అన్వేషించండి

Morning Top News: నేడు కిమ్స్‌ ఆస్పత్రికి అల్లు అర్జున్‌, ప్రెస్ మీట్‌లో కంటతడి పెట్టిన ఢిల్లీ సీఎం వంటి మార్నింగ్ టాప్ న్యూస్

Top 10 Headlines Today:ఏపీలో పండగ సెలవులు పది రోజులు, ఆరాంఘర్ ఫ్లైఓవర్ ప్రారంభించిన రేవంత్ రెడ్డి వంటి మార్నింగ్ టాప్ న్యూస్

Morning Top News:

విద్యార్థులకు పండగే

రాష్ట్రంలో సంక్రాంతి సెలవులపై కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ముందుగా ప్రకటించినట్లుగానే ఈనెల 10  నుంచి హాలిడేస్   19వరకు సెలవులు ఉంటాయని, 20 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం అవుతాయని పేర్కొంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

నేడు కిమ్స్‌ ఆస్పత్రికి అల్లు అర్జున్‌

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ కిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లనున్నారు. . అల్లు అర్జున్ మంగళవారం ఉదయం 9.30 - 10 గంటల సమయంలో కిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లే అవకాశం ఉందని ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

‘స్వర్ణ కుప్పం’.. విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరించిన సీఎం

హైదరాబాద్‌లో నాడు తాను చేసిన అభివృద్ధి ఫలాలే ఇప్పుడు వస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. కష్టపడితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ‘రాబోయే రోజుల్లో కుప్పంను ఎలా అభివృద్ధి చేస్తామో ప్రణాళికలు రచించాం. యేటా ఎలాంటి పనులు చేపట్టాలనేదానిపై ఆలోచన చేశాం' అని అన్నారు. ద్రవిడ యూనివర్సిటీలో ‘స్వర్ణ కుప్పం- విజన్ 2029’ డాక్యుమెంట్‌ ఆవిష్కరణ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

ఆరాంఘర్ ఫ్లైఓవర్ ప్రారంభించిన రేవంత్ రెడ్డి

హైదరాబాద్ లోని ఆరాంఘర్‌-జూపార్కు ఫ్లైఓవర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నగరం నుంచి బెంగళూరు హైవేకు ఉన్న ట్రాఫిక్‌ రద్దీని నివారించేందుకు జూపార్కు నుంచి ఆరాంఘర్‌ వరకు 4.08 కిలోమీటర్ల పొడవున దాదాపు రూ.800 కోట్లతో ఈ పైవంతెనను జీహెచ్ఎంసీ నిర్మించింది. జూపార్క్- ఆరాంఘర్ ఫ్లైఓవర్.. పీవీ ఎక్స్‌ప్రెస్‌ ఫ్లైఓవర్‌ తర్వాత నగరంలో రెండో అతిపెద్ద ఫ్లైఓవర్. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 గంజాయిపై ఉక్కుపాదం

ఏపీలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి తోట కనిపిస్తే కొట్టేయండి లేదా కాల్చేయండి అని ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లా   సాగు చేస్తున్న 8 ఎకరాల గంజాయి తోటల్ని అధికారులు ధ్వంసం చేశారు.  ఎక్కడైనా గంజాయి సాగు చేస్తున్నట్లు కనిపించినా, గంజాయి అక్రమ రవాణా గురించి తెలిసినా, డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించినా వెంటనే 1972 నెంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

తెలుగు రాష్ట్రాల్లో ఓటర్లు ఎంతమందంటే?

పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ రాకముందే అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల సంఘాలు సవరించిన ఓటర్ల జాబితాను సోమవారం విడుదల చేశాయి. ఏపీలో 2025 జనవరి 1వ తేదీ నాటికి ఓటర్ల సంఖ్య 4,14,40,447 గా ఉండగా.. తెలంగాణలో మొత్తంగా 3,35,27,925 మంది ఓటర్లు ఉన్నారు. తెలంగాణలో 3 కోట్ల 35 లక్షల 27 వేల 925 మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ తెలిపింది. ఇందులో పురుష ఓటర్లు 1,66,41,489 మందికాగా.. మహిళా ఓటర్లు 1,68,67,735గా ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

పండుగ వేళ శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి తెలుగు వారికి పెద్ద పండుగ. ఉత్తరాంధ్ర, కోనసీమ జిల్లాల్లో సంక్రాంతి సందడే వేరు. పండుగ వేళ ఈ ప్రాంతాలకు ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. ఇప్పటికే ప్రత్యేక రైళ్లను ప్రకటించిన ద. మ రైల్వే శ్రీకాకుళానికి మరిన్ని ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 11, 12, 15, 16 తేదీల్లో కాచిగూడ - శ్రీకాకుళం రోడ్ మధ్య.. ఈ నెల 8, 9 తేదీల్లో చర్లపల్లి -శ్రీకాకుళం రోడ్ మధ్య 2 రైళ్లు నడవనున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

ప్రెస్ మీట్‌లో కంటతడి పెట్టిన ఢిల్లీ సీఎం

మీడియా సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి కంటతడి పెట్టారు. రాజకీయాలు ఇంతగా దిగజారిపోవడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నేత రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం. ఆయన ఇటీవల అతిషి ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలు ఆమెను తీవ్రంగా బాధించడంతో.. సోమవారం ఆమె ప్రెస్‌మీట్‌లో కన్నీళ్లు పెట్టుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

