక్... అనుమానాస్పద ట్వీట్ తో విషయం వెలుగులోకి.. 
నాగ చైతన్య X అకౌంట్ హ్యాక్... అనుమానాస్పద ట్వీట్ తో విషయం వెలుగులోకి.. 
SC Classification : తెలంగాణలో ఇక ఉద్యోగ  ప్రకటనలు ఎస్సీ వర్గీకరణ తర్వాతనే - కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో ఇక ఉద్యోగ ప్రకటనలు ఎస్సీ వర్గీకరణ తర్వాతనే - కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
Embed widget