అన్వేషించండి

Atishi : ప్రెస్ మీట్‌లో కంటతడి పెట్టిన ఢిల్లీ సీఎం - రాజకీయాల కోసం ఏమైనా చేస్తారా? అంటూ కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహం

Atishi : ఢిల్లీ సీఎం అతిషీ ప్రెస్ మీట్‌లో కంటతడి పెట్టారు. కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తోన్న బీజేపీ అభ్యర్థి బిధూరి అనుచిత వ్యాఖ్యలపై ఆమె తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

Delhi CM Atishi : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రోజుకో వార్త హల్చల్ చేస్తోంది. మొన్నటిదాకా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలు, ట్వీట్లతో దుమారం రేపగా.. ఇప్పుడు మరోసారి ఆ పార్టీకి సంబంధించిన వార్త చక్కర్లు కొడుతోంది. మీడియా సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి కంటతడి పెట్టారు. రాజకీయాలు ఇంతగా దిగజారిపోవడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నేత రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం. ఆయన ఇటీవల అతిషి ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలు ఆమెను తీవ్రంగా బాధించడంతో.. సోమవారం ఆమె ప్రెస్‌మీట్‌లో కన్నీళ్లు పెట్టుకున్నారు.

తనపై బీజేపీ నేత రమేష్ బిధూరి చేసిన అభ్యంతరకర ప్రకటనపై అతిషి విరుచుకుపడ్డారు. ఎన్నికల కోసం ఎంతవరకైనా దిగజారుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధుడని కూడా చూడకుండా దుర్భాషలాడతారా అని మండిపడ్డారు. రాజకీయాలు ఇంతలా దిగజారుతాయని అస్సలు అనుకోలేదన్నారు. తన తండ్రి జీవితమంతా టీచర్ వృత్తికే అంకితం చేశారని, పేద మధ్య తరగతికి చెందిన వేలాది మంది పిల్లలకు ఆయన పాఠాలు చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు తన తండ్రి వయసు 80 సంవత్సరాలని, ప్రస్తుతం అస్వస్థతతో ఉన్నారని, ఒకరి సాయం లేకుండా నడవలేకపోతున్నారని చెప్పారు. ఎన్నికల్లో గెలుపు కోసం తన తండ్రిపై బురద చల్లుతారా అని కోప్పడ్డారు. ఒక వృద్ధుడిపై నిందలు వేస్తారా అని ధ్వజమెత్తారు. బిధూరి పదేళ్లుగా కల్కాజీ నియోజకవర్గానికి ఏమైనా పనులు చేసి ఉంటే వాటిని ప్రచారంలో చెప్పుకోవాలి.. గానీ.. ఇలా ఓట్ల కోసం తన తండ్రిని అవమానించిడం సరికాదని అతిషి ఆవేదన వ్యక్తం చేశారు.

బిధూరి ఏమన్నారంటే..

అతిషి ఇంటిపేరు 'మార్లేనా'.. కానీ ఇప్పుడు ఆమె 'సింగ్'గా పేరు మార్చుకున్నారు అని రోహిణిలో జరిగిన బీజేపీ పరివర్తన ర్యాలీలో రమేష్ బిధూరి ఆరోపించారు. కల్కాజీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన అతిషి కొద్ది కాలం క్రితమే తన ఇంటిపేరును మార్చుకుని తన తండ్రినే మార్చేశారన్నారు. ఇది ఆప్ పాత్రను ప్రతిబింబిస్తుందని విమర్శించారు. కాగా కల్కాజీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా రమేష్ బిధూరి పోటీ చేస్తున్నారు.

హద్దులు మీరుతున్నారన్న కేజ్రీవాల్

బీజేపీ నేతలు హద్దులన్నీ దాటిపోయారంటూ రమేశ్ బిధూరిపై ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. "బీజేపీ నాయకులు అన్ని హద్దులు దాటిపోయారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషిని దుర్భాషలాడుతున్నారు. అతిషి జీ మీరు ఢిల్లీ మహిలందరికీ స్ఫూర్తి. ఇది మిమ్మల్ని మాత్రమే అవమానించినట్టు కాదు ఢిల్లీలోని  ప్రతి మహిళను అవమానించినట్టు. మహిళా ముఖ్యమంత్రిని అవమానించడాన్ని ఢిల్లీ ప్రజలు సహించరు. ఢిల్లీ మహిళలందరూ దీనికి ప్రతీకారం తీర్చుకుంటారు" అని కేజ్రీవాల్ X లో ఒక పోస్ట్ లో రాశారు.

Also Read : BRS MLC Kavitha: ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు- కేటీఆర్ ఏసీబీ విచారణ తీరుపై కవిత మండిపాటు

టాప్ హెడ్ లైన్స్

Fire Accident: చిలకలగూడలో భారీ అగ్నిప్రమాదం.. క్రాకర్ షాపులో పేలుళ్లతో కలకలం!
Fire Accident: చిలకలగూడలో భారీ అగ్నిప్రమాదం.. క్రాకర్ షాపులో పేలుళ్లతో కలకలం!
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
Israel Politics: ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Diwali Bonus: ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
AP Local Body Elections: పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. జైలు నుంచి జడ్పీటీసీ, ఒక్క ఓటుతో విజయాలు, సత్తా చాటిన సామాన్యులు!
పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. జైలు నుంచి జడ్పీటీసీ, ఒక్క ఓటుతో విజయాలు, సత్తా చాటిన సామాన్యులు!
Family Drama OTT : అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
Petrol Pump Free Services: పెట్రోల్ కొన్నా, కొనకపోయినా.. పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితం, మీ హక్కు కూడా!
పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా? ఈ 'ఉచిత' సౌకర్యాలు మీ హక్కు.. డబ్బులు అడిగితే ఇలా చేయండి!
MPTC Election Results: చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
AI Morphing Student Died: ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
Embed widget