భయపడొద్దు.. అప్రమత్తంగా ఉన్నాం: కేంద్రం

చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు కలవరపెడుతోన్న వేళ కేంద్ర ఆరోగ్యమంత్రి జె. పి. నడ్డా కీలక ప్రకటన చేశారు. ఈ వైరస్ వ్యాప్తిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. HMPV వైరస్‌పై కీలక ప్రకటన చేశామని.. దీనిపై అప్రమత్తంగా ఉన్నామని... ఈ వైరస్ కొత్తది కాదని.. 2001లోనే గుర్తించినట్లు వెల్లడించారు. అయినప్పటికీ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

కెనడా ప్రధాని రాజీనామా

కెనడా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో రాజీనామా చేశారు. లేబర్‌ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు జస్టిన్‌ ప్రకటించారు. కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్న తర్వాత వీటికి రాజీనామా చేస్తానని చెప్పారు. ట్రూడో వైదొలగాలంటూ సొంత పార్టీ నేతల నుంచి కొంతకాలంగా వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఈ మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Donald Trump: అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టక ముందే Elon Muskకు కీలక బాధ్యతలు అప్పగించిన డొనాల్డ్ ట్రంప్
Donald Trump: అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టక ముందే Elon Muskకు కీలక బాధ్యతలు అప్పగించిన డొనాల్డ్ ట్రంప్
CM Chandrababu: దావోస్ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు - 'బ్రాండ్ ఏపీ ప్రమోషన్' పేరుతో 5 రోజుల పర్యటన
దావోస్ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు - 'బ్రాండ్ ఏపీ ప్రమోషన్' పేరుతో 5 రోజుల పర్యటన
Neeraj Chopra Marriage: ప్రేమించి, పెళ్లి చేసుకున్న నీరజ్ చోప్రా.. వధువెవరో తెలుసా..! వివాహాన్ని రహస్యంగా ఉంచిన స్టార్ అథ్లెట్
ప్రేమించి, పెళ్లి చేసుకున్న నీరజ్ చోప్రా.. వధువెవరో తెలుసా..! వివాహాన్ని రహస్యంగా ఉంచిన స్టార్ అథ్లెట్
CapitaLand Investment: హైదరాబాద్​లో మరో ఐటీ పార్క్​.. రూ.450 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన క్యాపిటల్యాండ్​
హైదరాబాద్​లో మరో ఐటీ పార్క్​.. రూ.450 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన క్యాపిటల్యాండ్​
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

2028 లోపు ఏపీ మొత్తం పోలవరం ద్వారా నీళ్లు పరిస్తాంఎన్డీఆర్‌ఎఫ్‌ ను తెచ్చింది టీడీపీ  ప్రభుత్వమేరైతు బంధుపై ఎవరిదీ రాజకీయం?Priest Touches Hydraa Commissioner Feet | కన్నీళ్లతో హైడ్రా కమిషనర్ కాళ్లు పట్టుకున్న పూజారి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donald Trump: అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టక ముందే Elon Muskకు కీలక బాధ్యతలు అప్పగించిన డొనాల్డ్ ట్రంప్
Donald Trump: అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టక ముందే Elon Muskకు కీలక బాధ్యతలు అప్పగించిన డొనాల్డ్ ట్రంప్
CM Chandrababu: దావోస్ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు - 'బ్రాండ్ ఏపీ ప్రమోషన్' పేరుతో 5 రోజుల పర్యటన
దావోస్ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు - 'బ్రాండ్ ఏపీ ప్రమోషన్' పేరుతో 5 రోజుల పర్యటన
Neeraj Chopra Marriage: ప్రేమించి, పెళ్లి చేసుకున్న నీరజ్ చోప్రా.. వధువెవరో తెలుసా..! వివాహాన్ని రహస్యంగా ఉంచిన స్టార్ అథ్లెట్
ప్రేమించి, పెళ్లి చేసుకున్న నీరజ్ చోప్రా.. వధువెవరో తెలుసా..! వివాహాన్ని రహస్యంగా ఉంచిన స్టార్ అథ్లెట్
CapitaLand Investment: హైదరాబాద్​లో మరో ఐటీ పార్క్​.. రూ.450 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన క్యాపిటల్యాండ్​
హైదరాబాద్​లో మరో ఐటీ పార్క్​.. రూ.450 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన క్యాపిటల్యాండ్​
Anil Ravipudi: 'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్‌పై డైరెక్టర్‌ అప్‌డేట్‌ - పెద్ద ప్లానే వేసిన అనిల్‌ రావిపూడి, ఏం చెప్పారంటే?
'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్‌పై డైరెక్టర్‌ అప్‌డేట్‌ - పెద్ద ప్లానే వేసిన అనిల్‌ రావిపూడి, ఏం చెప్పారంటే?
SVSN Varma: 'నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలి' - మీడియా ఛానళ్లు వక్రభాష్యం చేయడం సరికాదన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ
'నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలి' - మీడియా ఛానళ్లు వక్రభాష్యం చేయడం సరికాదన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ
Anchor Suma: మరోసారి వెండితెరపై అలరించబోతోన్న యాంకర్‌ సుమ - ప్రియదర్శి హీరోగా ఆమె కీలక పాత్రలో 'ప్రేమంటే' చిత్రం
మరోసారి వెండితెరపై అలరించబోతోన్న యాంకర్‌ సుమ - ప్రియదర్శి హీరోగా ఆమె కీలక పాత్రలో 'ప్రేమంటే' చిత్రం
Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం -  భయంతో పరుగులు తీసిన భక్తులు
ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం - భయంతో పరుగులు తీసిన భక్తులు
Embed widget